మలక్‌పేట రౌడీకో చిట్కా

ఈ చిట్కా ఆయనొక్కడికే కాదు అందరికీ. అందరి దృష్టినీ ఆకర్షించడానికి ఆయన పేరుని వాడుకుంటున్నా. ;)

మనం బ్లాగుల్లో లేదా ఇతరత్రా రాసేప్పుడు తరచూ ఇతరుల మాటల్ని ఉటంకించాల్సి ఉంటుంది—వాటిపై స్పందించడానికి కావచ్చు లేదా కేవలం ఉదహరించడానికే కావచ్చు. అయితే, ఆ మాటలు ఇతరులవి అని తెలిపేందుకు (అవి మన మాటలుగా పాఠకులు పొరపాటుగా భావించే అవకాశానికి తావివ్వకుండా ఉండేందుకు) కొన్ని పద్ధతులని అనుసరిస్తూ ఉంటాం: కొటేషన్ మార్కుల మధ్యలో పెట్టడం, లేదా వాలు అక్షరాలలో చూపించడం గట్రా. వాద-ప్రతివాదాలుగా లేదా వ్యాఖ్య-ప్రతివ్యాఖ్యలుగా ఉన్న టపాలని చదివేప్పుడు కొన్నిసార్లు ఎవరిది ఏ పాఠ్యమో తెలియక అయోమయంగా ఉంటుంది. మళ్ళీ కాస్త వెనక్కి వెళ్ళి చదువుకు రావాల్సి ఉంటుంది. ఈ చిట్కా అటువంటి అయోమయాన్ని నివారించడంలో తోడ్పడుతుంది.

ఇతరుల పాఠ్యాన్ని మన రచనల్లో, పత్రాలలో ఉటంకించే ఉపయోగార్థం HTMLలో blockquote అనే మూలకం ఉంది. మన టపాల్లో దీన్ని వాడుకోవడానికి బ్లాగర్ మరియు వర్డ్‌ప్రెస్‌లు రెండూ ఈ సౌలభ్యాన్ని మనకి అందిస్తున్నాయి. మనం ఉటంకించాల్సిన పాఠ్యాన్ని ఎంచుకుని, క్రింద తెరపట్లలో చూపించిన blockquote బొత్తాన్ని నొక్కడమే.

బ్లాగర్‌లో
బ్లాగర్ టపా కూర్పరిలో Quote బొత్తం

వర్డ్‌ప్రెస్‌లో
వర్డ్‌ప్రెస్ టపా కూర్పరిలో Blockquote బొత్తం

ఒకవేళ నాలా మీరు నేరుగా HTMLలో వ్రాస్తూంటే, ఈ క్రింది విధంగా ఉపయోగించవచ్చు:

<blockquote>ఉటంకించిన పాఠ్యం</blockquote>

మీరు ఇతరుల బ్లాగుల్లో వ్యాఖ్యలు రాస్తున్నప్పుడు, వారి టపాలో ఒక ప్రత్యేక వాక్యాలకి వివరంగా స్పందిస్తుంటే, దాన్ని ఉదహరించడానికి పై సంజ్ఞావళిని వర్డ్‌ప్రెస్ బ్లాగుల్లో ఉపయోగించవచ్చు. అయితే, దీన్ని బ్లాగుస్పాట్ బ్లాగులు వ్యాఖ్యల్లో ఒప్పుకోవు.

మనం ఈ విధంగా ఉటంకించడం వల్ల, మన బ్లాగు అలంకారంలో పేర్కొన్న శైలికి అనుగుణంగా ఈ పాఠ్యం ప్రత్యేకంగా కనిపిస్తుంది. నేను ఈ blockquoteని ఉపయోగించిన టపాలు మచ్చుకి:

ఈ చిట్కా మీ టపాలను సిరిమయం చేస్తుందని ఆశిస్తూ…

ఆనంద బ్లాగాయనం!

9 thoughts on “మలక్‌పేట రౌడీకో చిట్కా

  1. Thank you Sir..
    మీనుండి మరో సలహా కావాలి.. ఇక్కడ అని వేరే రంగులో పెట్టి మధ్యలో లింక్ ఇస్తున్నారు కదా. అది ఎలా వుంచొచ్చు మేటర్ మధ్యలో. కాస్తా చెప్తారా..

  2. ఇదివరలో టపాలు చూడాలంటే కత్తి పేరో, ప్రవీణ్ పేరో వాడుకునేవారు జనాలు :)

    మంచి సమాచారం ఇచ్చారు. నేను చాలాసార్లు ఆ బటన్ చూసాను కానీ కొటేషన్ల కోసం అంత అవసరమా అనిపించి అది వాడలేదు. ఇప్పుడు మీ టపాతో అసలు ప్రయోజనం అర్ధం అయ్యింది. ధన్యవాదాలు.

  3. ఓ ఇదా దాని ఉపయోగం?
    బావుంది.
    కానీ దీని అవసరం ఎక్కువగా వ్యాఖ్యలు పెట్టేప్పుడు పడుతుంది. వ్యాఖ్యల పెట్టెలో ఇది HTMLగా పనిచేస్తుందా? ఇక్కడే ప్రయత్నిస్తున్నా ..

    రామునితోక పివరుండిట్లనియె

  4. అరె, భలే పని చేసిందే! :)
    అన్నట్టు చెప్పడం మర్చిపోయా, మీ టపా మార్కెటింగ్ ఐడియా సూపర్. బహుశా ప్రస్తుతం తెలుగు బ్లాగుల్లో Most recognizable name అయుండచ్చు.

Leave a reply to కొత్తపాళీ స్పందనను రద్దుచేయి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.