హీబ్రూ నుండి స్ఫూర్తిని పొందుదాం!

హీబ్రూ నించి స్ఫూర్తి పొందుదాం అని కొత్తపాళీ రాసారు. ఆయన అన్న వేమూరి వారి వీరతాళ్ళు (సుజనరంజని పత్రిక) లంకెలు:

వేమూరి వారు వీరతాళ్ళు అన్న బ్లాగుని కూడా మొదలుపెట్టారు. ఈ బ్లాగుని క్రియాశీలంగా కొనసాగించమని బ్లాగ్ముఖంగా వారికి నా అభ్యర్థన.

ఇక హీబ్రూ. హీబ్రూ గురించి నాకు పెద్దగా (అసలేమీ) తెలియదు. కొ.పా. గారు లంకిచ్చిన ఆడియో విని ఆపై వికీపీడియాలో చదివాను. రెండు ముక్కల్లో కావాలంటే, కొ.పా. గారి టపాలో చంద్ర మోహన్ గారి వ్యాఖ్య:

మరణించిన రెండువేల సంవత్సరాల తరువాత ఫీనిక్సు పక్షిలా పునర్జీవితమైన్ ఆధునిక ప్రపంచ భాషల్లో ఒకటిగా మారిన హిబ్రూ భాషకథ భాషాప్రేమికులకు ‘బైబిల్’ లాంటిది (literally!). ఇజ్రాయెల్ దేశం ఏర్పడిన తరువాత హిబ్రూను అధికార భాషగా నిర్ణయించాక చూసుకుంటే వారికి మిగిలి ఉన్న ఒకేఒక లిఖిత సాహిత్యం పాత నిబంధన గ్రంధం ఒక్కటే. అందులోని పదాలనుండే ఆధునిక భావనలకు పదబంధాలను సృష్టించవలసి వచ్చింది. ఉదాహరణకు, విద్యుత్తు అన్న మాటకు ఏంపదం వాడాలా అని వెదికి బైబిల్లో దేవుని తలచుట్టూ ఉన్న కాంతి చక్రానికి వాడిన పదం “హష్ మల్” ను ఖాయం చేశారు. దేవుని సంజ్ఞ అనే అర్థంలో బైబిల్లో వాడిన ‘రాంజోర్’ అన్న పదాన్ని ‘traffic signal’ కు వాడారు. ఇలా ఒక్కొక్క పదాన్నే కూర్చుకుంటూ పాతికేళ్ళలో సకల విజ్ఞానశస్త్రాలనూ వారిభాషలోకి అనువదించుకొన్నారు. వారిభాషలోనే చదువుకొంటున్నారు.

మనమూ హీబ్రూ నుండి స్ఫూర్తి పొందాలి అని నేను చెప్పగలను. హీబ్రూ వికీపీడియా నిన్ననే లక్ష వ్యాసాలకు చేరిందని ఇప్పుడే చదివాను.

This achievement is quite remarkable for a language with less than 10 million speakers, from which about 3.5 million are native speakers (data taken from the Hebrew wikipedia).

86 మిలియన్ల మంది మాట్లాడేవారు (అందులో 74 మిలియన్లు తెలుగుని మాతృభాషగా గలవారు) ఉన్న తెలుగు భాష వికీపీడియాలో 44,274 వ్యాసాలు ఉన్నాయి (గణాంకాలు తెలుగు వికీపీడియా నుండి.)

అవును, మనం తప్పకుండా హీబ్రూ నుండి స్ఫూర్తిని పొందాలి!

5 thoughts on “హీబ్రూ నుండి స్ఫూర్తిని పొందుదాం!

  1. ఎవరి తల్లి వారికిష్టం.ఎవరి మాతృభాష వారికి గొప్ప.సంస్కృతాన్ని కాదని LONG LIVE CLASSICAL DIVINE TAMIL అని తమిళులు వారి భాషాభివృధ్ధి కోసం శ్రమిస్తున్నారు.తమిళుల భాషాభిమానానికి వాళ్ళను మెచ్చుకోవాలి.తమిళనాట ముస్లిములు కూడా మసీదుల్లో ఉర్దూ అరబీ భాషలకు బదులు తమిళంలోనే మతవ్యవహారాలు నడుపుకొంటున్నారు.మనం కూడా తెలుగును మన తల్లి భాషగా దేవభాషగా LONG LIVE CLASSICAL DIVINE TELUGU అంటూ గౌరవిద్దాం.మత వ్యవహారాల్లో క్రైస్తవులు ఎలా తెలుగును వాడుతున్నారో అలా మిగతా మతాలు కూడా తెలుగును విస్తారంగా వాడాలి.భాషకు వాడుకే ప్రాణం.వాడని భాష పాడుపడుతుంది.74 మిలియన్లున్నమన తెలుగు బ్రతికే ఉంది.ఒక్కొక్క పదాన్నే కూర్చుకుంటూ పాతికేళ్ళపాటు శ్రమపడనక్కరలేనంత పుష్టిగానే ఉంది.సకల విజ్ఞానశస్త్రాలనూ మనభాషలోకి అనువదించుకొని మన భాషలోనే చదువుకొనే అవకాశాలు కలగాలి.తెలుగులో చదివినా ఉపాధి దొరకాలి.నిజమే హీబ్రూ నుండి స్ఫూర్తిని పొందుదాం!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.