తెలుగు బ్లాగుల దినోత్సవ శుభాకాంక్షలు!

అందరికీ తెలుగు బ్లాగుల దినోత్సవ శుభాకాంక్షలు! డిసెంబర్ రెండవ ఆదివారాన్ని మనం తెలుగు బ్లాగుల దినోత్సవంగా జరుపుకుంటాం. గత కొన్నేళ్ళుగా ఈ బ్లాగులో పెద్దగా ఏమీ రాయలేదు. కానీ ఏడాదికి ఒక టపా మాత్రం వచ్చింది. కాస్త ఈ బ్లాగు దుమ్ము దులుపుదామని ఈ టపా! అలా అని స్తబ్దుగా ఏమీ లేను. ట్విట్టరులో బాగనే వ్రాస్తున్నాను. ట్విట్టరు అనేది మైక్రోబ్లాగు కదా, దాన్నీ బ్లాగు లెక్కలోకే వేసేసుకోవచ్చు. 😉

అలాగే, తెలుగు కోరాలో కూడా కొన్ని జవాబులు వ్రాసాను. తెలుగుభాష అభివృద్ధిని గమనించే నిమిత్తం తెలుగు భాషాభివృద్ధి సూచీ అని ఒక కోరా వేదికను కూడా నిర్వహిస్తున్నాను.

ఈ మధ్య “సాంఘిక సమాలోచన కేంద్రం” అనే బృందంలో “తెలుగుభాషకు ఆధునిక హోదా: ఎందుకు, ఏమిటి, ఎలా” అనే ఒక ప్రసంగం చేసాను.

(అన్నట్టు, అది నా యూట్యుబ్ ఛానెలు. దానిలో చూడాల్సిన మరో వీడియో: ఆండ్రాయిడ్ ఫోన్లలో తెలుగులో వాయిస్ టైపింగ్ చేయడం ఎలా?)

కొంచెం పాతవైనా ఈ బ్లాగులో/బ్లాగుతో చెప్పుకోనివి ఇంకో రెండు అంశాలున్నాయి.

  1. తప్పొప్పులు ఆట. పుస్తకప్రదర్శనల్లో స్టాళ్ళకు వచ్చే వారితో సరదాగా ఆడించడానికి తెలుగు మాటల అచ్చుతప్పుల కార్డులను చూపించి సరైన మాటను ఎన్నుకోమనాలి అనే రహ్మనుద్దీన్ ఆలోచనను డిజిటల్ రూపంలో చిన్న ఆటగా చేసాను. చదువరి గారు అనేక తప్పొప్పుల మాటలను దీనిలో చేర్చడానికి పంపించారు. ఇది తెలుగు బ్లాగుర్లు రూపొందించిన ఆటే. ఫే‌స్‌బుక్‌లో రెండు సార్లు, వాట్సాప్‌లో ఓ ఐదారుసార్లు చక్కర్లు కొట్టింది.
    • అయితే ఇది ప్రస్తుతం తెలుగు తప్పొప్పుల ఆటగా కంటే మీ ఓపికను పరీక్షించే ఆటగా ఉంది. దీన్ని భవిష్యత్తులో మెరుగుపరిచి దశలు/స్థాయిలు చేర్చే ఆలోచన ఉంది. చూద్దాం, ఎప్పటిలోగా చేస్తానో.
  2. చుక్కేళి: మీరు నా బ్లాగును తొలి రోజులనుండి అనుసరిస్తూంటే ఈ ఆట మీకు తెలిసే ఉంటుంది. అప్పటి ఆ ఆటనే మెరుగుపరిచి కొత్తగా చేసాను.

అయితే, ట్విట్టరులో #తెలుగులోకావాలి అనే ట్వీటోద్యమాన్ని తప్పకచూడండి. తెలుగులో వస్తువులు, సేవలు, సమాచారం కావాలని మన అభిమాన సంస్థలను, ప్రభుత్వ శాఖలను, సినిమా పరిశ్రమ వారినీ అడుగుతున్నాం. మీరూ గొంతు కలపండి!

ఇంతే సంగతులు!

One thought on “తెలుగు బ్లాగుల దినోత్సవ శుభాకాంక్షలు!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.