పదహారేళ్ళ వయసు… పడిపడి లేచె మనసు…

లేఖినికి 16 ఏళ్ళు నిండాయి! పుట్టిన రోజు కానుకగా కొత్త సౌలభ్యాలతో లేఖిని ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంది! ఇప్పుడే ప్రయత్నించి చూడండి!! కొత్త విశేషాల మాలికే ఈ టపా: 💾 ఆటోసేవ్ దాదాపు లేఖిని మొదలయినప్పటినుండీ వాడుకరులు ఎక్కువగా అడిగిన సౌలభ్యం ఇదే. ఇక నుండి మీరు లేఖినిలో టైపు చేసేది ఆటోమెటిగ్గా మీ విహారిణిలోనే భద్రమవుతుంది. 🕙 చరిత్ర అనే బొత్తాన్ని నొక్కితే మీ పాత రాతలు కనిపిస్తాయి. వాటిలో ఒకదానిపై నొక్కితే అది … పదహారేళ్ళ వయసు… పడిపడి లేచె మనసు… ‌చదవడం కొనసాగించండి

15 వసంతాల లేఖిని

15 ఏళ్ళ క్రితం సరిగ్గా ఈ రోజు లేఖినిని తెలుగు బ్లాగులోకానికి పరిచయం చేసాను! తాత్కాలిక పరిష్కారం అనుకున్న చిన్న పనిముట్టు ఇన్నేళ్ళు కొనసాగడం నాకు ఇప్పటికీ ఆశ్యర్యమే. లేఖిని ధీర్ఘకాలిక సమస్యకి తాత్కాలిక పరిష్కారం మాత్రమే. తెలుగులో రాయడానికి లేఖిని కంటే సులభమైన, స్థిరమైన సాధనాలు రావాలి.— లేఖిని విడుదలైన 5 నెలలకి నా స్పందన లేఖిని పుట్టుక, పెరుగుదల ఇన్నేళ్ళూ లేఖినిని ఆదరిస్తూన్న తెలుగువారందరికీ నా కృతజ్ఞతలు!!

లేఖినికి కొన్ని మెరుగులు

కరోనా కట్టడి కాలంలో లేఖినికి కొన్ని చిన్న మెరుగులు: ఇప్పుడు కంప్యూటర్లకు వెడల్పాటి తెరలు ఉంటున్నాయి. లేఖిని సహాయపు పట్టికని దాచేసి వాడుకునేవారికి, ఈ మూల నుండి ఆ మూల వరకూ పెట్టె ఉంటుంది. అంత పొడవుగా ఉన్నదాన్ని చదవడమూ ఇబ్బందే. మీ కంప్యూటర్ తెర మరీ వెడల్పాటిది అయితే గనక టెపు చేసే పెట్టె, తెలుగు పాఠ్యం వచ్చే పెట్టె రెండూ పక్కపక్కనే ఆటోమెటిగ్గా సర్దుకుంటాయి. తగినంత జాగా లేకపోతే, ఇంతకు మునుపు లానే ఒకదాని … లేఖినికి కొన్ని మెరుగులు ‌చదవడం కొనసాగించండి

లేఖినిలో చిన్న చిన్న మార్పులు

చాన్నాళ్ళకు, లేఖినిలో కొన్ని మార్పులు! చిన్నివేలెండి. చిన్నమార్పుల్లో పెద్దది లేఖినిని స్మార్టుఫోన్లలో వాడుకునే వారికోసం. ఇప్పుడు లేఖిని చిన్న తెరలపై కూడా ఇమిడిపోతుంది. ఇప్పుడు లేఖినిలో రూపాయి (₹) గుర్తుని కూడా పొందవచ్చు. ఇందుకోసం $$ అని టైపు చెయ్యాలి. గతంలో # తర్వాత టైపు చేసే పాఠ్యం తెలుగులోకి మారేది కాదు. ఇప్పుడు మారుతుంది. అంటే # గుర్తుని ఇక వాడుకోవచ్చు. (ఏదైనా పాఠ్యం తెలుగు లోనికి మారకూడదనుకుంటే దాని చుట్టూ ` (backtick) లను … లేఖినిలో చిన్న చిన్న మార్పులు ‌చదవడం కొనసాగించండి

తమిళులు తెలుగు లిపి నేర్చుకోడానికి పనిముట్లు

తమిళులు (ఇంకా ఇతరత్రా కారణాల వల్ల తమిళం మొదటి భాషగా నేర్చుకున్నవారూ) తెలుగు లిపిని నేర్చుకోడానికి ప్రయత్నిస్తే వారికి ఎదురయ్యే ఇబ్బందుల్లో మొదటిది, అందరమూ ఊహించేది, మూల అక్షరాల రూపాల్లో భేదం. రెండవ ఇబ్బంది తెలుగు లిపికి ఉన్న ప్రత్యేక లక్షణాలు తమిళ లిపికి లేకపోవడం (ఇది అనూహ్యం). వెల్లడింపు: నాకు తమిళం రాదు. ఐదారు పదాలు తెలుసు, నాలుగైదు అక్షరాలు గుర్తుపట్టగలను. తెలుగు నేర్పడం గురించీ దానిలోని సమస్యల గురించీ అవగాహన తక్కువే. ఈ టపా … తమిళులు తెలుగు లిపి నేర్చుకోడానికి పనిముట్లు ‌చదవడం కొనసాగించండి

ఇన్‌స్క్రిప్ట్+ పూర్తిస్థాయి తెలుగు కీబోర్డు లేయవుటు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న లిపులన్నింటినీ కంప్యూటర్లలో ఉపయోగించుకునేందుకు వీలుగా యూనికోడ్ కన్సార్టియమ్ అన్ని అక్షరాలకూ స్థిరమైన సంకేతబిందువులను కేటాయిస్తుంది. వీటిల్లో ప్రస్తుతం వాడుకలో ఉన్న అక్షరాలే కాకుండా, కాలగతిలో కలిసిపోయిన అక్షరాలు కూడా ఉంటాయి. పురాతన గ్రంథాలను సాంఖ్యీకరించడానికి ప్రాచీన అక్షరాల/గుర్తుల అవసరం ఉంటుంది కదా. ఇవన్నీ యూనికోడ్ ప్రమాణంలో ఉన్నంత మాత్రన అంతిమ వాడుకరులకు అందుబాటులో ఉండకపోవచ్చు. ఎందుకంటే, వాటిని టైపు చెయ్యడానికి ఒక పద్ధతో పరికరమో కావాలి కదా! భారతీయ భాషలకు సంబంధించి యూనికోడ్ 6.0 … ఇన్‌స్క్రిప్ట్+ పూర్తిస్థాయి తెలుగు కీబోర్డు లేయవుటు ‌చదవడం కొనసాగించండి

గణతంత్ర దినోత్సవ కానుక: ఇన్‌స్క్రిప్ట్ లేఖిని

ఇన్‌స్క్రిప్ట్ లేఖిని తెరపట్టు

నా దృష్టిలో ఇన్‌స్క్రిప్ట్ అన్నది తెలుగులో టైపుచెయ్యడానికి అత్యుత్తమైన పద్ధతి. కాకపోతే, కొత్త వారికి దాన్ని నేర్చుకోవడమే కాస్త కష్టం (… అన్న భావన అంతే). ఇన్‌స్క్రిప్ట్ నేర్చుకునే వారికి ఉపయోగంగా ఉండాలన్న ప్రధాన ఉద్దేశం తోనూ, ఎప్పుడైనా ఇతరుల కంప్యూటర్లో త్వరగా టైపు చెయ్యాల్సి/చేసుకోవాల్సి వచ్చినప్పుడు (ఇన్‌స్క్రిప్ట్ స్థాపించే సమయం తీరికా లేనప్పుడు టైపు చేసుకోడానికి) వీలుగా ఉండాలన్న అనుబంధ ఉద్దేశంతోనూ దీన్ని తయారు చేసాను.

లేఖిని పనిచేయడం లేదా?

ఈ మధ్య లేఖిని పనిచేయడం లేదన్న పిర్యాదుని తరచూ వింటున్నాను. కానీ నా లినక్స్ కంప్యూటరుపై ఈ సమస్యని నేను చూడలేదు. బహుశా ఇది పాడయిన కోశం వల్ల అయ్యివుండొచ్చు. మీ జాల విహారిణి ఫైర్‌ఫాక్స్ అయితే ఇలా ప్రయత్నించి చూడండి: Tools మెనూ నుండి Options… అన్న ఆదేశాన్ని ఎంచుకోండి. ఆ తర్వాత వచ్చే కిటికీలో, (క్రింద తెరపట్టులో చూపినట్టు) Advanced అన్న ప్రతీకాన్నీ తర్వాత Network అన్న ట్యాబునీ ఎంచుకోండి. Offline Storage విభాగంలో … లేఖిని పనిచేయడం లేదా? ‌చదవడం కొనసాగించండి

ఆఫ్‌లైనులో లేఖినిని వాడుకోవడం ఎలా?

కంప్యూటర్లో తెలుగు టైపు చెయ్యడానికి అనేక పద్ధతుల్లో లేఖిని ఒకటి. ఇప్పటికీ లేఖినికి రోజుకి సగటున 1,250 సందర్శనలు నమోదవుతున్నాయి. లేఖినితో ఉన్న ప్రధాన ఇబ్బందులలో మొదటిది జాల సంధానం అవసరమవడం, రెండోది ఇక్కడ టైపు చేసి మరో చోటకి కాపీ చేసుకోవాల్సి రావడం. అయితే జాల సంధానం అవసరం లేకుండా లేఖినిని వాడుకోవచ్చు. ఇందుకు గల రెండు పద్ధతులను ఈ టపాలో వివరిస్తున్నాను. వీటివల్ల, మీకూ మరియు లేఖినికీ బ్యాండ్‌విడ్త్ వినియోగం తగ్గుతుంది. మొదటగా ఈ … ఆఫ్‌లైనులో లేఖినిని వాడుకోవడం ఎలా? ‌చదవడం కొనసాగించండి

ఆర్కుట్ లేఖిని సమూహంలో 400 సభ్యులు

శీర్షికే మొత్తం చెప్పేస్తుంది. మీరు ఆర్కుట్ సభ్యులైతే, లేఖిని సమూహంలో చేరండి. ఆర్కుట్ లేఖిని సమూహాన్ని దాదాపు 9 నెలల క్రితం (సెప్టెంబర్ 2006 లో) , చింతు ప్రారంభించాడు. ఆర్కుట్లో తెలుగు క్రమంగా (మెల్లగానైనా) పెరుగుతూంది. చాలా మంది తమ పేరుని తెలుగులో కూడా రాసుకుంటున్నారు. ఆర్కుట్ నుండి లేఖినికి నెలకు దాదాపు 300 హిట్లు వస్తున్నాయి, ప్రత్యేకించి ఈ సమూహాలనుండి: తెలుగెంత తీపో..! ఆడుతూ.....!!! పాడుతూ.....!! Telugu-తెలుగు లేఖిని