
15 ఏళ్ళ క్రితం సరిగ్గా ఈ రోజు లేఖినిని తెలుగు బ్లాగులోకానికి పరిచయం చేసాను! తాత్కాలిక పరిష్కారం అనుకున్న చిన్న పనిముట్టు ఇన్నేళ్ళు కొనసాగడం నాకు ఇప్పటికీ ఆశ్యర్యమే.
లేఖిని ధీర్ఘకాలిక సమస్యకి తాత్కాలిక పరిష్కారం మాత్రమే. తెలుగులో రాయడానికి లేఖిని కంటే సులభమైన, స్థిరమైన సాధనాలు రావాలి.
— లేఖిని విడుదలైన 5 నెలలకి నా స్పందన లేఖిని పుట్టుక, పెరుగుదల
ఇన్నేళ్ళూ లేఖినిని ఆదరిస్తూన్న తెలుగువారందరికీ నా కృతజ్ఞతలు!!
వీవెన్ గారూ,తెలుగుకు మీరు చేస్తున్న సేవ ఎప్పటికీ మరువలేనిది.కనికరించి కొనసాగించండి. తెలుగు నుడి ఊడిగంలో మీ అనుగరి(అభిమాని), పారుపల్లి కోదండ రామయ్య, ఊరట మించు వంచ మరవరి. 9505298565 telugukootami.org తెలుగును బతికించుకోవాలంటే తెలుగు భాషా ప్రాధికార సంస్థ ఏర్పాటు తో పాటు 1. ప్రతి కొలువుకు తెలుగులోనే పరీక్ష పెట్టాలనీ 2. ప్రతి బడి/కళాశాలలో తెలుగును ఒక తప్పనిసరి మందల [విషయం] గా నేర్పాలని 3. ఇతర రాష్ట్రాల్లో/దేశాల్లో ఉన్న తెలుగు వారికి తెలుగు చదివే వీలు మనం కలిగించాలని 4. అన్ని రాష్ట్రాల్లోనూ చనిపోతున్న తెలుగు మాటలను సేకరించి బతికించుకోవాలని, వాడాలని మనం జరుపుతున్న ఎసపు [ఉద్యమం] లో మీరు చురుకుగా పాల్గొనాలని విన్నపం.
తెలుగు భాషాభిమానులకు మీరిచ్చిన అపురూపమైన కానుక “లేఖిని”. వాడటానికి బహు సులువుగా ఉండే ఈ సాధనం బహుళ జనాదరణ పొందడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు.
మరెన్నో వసంతాలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను 👍.
వీవెన్ గారూ,
ఒక్కటే మాట. లేఖిని లేని నా ఇంటర్నెట్ ప్రయాణం ఉహించెలేను. మీకు సర్వదా కృతజ్ఞతలు.
హృదయపూర్వక అభినందనలు వీవెన్ గారూ!
తెలుగు సాహిత్యానికి మీ లేఖిని చేసిన/ చేస్తున్న సహకారం అసామాన్యమైనది. టెక్నాలజీ తెలియని నాలాంటి వయసుపైబడిన వారికి ముఖ్యంగా “మ్” “హుఁ” సంభాషణలలో వచ్చినపుడు టైపు చెయ్యడం తెలిసేది కాదు. అడగగానే, ఓపికగా నా సందేహాలూ, అవసరాలు తీర్చారు. మీకు నేను ఎంతైనా కృతజ్ఞుణ్ణి.
మీ లేఖినిలో తక్కిన వాటిలోలేని కొన్ని ప్రత్యేకతలున్నాయి. ఒక్కొక్క అక్షరాన్నే, గుణింతాన్నే టైపు చేస్తున్నప్పుడు సరిదిద్దుకోవడమే గాక, కాపీ, పేస్టు చేసిన తర్వాత, Word File లో కూడా, ప్రూఫ్ రీడింగ్ చేస్తున్నప్పుడు సరిదిద్దుకో వచ్చు. నేను చాలా Apps ప్రయత్నించేను గానీ, అన్నిటిలోకీ, నాకు లేఖిని ఉత్తమోత్తమంగా కనిపించింది.
15సంవత్సరాలు నిండిన సందర్భంలో లేఖినికీ, మీకూ అభినందనలతో పాటు, వంద సంవత్సరాలు నిరాఘాటంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
NS మూర్తి
నిస్సందేహంగా మీ పరికరం ఇంటర్నెట్ మీద తెలుగులో వ్రాయటానికి గొప్ప సాధనమైంది.ఒక గొప్పమలుపుకి కారణభూతమైంది. మీకృషికి ధన్యవాదాలు.
వీవెన్ గారూ! గుర్తుండి నేను ఓ పదేళ్ళనుండి నిరాఘాటంగా, నిస్సిగ్గుగా (ఉచితం కదా) లేఖిని వాడుకుంటున్నాను. మీకు కృతజ్ఞతలతో సరిపెట్టడమే నాకు చేతయినది.
రాజా.
ఇందిరాగాంధి అనే పేరులో గాంథీ’ అనే పదం వుంది. ఆ పదంలో వున్న ‘థీ’ అనే అక్షరం వ్రాసే విధానం తెలియచేయగలరు.
గాంధీ అనే రాస్తారు కదండీ. ఏమైనా dhii = ధీ, thii = థీ.