జాలంలో లంకెలనేవి ఆవశ్యకాలు. ఓ జాల పేజీకి మరే జాల పేజీల్లోనూ లంకె లేకపోతే ఆ పేజీ అనాధే. అసలీ లంకెల మీదే జాలం బతుకుతుంది. మీ టపాలో (లేదా పేజీలో) ఏదో విషయం ప్రస్తావించారనుకోండి, ఆ విషయానికి సంబంధించిన లంకెని కూడా ఇస్తే పాఠకులకు సౌకర్యంగా ఉంటుంది. లంకెలివ్వడంలో పోకడలు, లంకెలు ఎలా ఇవ్వాలో (ఇప్పటికే తెలియనివారికి) సూచనలు, గట్రాలు ఇవిగో.
ఇక బ్లాగుల్లో నేను గమనించిన ప్రకారం లంకెలివ్వడం మూడు రకాలుగా ఉంటుంది:
- చిరునామాని యధావిధిగా టపాలో ఇవ్వడం (లంకె లేకుండా). పాఠకులు దాన్ని చూడాలంటే, కాపీ చేసుకుని ఆ లింకుని విహారిణిలో తెరిచి చూడాలి.
- ఉదా.: మీ వర్డ్‌ప్రెస్ బ్లాగు టపాలలో లింకులెలా ఇవ్వాలో తెలుసుకోడానికి http://support.wordpress.com/links/ చూడండి.
- చిరునామాని లింకుతోనే యధావిధాగా ఇవ్వడం. ఈ లంకె నొక్కదగినదైనా, చూడటానికి బాగోదు.
- ఉదా.: తెలు-గోడు అబ్రకదబ్ర ఈ మధ్యే బ్లాగువార్షికోత్సవం జరుపుకున్నారు. http://anilroyal.wordpress.com/2009/05/07/%e0%b0%b8%e0%b0%bf%e0%b0%82%e0%b0%b9%e0%b0%be%e0%b0%b5%e0%b0%b2%e0%b1%8b%e0%b0%95%e0%b0%a8%e0%b0%82/
- లంకె పాఠ్యం నొక్కదగినదిగా ఉండాలి. చిరునామా పైకి కనబడకూడదు.
- ఉదా.: ఈ మధ్యే పర్ణశాల కూడా కొత్త సంవత్సరం జరుపుకుంది.
ఈ మూడింటిలోనూ, మూడవ పద్ధతి ఉత్తమం. లంకె అనేది మన వచనంతో కలిసిపోయి ఉంటుంది. చదవటానికి మధ్యలో ఆటంకం ఉండదు.
ఇక మీ మీ టపాల్లో లంకెలెలా ఇవ్వాలో చూద్దాం. ఈపాటికే ఈ సమాచారం జాలంలో ఉంది కాబట్టి, నేను కేవలం ఆ లంకెలిచ్చి చేతులు దులుపుకుంటాను.
- వర్డ్‌ప్రెస్ బ్లాగుల్లో లంకెలివ్వడం (వర్డ్‌ప్రెస్.కామ్ తోడ్పాటు సైటు నుండి).
- బ్లాగర్ (బ్లాగ్స్పాట్) బ్లాగుల్లో (బ్లాగర్ సహాయం నుండి)
టపాలు రాసేప్పుడు పై లంకెల్లో చూపించినట్టు లంకెవెయ్యడానికి బొత్తం ఉంటుంది. కానీ ఇతర బ్లాగుల్లో వ్యాఖ్యలు రాసేప్పుడు లంకె ఇవ్వాల్సివస్తే, కొంత HTML అవసరమవుతుంది. ఇదీ తేలికే. నమూనా కోడు ఇదీ:
<a href='లంకె చిరునామా'>లంకె పాఠ్యం</a>
పైన లంకె చిరునామా అన్న చోట మీరు లంకె వేయాలనుకుంటున్న టపా/పేజీ URL మరియు లంకె పాఠ్యం అన్న చోట, నొక్కడానికి కనబడాల్సిన పాఠ్యం ఇవ్వాలి. అది ఇలా కనిపిస్తుంది: లంకె పాఠ్యం.
ఆనంద జాలా లంఘనం!
నాది మూడో పద్ధతే. నేనైతే ఎప్పుడూ HTML format నే వాడతా. అలాగైతే లంకించుకునేది బ్లాగ్‌స్పాటో వర్డ్‌ప్రెస్సో మరోటో పట్టించుకునే పన్లేదు.
కామెంట్లు వేసేటప్పుడు కూడా, HTML రాకపోయిన, లంకె వేయటానికి నేను వాడే చిట్కా ఇది:
నా వర్డ్ ప్రెస్ బ్లాగులోనే, ఏదో ఓ కామెంట్ కి రెప్లై కొట్టి, అక్కడ ఇచ్చిన లింక్ ఆఫ్షన్ తో నా వచనంలోకి లంకె వేసేసుకొని,దాన్ని మొత్తం – కామెంటు ఎక్కడ వేద్దామనుకుంటున్నానో అక్కడ – కాపీ పేస్టేస్తాను.నో కోడింగ్…అంతా GUI
టెక్నిక్కిలు కదా! తట్టని వాళ్ళకోసం పనికి వస్తుందేమో అని ఈ కామెంటేస్తున్నాను.
అసాధ్యులు! :)
thank you!:)
Thank you
లేఖిని లో టైప్ చేసేటప్పుడు లంకె లు ఇవ్వగలమా? ఇవ్వగలిగితే ఎలా ఇవ్వగలం?
లేఖినిలో కేవలం సాదా పాఠ్యం మాత్రమే సాధ్యం. కనుక, లేఖినిలో టైపు చేసేసి, బ్లాగర్లోనో వర్డుప్రెస్లోనో పేస్టుచేసిన తర్వాత కావాల్సిన పదాలకు లంకెలు వేసుకోండి.
thank you.
మీకు నా లెంక తోనే ఇస్తున్నా అభి-వందనాలు
మాకు యునికోడ్లో vijayto, unicodelo, kruramrugam టైపుచేయడము ఎలాగో మాకు తెలియజేయండి.
మీరు యూనికోడ్ తెలుగుని ఏ పరికరం/పద్ధతి ద్వారా (లేఖిని, ఇన్స్క్రిప్ట్, బరహా?) టైపు చేస్తున్నారో చెబితే, అందుకు తగ్గ జవాబు చెప్పవచ్చు.