లేఖినికి కొన్ని మెరుగులు

కరోనా కట్టడి కాలంలో లేఖినికి కొన్ని చిన్న మెరుగులు:

  • ఇప్పుడు కంప్యూటర్లకు వెడల్పాటి తెరలు ఉంటున్నాయి. లేఖిని సహాయపు పట్టికని దాచేసి వాడుకునేవారికి, ఈ మూల నుండి ఆ మూల వరకూ పెట్టె ఉంటుంది. అంత పొడవుగా ఉన్నదాన్ని చదవడమూ ఇబ్బందే. మీ కంప్యూటర్ తెర మరీ వెడల్పాటిది అయితే గనక టెపు చేసే పెట్టె, తెలుగు పాఠ్యం వచ్చే పెట్టె రెండూ పక్కపక్కనే ఆటోమెటిగ్గా సర్దుకుంటాయి. తగినంత జాగా లేకపోతే, ఇంతకు మునుపు లానే ఒకదాని కింద ఒకటి కుదురుకుంటాయి.
  • లేఖినిలో మనం ఆంగ్లాక్షరాలలో రాసేది ఇంగ్లీషు కాదు. కానీ సైటు భాష తెలుగు అని సూచించినా కొన్ని విహారిణులు ఇంగ్లీషు స్పెల్‌చెకింగ్ చేస్తున్నాయి. చేతిఫోన్లలో అయితే, కీబోర్డులు వాక్యంలో మొదటి అక్షరాన్ని క్యాపిటలైజ్ చేసేస్తాయి. ఈ రెండూ లేఖిని వాడేవారికి అసౌకర్యంగా ఉండేవే. ఇప్పుడు, ప్రత్యేకించి స్పెల్‌చెక్ చేయవద్దని, ఆటోకరెక్షనూ, ఆటోక్యాపిటలైజ్ వద్దన్న సూచనలను టైపు చేసే పెట్టెకు తగిలించాను. వీటిని వివిధ విహారిణులు గౌరవిస్తే, కొంత సౌఖ్యంగా ఉంటుంది. (సుధీర్ ప్రతిస్పందన మేరకు.)
  • రెండు మూడు లైన్ల తర్వాత తెలుగుకి ‘వెనువెంటనే’ కాకుండా ‘పదానికి ఒకసారి’ మారుతుంది. ఇప్పుడు ఆ పరిమితిని మూడింతలు చేసాను. అంటే పదం పూర్తయ్యేవరకూ ఆగకుండా తెలుగులో ఎలా వస్తుందో చూసుకోవచ్చు. అయితే ఇది తక్కువ శక్తివంతమైన లేదా బాగా పాత కంప్యూటర్లపై లేఖినిని నెమ్మదింపజేయవచ్చు. (సుధీర్ ప్రతిస్పందన మేరకు.)
  • జూలై 13 తాజాకరణ: పై మార్పుల తర్వాత Tab మీట ఇంతకుముందులా పనిచేయడం లేదు. ఇప్పడు సరిచేసాను! ఇప్పుడు, ఎడమవైపు పెట్టెలో టైపు చేసాకా Tab నొక్కితే, ఫోకస్ కుడివైపు పెట్టెలోకి మారుతుంది, అందులో ఉన్న తెలుగు పాఠ్యం మొత్తం ఎంచుకోబడుతుంది. అంతేకాక అది క్లిప్‌బోర్డుకి కూడా కాపీ అవుతుంది. వేరే చోట పేస్టు చేసుకోవడమే. (సమస్యను నివేదించిన జంపాల చౌదరి గారికి కృతజ్ఞతలు!)

ఇవి మీకు నచ్చుతాయని ఆశిస్తున్నాను. వీటిని ప్రయత్నించి చూసి, మీ ప్రతిస్పందనను తెలియజేయండి.

🛈 ఒక వేళ లేఖిని పేజీ చిందరవందరగా కనిపిస్తున్నా, లేదా లేఖిని సరిగా పనిచేయకపోతుంటే, లేఖిని పేజీలో ఉన్నప్పుడు Ctrl + Shift + R అని కొట్టండి.

లేఖిని చిహ్నం

ఆనంద తెలుగు లేఖనం!

47 thoughts on “లేఖినికి కొన్ని మెరుగులు

    1. ఒక హల్లును హల్లుగానే ఉంచి, దాని పక్కన మరొక హల్లు చేరినప్పుడు ఆ రెండూ కలవకుండా ఏకపదంగా ఎలా ఉంచాలో తెలియలేదు. ఉదా. ఫేస్ బుక్ అన్నది మధ్యలో జాగా లేకుండా రాస్తే ఫేస్బుక్ ఔతోంది. ఇలాగ మధ్యలో జాగా లేకుండా తెలుగు లిపిలో రాయాలనుకున్న మరికొన్ని ఆంగ్ల పదబంధాలు: షార్ట్ కట్, ఆన్ లైన్, ఇంటర్ కాంటినెంటల్, …

      విడిగా కానీ మరొక అక్షరంతో కానీ రాయలేని మరొక అక్షరం: హల్లు “మ”. m, M ఏది విడిగా రాసినా, ం, ం అనే గుర్తులే వస్తున్నాయి. మరొక అక్షరాన్నికలిపితే మ వత్తు కానీ పూర్ణానుస్వారం కానీ వస్తున్నాయి.

      మరొక సమస్య: singly quote / (‘) ను మూసేటప్పుడు, ” ‘ ” గుర్తు మాయమై, దానికి ముందున్న హ్రస్వాక్షరం దీర్ఘంగా మారుతోంది. ఉదా: ‘raaju’ అని టైప్ చేస్తే ‘రాజూ గా మారుతోంది.

      ఈ సమస్యలకు సమాధానం చూపండి.

      ధన్యవాదాలు.

      భవదీయుడు

      ఇంద్రగంటి అనంత ప్రభాకర సత్యనారాయణ మూర్తి

      1. లేఖినిలో ^ గుర్తును పొత్లు తర్వాత అక్షరం ఒత్తుగా మారకుండా ఉండటానికి కేటాయించబడింది. ఉదాహరణకు రాంగ్‌నెంబర్, ఫైర్‌ఫాక్స్ వంటి మాటలలో ఇది అవసరం అవుతుంది
        fEs^buk

  1. ఈ మాట సైటులో వ్యాఖ్యలు ఇంగ్లీషులో type చేస్తున్నప్పుడు అక్కడే పదం మారిపోతుంది. ఇన్ బిల్ట్‌గా పదాలు కనిపిస్తాయి, క్లిష్టమైన వాటికి.
    తెలుగు రాసేటప్పుడు ఒక్కోసారి వాక్యం మధ్యలో ఇంగ్లీషు పదం రాయాల్సి వస్తే ఆ డ్రాప్ డౌన్ లిస్టు ఫీచర్ నాకు నచ్చింది.
    ఇక్కడైతే English అని backtick quotes లొ రాయాల్సి వస్తుంది.

    లేఖిని వాడతాను. కానీ ఈమాట సైట్లోకి వెళ్ళి అక్కడే తెలుగు రాసుకుంటున్నాను; అది ఒక కామెంట్ రాసే బాక్సులో నాకు కావాల్సింది రాసుకోవడం అలవాటయ్యింది.

    మీరు అటువంటివి చేయగలిగితే అందరికీ సదుపాయంగా ఉంటుంది.
    ఆలోచించండి.
    Sai Brahmanandam Gorti

  2. తెలుగులో టైపు చేయడానికి లేఖిని చాలా సదుపాయంగా ఉంది. ఉచితంగా సేవలు అందిస్తున్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదములు మరియు కృతఙ్ఞతలు.

  3. వ్రాయటం ఎలా?

    చాలా ఈజీ!

    దీన్ని చాలా సులభం క్రింద మార్చగలరు.

    లేఖిని వాడని రోజంటూ లేదు. మేము ఏ విధంగా అయినా మీకు సహాయపడగలమో అవసరం అయితే తెలుపగలరు

  4. ఇక్కడా టైప్ చేసిన ఆంగ్ల, మరియు తెలుగు పంక్తులని ఒకేసారి డౌన్లోడ్ చేసే సదుపాయం గురించి మీరు ఆలోచించగలరా?

    ప్రస్తుతానికి నేను ఇక్కడినుంచి వేరే వేరేగా కాపీ చేసి .డాక్ గా భద్రపరుస్తున్నాను.

  5. కొత్త వర్షన్ బాగుంది. Thank you. పాత వర్షన్ లో ఇంగ్లీష్ పదాలు రాయాల్సినప్పుడు # మధ్యలో రాస్తే అవి Translate అవ్వేవి కావు కానీ ఇప్పుడు ఆ సదుపాయం కనిపించడంలేదు ఇతరత్రా ఏమైనా ఉపయోగించాలంటారా లేదా రెండు భాషలూ కలిపి రాయలేమంటారా?

  6. కొత్త వర్షన్ బాగుంది. Thank you. పాత వర్షన్ లో ఇంగ్లీష్ పదాలు రాయాల్సినప్పుడు # మధ్యలో రాస్తే అవి Translate అవ్వేవి కావు కానీ ఇప్పుడు ఆ సదుపాయం కనిపించడంలేదు ఇతరత్రా ఏమైనా ఉపయోగించాలంటారా లేదా రెండు భాషలూ కలిపి రాయలేమంటారా?

  7. వీవెన్ గారు,
    ఆపిల్ ఐ-ఫోన్ కీపాడ్ లో backtick బటన్ లేదండి. మరి దీనికి ప్రత్యామ్నాయం ఏమన్నా సూచించగలరా? థాంక్స్.

    1. సరసింహారావు గారూ,

      స్పేసుకి ఎడమవైపున ఉన్న ?123 (లేదా 123) అనే మీటను నొక్కండి. అప్పుడు వచ్చే కీబోర్డులో అంకెలు, ఇతర గుర్తులూ ఉంటాయి. వాటిలో (apostrophe) ని వత్తి పట్టుకుంటే వచ్చే ఎంపికలలో ఈ బ్యాక్‌టిక్ ఉంటుంది. ప్రయత్నించి చూడండి.

      1. Yes. చూశాను, ఇలా hidden గా ఉన్నాయన్నమాట!థాంక్స్, వీవెన్ గారు.

  8. తెలుగుకి సాంకేతికతను అద్దడంలో మీ సేవ మరువలేనిది…మీలాగే మిగతా వారు కూడా భాషను సుసంపన్నం చేసే పనులు ముమ్మరంగా సాగించాలి-సాధించాలి.

  9. నమస్తే,
    నా అవసరం ఒకదాని కోసం తెలుగు RTS మరలా విడిగా implement చేసుకోవలసి వచ్చింది. దాని గురించి సందర్భం వచ్చినప్పుడు వివరిస్తాను.
    లేఖినిలో మీరు ^ అన్నది కాని _ అన్నది కాని ప్రోసెస్ చేయటం‌ లేదని గమనించాను. మీ గమనికకు తేవటం కోసమే ఈవ్యాఖ్య.

    1. నమస్కారం!

      లేఖినిలో ^ గుర్తును పొత్లు తర్వాత అక్షరం ఒత్తుగా మారకుండా ఉండటానికి కేటాయించబడింది. ఉదాహరణకు రాంగ్‌నెంబర్, ఫైర్‌ఫాక్స్ వంటి మాటలలో ఇది అవసరం అవుతుంది.

      ఇక _, ఇది టైపు చేసినది చేసినట్టు వస్తుంది. లేఖినిలో దీనికి ప్రత్యేకత ఏమీ లేదు.

  10. కాపీ పేస్టు చెసేటప్పుడు చాలా సమయం తీసుకుంటుంది. దయచేసి గమనించగలరు. ఎడిట్ చేసుకోవడానికి చాలా సమయం తీసుకుంటుంది. సరిచేయగలరు.

  11. ఎన్నో అంశాలు టైప్ చేయడానికి, దశాబ్దముగా పైగా లేఖినీ నేను వాడుతున్నాను. ఇందులో ఉండే అక్కురసీ నాకు ఎందులో కనిపించలేదు. మొబైల్ పైన కూడా ఇదే వాడతాను. ఒక సూచన: కొన్ని సంవత్సరాల క్రితము నిఖిలే వాడి, తెలుగు నుంచీ ఇంగ్లీష్ స్క్రిప్ట్ తయారు చేసుకొని తెలుగుది సేవ్ చేయలేదు. కానీ నిఖిలే ఇంగ్లీష్ నుంచీ లేఖినీలో కొన్ని తెలుగు పదాలు, ముఖ్యముగా ‘ ఉన్నవి రాలేదు. కొంత నష్టము. ఫరవాలేదు. సరి చేసిఉంటే సరే. లేకుంటే మీ దృష్టికి తీసుకురావాలని. లేఖిని.కామ్ అందచేస్తున్నందుకు ఎన్నో కృతజ్ఞతలు.

  12. లేఖిని చాలా బావుంది. ధన్యవాదములు. ఒకవేళ టైపు చేసిన అక్షరాలు డిలీట్ అయిపోతే వాటిని తిరిగి పొందే మార్గం (Ctrl+z లాంటి) అవకాశం ఉంటే తెలియజేయండి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.