నగరాలు పలు భాషల నగారాలు కావాలి

2030వ సంవత్సరానికల్లా ప్రపంచ జనాభాలో 60% నగరాలలోనే నివసిస్తారనీ, 2050 సంవత్సరానికి ఇది 70 శాతానికి చేరువకావచ్చనీ అంచనా. అభివృద్ధి చెందిన దేశాలలో ఇప్పటికే 80 శాతం పైబడి నగరాలలో నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో భాషల మీద పడే ప్రభావం, పరిరక్షణ గురించిన అంశాలతో ఈ వ్యాసం.

పదహారేళ్ళ వయసు… పడిపడి లేచె మనసు…

లేఖినికి 16 ఏళ్ళు నిండాయి! పుట్టిన రోజు కానుకగా కొత్త సౌలభ్యాలతో లేఖిని ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంది! ఇప్పుడే ప్రయత్నించి చూడండి!! కొత్త విశేషాల మాలికే ఈ టపా: 💾 ఆటోసేవ్ దాదాపు లేఖిని మొదలయినప్పటినుండీ వాడుకరులు ఎక్కువగా అడిగిన సౌలభ్యం ఇదే. ఇక నుండి మీరు లేఖినిలో టైపు చేసేది ఆటోమెటిగ్గా మీ విహారిణిలోనే భద్రమవుతుంది. 🕙 చరిత్ర అనే బొత్తాన్ని నొక్కితే మీ పాత రాతలు కనిపిస్తాయి. వాటిలో ఒకదానిపై నొక్కితే అది … పదహారేళ్ళ వయసు… పడిపడి లేచె మనసు… ‌చదవడం కొనసాగించండి

తెలుగు బ్లాగుల దినోత్సవ శుభాకాంక్షలు!

అందరికీ తెలుగు బ్లాగుల దినోత్సవ శుభాకాంక్షలు! డిసెంబర్ రెండవ ఆదివారాన్ని మనం తెలుగు బ్లాగుల దినోత్సవంగా జరుపుకుంటాం. గత కొన్నేళ్ళుగా ఈ బ్లాగులో పెద్దగా ఏమీ రాయలేదు. కానీ ఏడాదికి ఒక టపా మాత్రం వచ్చింది. కాస్త ఈ బ్లాగు దుమ్ము దులుపుదామని ఈ టపా! అలా అని స్తబ్దుగా ఏమీ లేను. ట్విట్టరులో బాగనే వ్రాస్తున్నాను. ట్విట్టరు అనేది మైక్రోబ్లాగు కదా, దాన్నీ బ్లాగు లెక్కలోకే వేసేసుకోవచ్చు. 😉 అలాగే, తెలుగు కోరాలో కూడా కొన్ని … తెలుగు బ్లాగుల దినోత్సవ శుభాకాంక్షలు! ‌చదవడం కొనసాగించండి

15 వసంతాల లేఖిని

15 ఏళ్ళ క్రితం సరిగ్గా ఈ రోజు లేఖినిని తెలుగు బ్లాగులోకానికి పరిచయం చేసాను! తాత్కాలిక పరిష్కారం అనుకున్న చిన్న పనిముట్టు ఇన్నేళ్ళు కొనసాగడం నాకు ఇప్పటికీ ఆశ్యర్యమే. లేఖిని ధీర్ఘకాలిక సమస్యకి తాత్కాలిక పరిష్కారం మాత్రమే. తెలుగులో రాయడానికి లేఖిని కంటే సులభమైన, స్థిరమైన సాధనాలు రావాలి.— లేఖిని విడుదలైన 5 నెలలకి నా స్పందన లేఖిని పుట్టుక, పెరుగుదల ఇన్నేళ్ళూ లేఖినిని ఆదరిస్తూన్న తెలుగువారందరికీ నా కృతజ్ఞతలు!!

లేఖినికి కొన్ని మెరుగులు

కరోనా కట్టడి కాలంలో లేఖినికి కొన్ని చిన్న మెరుగులు: ఇప్పుడు కంప్యూటర్లకు వెడల్పాటి తెరలు ఉంటున్నాయి. లేఖిని సహాయపు పట్టికని దాచేసి వాడుకునేవారికి, ఈ మూల నుండి ఆ మూల వరకూ పెట్టె ఉంటుంది. అంత పొడవుగా ఉన్నదాన్ని చదవడమూ ఇబ్బందే. మీ కంప్యూటర్ తెర మరీ వెడల్పాటిది అయితే గనక టెపు చేసే పెట్టె, తెలుగు పాఠ్యం వచ్చే పెట్టె రెండూ పక్కపక్కనే ఆటోమెటిగ్గా సర్దుకుంటాయి. తగినంత జాగా లేకపోతే, ఇంతకు మునుపు లానే ఒకదాని … లేఖినికి కొన్ని మెరుగులు ‌చదవడం కొనసాగించండి

అప్రమేయాలతో అప్రమత్తం!

ఈ వ్యాసం తొలుత తెలుగు వెలుగు పత్రిక ఏప్రిల్ 2020 సంచికలో “అప్రమేయాలతో జాగ్రత్త!” అనే శీర్షికతో ప్రచురితమైంది. అప్రమేయం అంటే? మన ప్రమేయం లేకుండానే కంప్యూటర్/మొబైలు అనువర్తనాలు గానీ, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు గానీ మన కోసం లేదా మన తరపున ఎంచుకునే ఎంపికలు, తీసుకునే నిర్ణయాలే అప్రమేయాలు. అంటే, వాటి తయారీదార్లు మనకోసం ముందుగా నిర్ధేశించిన అమరికలు అన్నమాట. ఉదాహరణకు, మీరు టీవీ పెట్టగానే ఏ ఛానెల్ వస్తుంది? మీరు టీవీ కట్టక మునుపు చూస్తున్న … అప్రమేయాలతో అప్రమత్తం! ‌చదవడం కొనసాగించండి

నేను పాడ్‌కాస్ట్ మొదలుపెట్టానోచ్!

నా పాడ్‌కాస్టు పేరు మాటల మూటలు. ఇది మన తెలుగు మాటల గురించి. మనం మర్చిపోతున్న తెలుగు మాటల్ని, అసలు మనం తెలుసుకోలేకపోయిన మాటలనూ, తిరిగి తెలుసుకునే ప్రయత్నంగా దీన్ని ఆరంభించాను. విన్న ప్రతీ ఒక్కరికీ, ఒక్కో భాగంలో ఒక్కో కొత్తమాట తెలిసినా అదే పదివేలు. మాటల మూటలు పాడ్‌కాస్టు వెబ్‌సైటు తెరపట్టు దీన్ని ఆపిల్ పాడ్‌కాస్ట్స్, గూగుల్ పాడ్‌కాస్ట్స్, స్పాటిఫై వంటి అన్ని రకాల పాడ్‌కాస్ట్ అనువర్తనాలలోనూ వినవచ్చు. లేదా నేరుగా జాలం లోనూ వినవచ్చు. … నేను పాడ్‌కాస్ట్ మొదలుపెట్టానోచ్! ‌చదవడం కొనసాగించండి

తెలుగు వినియోగదారులకు (భాషాభిమానులకు) మేలుకొలుపు

మన రోజువారీ జీవనంలో అనేక వస్తువులని వినియోగిస్తూంటాం, అనేక సేవలు పొందుతుంటాం. టూత్ పేస్టు నుండి గదిలో ఫ్యాను వరకూ, పచారీ సరుకులు ఇంటికే తెప్పించుకోవడం నుండి బీమా, బ్యాంకు సేవల వరకు. అయితే, వీటిలో ఎన్ని తెలుగులో ఉంటున్నాయి? ఆ పరిస్థితిని మనం ఎలా మార్చవచ్చు?

యంత్ర పరిణామ క్రమం

ఏకకణ జీవులుగా ప్రారంభమైన జీవం నేటి మానవుని వరకూ ఎన్నో మార్పులు చెందింది. మనం వాడే యంత్రాలు కూడా పరిణామం చెందుతూనే ఉన్నాయి. ఆదిమ మానవుడు రాళ్ళను ఆయుధాల గానో పనిముట్ల గానో వాడటంతో మొదలయిన యంత్ర ప్రస్థానం నేటి స్వయం చోదక (సెల్ఫ్ డ్రైవింగ్) వాహనాలు, గ్రహాంతర వాహనాలు, రోబోట్ల వరకూ ఇంకా వేగం పుంజుకుంటూనే ఉంది. ఇది ఎటువైపు వెళ్ళబోతూంది. ఆ క్రమాన్ని తరచి చూడడమే ఈ వ్యాస ఉద్దేశం.

లేఖినిలో చిన్న చిన్న మార్పులు

చాన్నాళ్ళకు, లేఖినిలో కొన్ని మార్పులు! చిన్నివేలెండి. చిన్నమార్పుల్లో పెద్దది లేఖినిని స్మార్టుఫోన్లలో వాడుకునే వారికోసం. ఇప్పుడు లేఖిని చిన్న తెరలపై కూడా ఇమిడిపోతుంది. ఇప్పుడు లేఖినిలో రూపాయి (₹) గుర్తుని కూడా పొందవచ్చు. ఇందుకోసం $$ అని టైపు చెయ్యాలి. గతంలో # తర్వాత టైపు చేసే పాఠ్యం తెలుగులోకి మారేది కాదు. ఇప్పుడు మారుతుంది. అంటే # గుర్తుని ఇక వాడుకోవచ్చు. (ఏదైనా పాఠ్యం తెలుగు లోనికి మారకూడదనుకుంటే దాని చుట్టూ ` (backtick) లను … లేఖినిలో చిన్న చిన్న మార్పులు ‌చదవడం కొనసాగించండి