తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా e-తెలుగు సంస్థ తరపున తెలుగు బాట అనే ఒక నడక కార్యక్రమాన్ని హైదరాబాదులో నిర్వహిస్తున్నాం. మీరందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాను.
నేనింత బాగా చెప్పివుండలేను, కనుక రెండు మెచ్చుతునకలని ఇక్కడ అతికించేస్తున్నాను.
రామదండు నడిచి రాక్షస సంహారం చేసింది. మహాత్ముడు నడిచి సత్యాగ్రహం చేసాడు, స్వాతంత్ర్యం తెచ్చాడు. నాటి నుండీ నేటివరకు ఒకమంచిపనికోసం నడకసాగించిన ఎవరూ ఓడిపోలేదు. తెలుగుభాష గొప్పతనాన్ని, భాష మీద మనకున్న అభిమానాన్ని ప్రకటించటానికి మనమంతా, కలిసి నడుద్దాం. ప్రపంచానికి తెలుగుభాష ఉనికిని చాటి చెబుదాం.
— నాగ మురళీధర్
మాటల్లోనూ రాతల్లోనూ నెమ్మది నెమ్మదిగా నిర్లక్ష్యానికి గురవుతోన్న మాతృభాషను కాపాడుకునేందుకు, భాష గురించిన చైతన్యాన్ని రగిలించేందుకు, భాష గురించి కొందరినైనా ఆలోచింపజేసేందుకు e-తెలుగు సంకల్పించిన “తెలుగు బాట” కార్యక్రమంలో పాల్గొని అందరం కలిసి భాషా చైతన్యం దిశగా భావావేశంతో, నాలుగడుగులు వేద్దాం!
— మనసులో మాట సుజాత
ఇతర ప్రాంతాల వారికి, వీలుంటే ఆ రోజు హైదరాబాదుకి రండి. లేదా, ఇలాంటి కార్యక్రమాన్ని మీ ఊళ్ళోనే మీ మిత్రులతోనూ తెలుగు భాషాభిమానులతోనూ కలిసి నిర్వహించండి.
ఆనంద తెలుగాయనం! *
chala manchi prayatnam prati telugu vadu palgonali
ఆహ…! ఈ తెలుగు బాటకు రాలేనందుకు చాల బాదగా ఉంది, నేను బెంగుళూరులో ఉండడం వలన అక్కడికి రాలేకపోతున్నాను…!
మీ కార్యక్రమం విజయవంతం కావాలని — శుభాకాంక్షలతో – మాలతి
All the best. I wish you success. May your walk become the talk of the town.
ayyo…memu bbsr lo vunnamu..
still ikkada try chestamu..tx.
తెలుగంటే ప్రేమ
తెలుగంటే ప్రాణం
తెలుగు అక్షరమే ప్రాణవాయువు
తెలుగు రాయడమంటే అమితానందం
ఇంత తియ్యటి తెలుగు కోసం
కాసింత చెమట కార్చాల్సిందే.
నేనూ మీతో నడుస్తాను
అలా నడవడానికి గర్వపడతాను.