రోజువారీ సమాచార వినియోగంలో తెలుగు — నా ఆకాంక్షలు

రెండు రోజుల క్రితం నేను మొదలుపెట్టిన తెలుగు సమాచార వినియోగంపై అభిప్రాయ సేకరణలో అడిగిన ప్రశ్నలు ఇవీ:

మీ సమాచారం వినియోగంలో తెలుగు శాతం పెరగాలనుకుంటున్నారా? లేదా, మీ తెలుగు వినియోగ ధోరణితో (నెమ్మదిగా అయినా పెరుగుతుందనే అనుకుంటున్నాను) మీరు సంతృప్తిగా ఉన్నారా?

ఇంకా మీరు తెలుగులో ఏయే సమాచారం/విషయాల్ని (ప్రత్యేకించి జాలంలో) చూడాలనుకుంటున్నారు? మరో రకంగా, మీకు తెలుగులో దొరకని సమాచారం ఏముంది?

వాటికి సంబంధించి నా జవాబులూ ఆకాంక్షలు ఇవీ:

నేను బ్లాగులోకంలో అడుగుపెట్టినప్పటికీ ఇప్పటికీ జాలంలో తెలుగు సమాచారం చాలా పెరిగింది. పెరుగుదల రేటు కూడా గణణీయంగానే ఉంది. ఏదైనా విషయం గురించి తెలుసుకోవాల్సివచ్చినప్పుడు, నేను ముందుగా తెలుగులో గూగిలిస్తున్నాను. మొన్నామధ్య హెపటైటిస్ బీ గురించి తెసుకుందామని సందేహిస్తూనే (అనగా, నేరుగా ఇంగ్లీషు వికీపీడియాకి వెళ్ళకుండా) తెలుగులో వెతికాను. నాక్కావలసిన సమాచారం తెవికీలో దొరికింది. కానీ ఇంకా చాలా విషయాల్లో తెలుగులో సమాచారం అందుబాటులో ఉండాలనుకుంటున్నాను. వివిధ రంగాల వారీగా చూద్దాం:

రాజకీయాలు, సామాజికం, గట్రా
ఈ విషయంలో కొన్ని తెలుగు బ్లాగులు (కొన్ని ఆవేశపూరిత టపాలను మినహాయిస్తే) మంచి విశ్లేషణలని సంస్థాగత ప్రసారమాధ్యమాలకి ధీటుగా అందిస్తున్నాయి. ముద్రణ మరియు ప్రసార మాధ్యమ రంగాల్లోని సీనియర్లులో కొందరు బ్లాగులు రాస్తూండడం శుభపరిణామం. కొందరు కేవలం జాలంలో పునఃప్రచురిస్తున్నారు. అందరూ క్రియాశీలంగా పాల్గొని అర్థవంతమైన చర్చలు జరగాలని ఆకాంక్షిస్తున్నావు.

వ్యక్తిగత స్థాయిలో, కనీసం తాము ఎదుర్కొంటున్న సామాజిక సమస్యలని చర్చించడం వంటివి మరిన్ని జరగాలి. ప్రాంతీయ విషయాలపైనా బ్లాగులూ పెరగాలనుకుంటున్నాను. కాస్త ఊపూ ఉత్సాహం కోసం మీరు అమెరికాలో లేకపోయినా సరే ఈ టపాని చూడండి.

కొన్ని సమస్యలు లేదా ప్రజా ఉద్యమాలపై (ఉ.దా. తెలంగాణ, బీటీ వంకాయ) జాలంలోనూ చెప్పుకోదగ్గ సమాచారం లభిస్తుంది, జనాల (మద్ధతు)ను కూడగట్టుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలుగు బ్లాగు లోకం కేంద్రగానే వివిధ నిరసనలూ, ఉద్యమాలూ పుట్టుకొచ్చే ధోరణీ కనిపిస్తుంది. వాటిల్లో మెరుగైన టీవీ కార్యక్రమాల కోసం అన్నది ప్రముఖం. :)

సాహిత్యం
సాహిత్యాభిలాష ఉన్నవారు ఈ విషయంపై రాస్తే బాగుంటుంది. వివిధ అంశాలపై ఇప్పటికే ఉన్న విషయ విస్తృతి నాకు తెలియదు. నా వరకూ అయితే జాల పత్రికలూ బ్లాగులూ ఈ రంగంలో సరిపడినంత విషయాంగాన్ని (హాస్యం, కవితలూ, కథలు, వ్యక్తిగత అనుభవాలు) విశేషమైన రీతిలో అందిస్తున్నాయి.

ముద్రణా పత్రికలూ మరియు ఇప్పటివరకూ వాటికే పరిమితమైన రచయితలు మెల్లమెల్లగా జాలంలోనూ తమ ఉనికికై ప్రయత్నాలు చేస్తున్నారు—పాత రచనలని జాలంలో పునఃప్రచురించడంతో మొదలుపెట్టి, కొత్త రచనలని సమాంతరంగా జాలంలోనూ అందిస్తూ.

భాషలను (ప్రత్యేకించి తెలుగు భాషని) నేర్చుకోడానికి సంబంధించి పెద్దగా వనరులు లేవు. ఈ దిశగా ప్రయత్నాలు—పాఠకుల సమస్యలకి పరిష్కారాలు సూచించడం, వ్యాకరణం, లిఖిత భాష శైలి వంటి వాటిపై ఆచరణీయ అంశాలతో వ్యాసాలు ప్రచురించడం, మొదలైనవి—జరగాలనుకుంటున్నాను.

సాంకేతికం
సాంకేతిక సమస్యలపై చర్చావేదికలూ, కొత్త అంశాలపై పరిచయ, వివరణాత్మక వ్యాసాలు ప్రచురించే జర్నళ్ళూ మరిన్ని రావాలి. ఒక సైటుగా టెక్‌సేతు శుభారంభం చేసింది. ఈ సైటు ఎదిగి తెలుగులో ఆర్స్ టెక్నికా కావాలని ఆశిస్తున్నాను.

సాధారణ ప్రజానికానికి ఉపయోగపడేలా బ్రాడ్‌బ్యాండ్ సమస్యలు, సెల్లు సమస్యలు మొదలగువాటికి పరిష్కారాలు తెలుగు లోనే అందించే, చర్చావేదికలూ, సైట్లూ రావాలనుకుంటున్నాను.

వ్యాపారం
సులేఖ.కామ్ వంటి సైట్లు పూర్తిగా తెలుగు లోనూ అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నాను. అలానే రెడ్‌బస్.ఇన్ (తెలుగు) వలె మరిన్ని సేవలు వస్తాయిని ఆశిస్తున్నాను.

ఇతరత్రా
వివిధ సంస్థల వెబ్ సైట్లు (ప్రత్యేకించి తెలుగు సంఘాల సైట్లు) తెలుగు ముఖాంతరాలతోనూ దర్శనమిస్తాయని ఆశిస్తున్నాను. మొదటి తరం తెలుగు గూళ్ళు (ఉ.దా. తెలుగుపీపుల్.కామ్) ఇప్పుడు కొంచెం కొంచెం యూనికోడ్లో దర్శనమివ్వడం ఆశాజనకం.

మరి, మీరేం కోరుకుంటున్నారు?

ఇవి కూడా చూడండి:

ప్రకటనలు

రోజువారీ సమాచార వినియోగంలో తెలుగు — నా ఆకాంక్షలు”పై ఒక్క స్పందన

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s