హైదరాబాదులో ఫైర్‌ఫాక్స్ 3 సంబరాలకు ఆహ్వానం!

మీ అభిమాన విహారిణి మంటనక్క యొక్క సరికొత్త వెర్షన్ (మంటనక్క ౩) ఈ నెల 17వ తేదీన విడుదలవ్వబోతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా మొజిల్లా పార్టీలు జరుగుతాయి.  హైదరాబాదులో ఓ పార్టీని నేను (స్నేహితుల సహాయంతో) నిర్వహిస్తున్నాను. హైదరాబాదులోని వారికి ఇదే మా ఆహ్వానం!

ముఖ్యమైన వివరాలు

తేదీ మరియు సమయం: ఆదివారం, జూన్ 22, 2008 సాయంత్రం 4 గంటలనుండి 6 వరకు

వేదిక: కృష్ణకాంత్ ఉద్యానవం, యూసఫ్ గూడ బస్తీ, హైదరాబాద్. (పటం)

ఏం చేస్తాం

  • మంటనక్క 3 మరియు ఇతర స్వేచ్ఛా మృదుపరికరాల సీడీలు ఇస్తాం.
  • మీ మీ అంకోపరులు (ఉంటే) తెస్తే, దానిలో మంటనక్క 3 ని స్థాపిస్తాం
  • మంటనక్క 3 విశేషాలని వివరిస్తాం.

మీ ఉపాయాలు మరియు సూచనలు ఇక్కడ పంచుకోండి. మీరు హైదరాబాదులో ఉంటే తప్పకరండి.

అన్నట్టు, విడుదల రోజునే అత్యధిక దిగుమతులు జరుపుకున్న ప్రపంచ రికార్డు ఉపకరణంగా మంటనక్కని నిలపడం కోసం మొజిల్లా మరియు దాని అభిమానులు సంకల్పించారు. మీరూ పాల్గొంటున్నారా? జూన్ 17న సిద్ధంగా ఉండండి.

తాజాకలం: సంబరాలు విజయవంతంగా జరిగాయి. పార్టీ నివేదికని చదివి విశేషాలు తెలుసుకోండి.

14 thoughts on “హైదరాబాదులో ఫైర్‌ఫాక్స్ 3 సంబరాలకు ఆహ్వానం!

  1. మొజిల్లా మూడు విడుదల సందర్భంగా,ఈ ఆవిష్కరణలో పాలుపంచుకున్న పరోపకారిపాపన్నలందరకూ నా శుభాభినందనలు.పార్టీ జరపనున్న వీవెన్ మహాశయుడికీ,అందుకు సహకరిస్తున్న వారి మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.
    విశాఖపట్నం లో ఎవరన్నా పార్టీ జరిపితే నా స్వంతఖర్చులతో వచ్చి,స్వీటూహాటూ తినివెళ్ళగలను

  2. ఫైరుఫాక్సు శిల్పులకు హార్దిక అభినందనలు. వాడేవారికి కూడా అభినందనలు. వాడని వారికి మాత్రం హెచ్చరిక.. ఫైరుఫాక్సో పెద్ద వ్యసనం. వాడటం మొదలుపెడితే వదల్లేం. మూడేళ్ళ కిందట వాడటం మొదలెట్టాక, అయ్యీ అనేదొకటుందని మర్చిపోయాను నేను.

    పేరుకు తగ్గట్టే దీనిలో అనేక జిత్తులున్నాయి. మన తెలుగువారి కోసం నాగార్జున ఇందులో గొప్ప సౌకర్యం ఒకటి పెట్టారు. ఆ పొడిగింతను పెట్టేసుకున్నామంటే అదిక ఫైరుఫాక్సు కాదు.. అసలుసిసలు తెలుగు మంటనక్కే! దీనికి ప్రచారం చేస్తున్న వీవెనాదులకు నెనరులు, అభినందనలు.

  3. కొత్తపాళీ, అవును ప్రపంచ రికార్డుకైతే, 24 గంటలలోనే దిగుమతి చేసుకోవాలి. జూన్ 17న విడుదలవుతుంది. ఏ సమయమో ఖచ్చితంగా ఇప్పుడే తెలియదు. కానీ అప్పుడు మీకు గోల వినిపిస్తుంది. ఆ రోజు ఇక్కడ, ఇక్కడ, లేదా ఇక్కడ చూస్తూ ఉండండి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.