బిగ్ బక్ బన్నీ, చిట్టి ఆనిమేషన్ సినిమా

బిగ్ బక్ బన్నీ బిగ్ బక్ బన్నీ అనేది ఓ చిన్న ఆనిమేషన్ సినిమా. ఈ సినిమా ప్రత్యేకతలు ఏమిటంటే, దీన్ని స్వేచ్ఛా మృదు పరికరాల (ముఖ్యంగా బ్లెండర్) ను ఉపయోగించి తయారు చేసారు మరియు ఇది ఓపెన్ సినిమా. ఓపెన్ సినిమా అంటే కేవలం సినిమా మాత్రమే కాకుండా దీని మూల ఫైళ్ళు (పాత్రలు వాటి ఆనిమేషనులు, టెక్చరులు, మొదలైనవి) కూడా మీరు పొందవచ్చు. వాటిని స్వేచ్ఛగా ఉపయోగించుకోవచ్చు కూడా. అంటే, సినిమా ఎలా తీసారో నేర్చుకోవచ్చు, ఇంకా మీకు ఉత్సాహం ఉంటే అదే సినిమాకి రెండవ భాగం కూడా తీయవచ్చు.

ఇక ఈ సినిమా నాకెలా అనిపించిందంటే… ఈ సినిమాలో రంగులు మరియు ప్రకృతి తాజాగా ఉన్నాయి. చిట్టి సినిమా అయినా చమక్కులు బాగున్నాయి (ముఖ్యంగా చిట్టచివరి చమక్కు, పేర్లు అయిపోయాయని కట్టేస్తే మిస్సవుతారు మరి). మీ కోసం ఓ తెరపట్టు.

(పెద్ద పరిమాణంలో చూడడానికి బొమ్మపై నొక్కండి)

ఈ పది నిమిషాల సినిమాని మీరు ఉచితంగా దిగుమతి చేసుకోవచ్చు. ఇలాంటి ఓపెన్ సినిమాలను ప్రోత్సహించాలనుకుంటే, ఈ సినిమా DVDని ఆ సైటు నుండి కొనుగోలు చేయండి.

ప్రకటనలు

10 thoughts on “బిగ్ బక్ బన్నీ, చిట్టి ఆనిమేషన్ సినిమా

  1. న వయసు 66 సం/లు.ఏదో మా అమ్మాయి పమ్పిన acer pc with windowsXP office proffessional ని వాడుతూ/అడుతూ/ఉత్తరాలు రాస్తూ కాలక్శేపం చేస్తున్నాను.ఈ లోగా అంటే ఎండాకాలంలో వీవెన్ పరిచయం తో ఇదిగో ఇలా తెలుగు లోవ్రాయగలుగుతున్నాను.
    ఈమ్కా పూర్తిగా PC మీద పనిచేయడం అవగాహనకు రాలేదు.మరి ముసలాడిని కదా?ఏమి కొడ్తే ఇది వచ్చిందీ/అది వచ్చిమ్దీ గుర్తుండక చస్తున్నాననుకోండి.
    నచ్చినవారు ఆడైనా/మగైనా వ్రాయగలరు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s