హైదరాబాదులో ఫైర్‌ఫాక్స్ 3 పార్టీ నివేదిక

హైదరాబాదులో నిన్న (ఆదివారం, జూన్ 22) ఫైర్‌ఫాక్స్ 3 పార్టీ విజయవంతంగా జరిగింది. మొత్తం 25గురు  ఫైర్‌ఫాక్స్ అభిమానులు హాజరయ్యారు. వయస్సుతో నిమిత్తం లేకుండా 15 సంవత్సరాల నుండి 70 పైబడిన వారి వరకూ వీరిలో ఉన్నారు. మీడియా నుండి సాక్షి విలేఖరి దీప వచ్చారు.

మొదటగా పరిచయాలతో (పేరు తదితర వివరాలతో బాటు, మంటనక్కతో అనుబంధం ఎలా, ఎప్పటినుండి అన్న వివరం కూడా) ప్రారంభించాం. తర్వాత నేను సీడీలు పంచి దానిలోని ఉపకరణాల గురించి క్లుప్తంగా వివరించాను. పవన్ అవసరమైన చోట వివరాలను జోడిస్తూ అందరికీ అర్థమయ్యేట్టు చెప్పారు. ఫైర్‌ఫాక్స్ 3లోని విశేషాల గురించి మొదలు పెడుతూ పెర్ఫామెన్స్ పరంగా ఈ వెర్షను చాలా మెరుగైనట్టు గమనించానని శ్రీధర్ వివరించారు.  ఆపై ఫైర్‌ఫాక్స్ 3లోని విశేషాలని నేను, శ్రీధర్, పవన్ లు వివరించాం. వెర్షన్ 3లో మెరుగైన విశేషాలు వేగం (improved performance), చిరునామా పట్టీ (location bar), దిగుమతులు నిర్వహణ (download manager), ఒకే నొక్కు బుక్‌మార్కింగ్, font and text rendering, SVG తోడ్పాటు అలానే కొత్త సౌలభ్యాలైన పూర్తి పేజీ జూమ్, విస్టా థీము, ఇంకా అనేకాల గురించి మాట్లాడుకున్నాం. ఫైర్‌ఫాక్సులో తమకు నచ్చే విషయాల గురించి కూడా అందరూ చెప్పారు.

కొత్త విశేషాలపై వివరణలకోసం Field Guide to Firefox 3 చూడమని సూచించాం.

అందరి సందేహాలకు శ్రీధర్ మరియు పవన్ సూక్ష్మ వివరాలతో సహా సమాధానాలు ఇచ్చారు. ఇక పొడగింతల గురించి ప్రస్తావల రాకుంటా ఎలా ఉంటుంది. ఆడ్ బ్లాక్ ప్లస్, హిట్-ఎ-హింట్, డెలీషియస్, గ్రీస్ మంకీ, బెటర్ జీమెయిల్, FireFTP లాంటి పొడగింతల గురించి చెప్పుకున్నాం. కొన్ని ముఖ్యమైన కీబోర్డు షార్టుకట్లను తెలుపమని రావుగారు అడుగగా కొన్నింటిని చెప్పాం.

మనకి ఏ కంప్యూటర్లో నైనా అందుబాటులో ఉండేట్టుగా మన బుక్‌మార్కులు (పేజీకలు), సంకేతపదాలు (passwords) లాంటివి అంతర్జాలంలో దాచుకోలేమా అన్న ప్రశ్నకి గూగుల్ సింక్రనైజర్ ఉందని అలానే మొజిల్లా ప్రయోగశాల నుండి వీవ్ అనే కొత్త పొడగింత రాబోతుంది అని నేను చెప్పా.

ఫైర్‌ఫాక్స్  యొక్క హైదరాబాదు వాడుకరుల కోసం ఓ గూగుల్ గుంపు ఉన్నట్టు అందరికీ తెలియదని రావుగారన్నారు.

ఇతరత్రా విశేషాలు: కట్టా విజయ్ ఉబుంటు సీడీలను పంచారు. కందర్ప కృష్ణమోహన్ తన మార్కు చిట్టికాజాలను తెచ్చి అందరి నోళ్ళను తీపిచేసారు.

హైదరాబాదులో ఫైర్‌ఫాక్స్ 3 పార్టీ గ్రూప్ ఫొటో (ఫొటో: సీబీరావు)

చివరిగా గ్రూప్ ఫొటో దిగి, అటునుండి క్యాంటీనుకి వెళ్ళి టీ తాగి, సెలవు తీసుకున్నాం.

ఈ పార్టీ విజయవంతంగా జరగడంలో చాలా మంది సహకారం ఉంది. ముఖ్యంగా నల్లమోతు శ్రీధర్, కట్టా విజయ్, పవన్, సీబీరావు మరియు కృష్ణమోహన్. మీకు నెనర్లు. వచ్చిన వారందరికీ నా కృతజ్ఞతలు!

11 thoughts on “హైదరాబాదులో ఫైర్‌ఫాక్స్ 3 పార్టీ నివేదిక

 1. సూపర్… బాగా జరిగినట్టుంది.
  ఇంత మంది ఒక దగ్గర కలిసి మంచి ఉపకరణం విడుదలని జరుపుకోవడం ఆనందం.
  ఇంకా ఎంతో మందికి ప్రోత్సాహం కలిగిస్తుందని నా నమ్మకం.

 2. ఫైర్ ఫాక్సు అభిమానులందరికి నమస్కారము.
  త్వరలో పైర్ ఫాక్సు తెలుగు వస్తుంది. అప్పుడు మీరంతా తెలుగు వర్షన్ కి మారి దానిని మెరుగు పెట్టటానికి తోడ్పడతారని ఆశిస్తాను. ప్రస్తుతపు పరిస్థితి కోసం ఈ వెబ్ పేజీ చూడండి.
  http://wiki.mozilla.org/%E0%B0%AB%E0%B1%88%E0%B0%B0%E0%B1%8D%E2%80%8D%E0%B0%AB%E0%B0%BE%E0%B0%95%E0%B1%8D%E0%B0%B8%E0%B1%8D_%E0%B0%A4%E0%B1%86%E0%B0%A8%E0%B1%81%E0%B0%97%E0%B0%BF%E0%B0%82%E0%B0%AA%E0%B1%81

  అర్జున

 3. అందరికి చిన్న మనవి ఫైర్‌ఫాక్స్ 3 బదులు మిరు ఏపిల్ బ్రౌజర్ సఫారి 3.1.2 వాడండి. తెలుగు చాలా స్పష్టంగా వుంది. డౌన్లోడ్ చేసుకొవాలంటే http://www.apple.com/safari/download/

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.