ఇన్‌స్క్రిప్ట్, ఆపిల్ కీబోర్డు లేయవుట్లు

ఈ టపా కార్తిక్ వ్రాసిన ఇన్‌స్క్రిప్ట్ గొప్పదా లేక ఆపిల్ కీబోర్డు గొప్పదా అన్న టపా లోని కొన్ని విషయాలపై నా స్పందన. ఆ టపాపై అక్కడే వ్యాఖ్య రాస్తే, బ్లాగర్ ఏదో తిట్టి నా వ్యాఖ్యని మింగేసింది. ఫార్మాటింగు, లంకెలతో ఒక టపాగా వ్రాస్తే మంచిదని ఇలా ఇక్కడ.

ఏది గొప్పది అని నిర్ణయించను గానీ, నేను మాత్రం ఇన్‌స్క్రిప్ట్ కీబోర్డు లేయవుటుని సిఫారసు చేస్తాను.

 • ఇన్‌స్క్రిప్ట్ మరియు అనూ: బయట మార్కెట్లో డీటీపీ చెయ్యడానికి ఎక్కువగా అనూ స్క్రిప్ట్ మేనేజరుని (దానిలో ఆపిల్ కీబోర్డు లేయవుటుని) ఉపయోగిస్తారు. కానీ, అనూ ఉపయోగించడానికి ఆపిల్ కీబోర్డు లేయవుటు రావాల్సిన పనిలేదు. అనూలో కూడా ఇన్‌స్క్రిప్ట్ లేయవుట్ ఉంది. దీన్ని DOE అని పిలుస్తారు. (అనూ 7 సంగతి నాకు తెలియదు మరి.)
 • యూనికోడ్ టైపు చెయ్యడానికి ఆపిల్ లేయవుటు పరికరం: ఆ పరికరాన్ని నేను కేవలం ఇప్పటికే ఆపిల్ లేయవుటు తెలిసివున్న వారు బ్లాగుల్లోనూ గట్రా (మరో లేయవుటో, లిప్యంతరీకరణో నేర్చుకోనవసరం లేకుండా) యూనికోడ్ తెలుగు టైపు చెయ్యడానికి ఉపయోగపడుతుందని మాత్రమే తయారుచేసాను. ఆ లేయవుటు విశ్వవిజేత అవ్వాలని కాదు. కనుక “వీవెన్ గారు ఆపిల్ ను డెవలప్ చేయడం స్టాండర్డ్స్ కి మొదటి మెట్టు” … అన్న ఆయన వ్యాఖ్యతో నేను ఏకీభవించలేను.
 • రివర్స్ టైపింగ్:

  మనం పుస్తకంలో రాసే తెలుగు భాషకు ఇక్కడ రివర్సులో టైపు చేయాలి. (మార్గాలు అని రాయాలంటే మా తరువాత “ర + గ వత్తు +దీర్గం”) మమూలుగా అయితే “ర + దీర్గం+ గ వత్తు” అంటే ముందు ఈ రివర్సు కు అలవాటు పడాలి. (వీవెన్ గారి ఆపిల్ లో కూడా ఇదే ఇబ్బంది.)

  ఈ సమస్య అనూకి లేదా ఇతర సాంప్రదాయ పద్ధతులకి అలవాటు పడినవారికే అనుకుంటాను. ఇన్‌స్క్రిప్ట్, ఆపిల్ మాత్రమే కాకుండా యూనికోడ్లో ఏ రకంగా వ్రాసినా ఈ రివర్స్ పద్ధతే. ఇది మనం పలికే విధానానికి దగ్గరగా ఉంటుంది. మార్గాలు అన్న పదాన్ని ఎలా పలుకుతాం. కాస్త నెమ్మదిగా పలికి చూడండి… మా ర్ గా లు. ఇలా అయితే మన మెదడుకి చేతివేళ్ళకి సిక్రనింగు బాగా ఉంటుందనిపిస్తుంది.

 • ఇంగ్లీషు – తెలుగుల మధ్య మారడం: Alt + Shift మీటలు కష్టమైతే, వీటిని మనకిష్టమైన మీటకి మార్చుకోవచ్చు కూడా. నేను Caps Lockని మార్పిడి మీటగా ఉపయోగించి అలవాటుని మార్చుకోలేక తిరిగి Alt + Shiftకి మళ్ళాను.
 • ఇన్‌స్క్రిప్ట్ లేయవుటుకి తాజాకరణలు: 2010లో C-DAC వాళ్ళు ఇన్‌స్రిప్ట్ కీబోర్డుని మెరుగుపరుస్తూ—యూనికోడ్ ప్రమాణం లోని అన్ని తెలుగు అక్షరాలను మరియు తెలుగుకి అవసరముండే భారతీయ సంజ్ఞలనూ టైపు చెయ్యగలిగేలా విస్తరిస్తూ—విస్తరిత ఇన్‌స్క్రిప్ట్ కీబోర్డ్ లేయవుట్ 5.2 అని రూపొందించారు. (ఈ పుట లోని మొదటి లంకె ద్వారా ప్రతిపాదిత లేయవుటుని దించుకోవచ్చు.) ఈ విస్తరిత లేయవుటుని లినక్సులో ఉపయోగించుకొనే విధంగా m17n కొరకు ఇన్‌పుట్ పద్ధతిని నేను తయారు చేసాను. (దీని గురించి వివరంగా మరోసారి వ్రాస్తాను. వ్రాసాను, చూడండి.)

ఇంతే సంగతులు!

4 thoughts on “ఇన్‌స్క్రిప్ట్, ఆపిల్ కీబోర్డు లేయవుట్లు

 1. నాకు ఆపెల్ కంప్యూటర్లో తెలుగు టైపింగ ఎలా చేయాలో ఎవరన్న తెలుపగలరు..!! మ్యాక్‌బుక్ ప్రో వాడుతున్నాను నేను..తెలుగు టైపింగ్ ఎలా చేయాలో తెలీక ప్రస్తుతం విండోస్ డెక్స్ టాప్ వాడుతున్నాను..దయచేసి..ఎవరన్న మ్యాక్‍౬బుక్ ప్రోలో తెలుగు అక్షరాలను బరహా ఉపయేగించి టైపు చేయడం ఎలానో ఎవరన్న తెలుపగలరు..!!

 2. <<యట మార్కెట్లో డీటీపీ చెయ్యడానికి ఎక్కువగా అనూ స్క్రిప్ట్ మేనేజరుని (దానిలో ఆపిల్ కీబోర్డు లేయవుటుని) ఉపయోగిస్తారు. కానీ, అనూ ఉపయోగించడానికి ఆపిల్ కీబోర్డు లేయవుటు రావాల్సిన పనిలేదు. అనూలో కూడా ఇన్‌స్క్రిప్ట్ లేయవుట్ ఉంది. దీన్ని DOE
  also i am telling right now that is there were some changes had there between inscript and anu doe and also veeven apple and anu apple,
  <<ఈ సమస్య అనూకి లేదా ఇతర సాంప్రదాయ పద్ధతులకి అలవాటు పడినవారికే అనుకుంటాను.
  దీనికి అలవాటు పడని వారు ఎవరున్నారు
  <<Alt + Shift మీటలు కష్టమైతే, వీటిని మనకిష్టమైన మీటకి మార్చుకోవచ్చు కూడా. నేను Caps Lock
  అది తప్పించి ఇంకేమీ లేదు కదా! పైగా అది వాడితే దానికి వేరే ఏం కీ వాడాలి
  i just told my opinion on my blog, sorry if i hurt you

  1. కార్తిక్, మీరు నన్ను బాధించలేదు, హర్ట్ చెయ్యలేదు. :)

   మీకు అనూలో ఇన్‌స్క్రిప్ట్ ఉందని తెలుసని మీ టపా ద్వారా నేను గ్రహించలేకపోయాను. లేయవుట్ల మధ్య మార్పులు ఉన్నాయి. ప్రస్తుతం వాటితో సర్దుకోవలసిందేనేమో.

   అనూ, శ్రీలిపి వంటి పనిముట్లతో ఇంత క్రితం పరిచయం లేని వారు (దాదాపు తెలుగు బ్లాగర్లందరూ) మార్గాలను ‘మా ర్ గాలు’ అనే టైపు చేస్తారు.

   తెలుగు ఇంగ్లీషు మధ్య మారడానకి చాలా మీటలను ఉపయోగించవచ్చు: Scroll Lock, లేదా ఎక్కువగా ఉపయోగించని పంక్షన్ మీట ఏదైనా. Caps Lock మీటని మార్పిడికి ఉపయోగిస్తే, ప్రత్యామ్నాయంగా Shift మీటను నొక్కిపట్టి టైపు చేసుకోవాల్సి వస్తుందనుకోండి. అదీ మరీ ఇబ్బంది అని నాకు అనిపించలేదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.