పోయిన వారం జరిగిన 2వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలలో, అంబరీష్ గారు రమణీయ అనే ఒక ఉచిత యూనికోడ్ తెలుగు ఖతిని ఆవిష్కరించారు.
ఇదీ ఆ ఖతి యొక్క నమూనా:
రమణీయ ఖతిని దించుకోడానికి వారి వెబ్ సైటు వీలు కల్పించే వరకూ వేచివుండాలి. లేదా, ఇప్పుడే దీన్ని ఈమెయిలు ద్వారా పొందడానికి వారిని వెబ్ సైటు ద్వారా సంప్రదించండి.
ఇది లోహిత్ తెలుగు ఖతి వలెనే ఉన్నా భిన్నమైనది. వీటి రెంటి మధ్య కొన్ని భేదాలు. ఈ క్రింది ఉదాహరణలలో బూడిద రంగు లోనిది లోహిత్ మరియు ఆలివ్ రంగులోనిది రమణీయ ఖతి.
రమణీయ ఖతిలో తలకట్లు కాస్త పొడవుగా ఉంది, నిలువుగా అంతమవుతుంది. లోహిత్ ఖతిలో తలకట్టు వాలుకి లంబంగా అంతమవుతుంది.
అలానే లోహిత్ ఖతిలో దీర్ఘవృత్తాలు ఉపయోగిస్తే, రమణీయ ఖతిలో ఖచ్చిత వృత్త రూపాలకు ప్రాధాన్యతను ఇచ్చారు.
లోహిత్ ఖతిలో కు అక్షరానికి కొమ్ము పైనుండి వస్తుంది. రమణీయలో క్రింద నుండి ఉంటుంది.
ఆదిత్య ఫాంట్స్ వారి ఈ రమణీయ ఖతి మరిన్ని తెలుగు యూనికోడ్ ఖతులకు తద్వారా తెలుగు విజృంభణకి ప్రేరణోత్సాహాలను కలిగిస్తుందని ఆశిస్తున్నాను.
ధన్యవాదాలు.
ఈ ఫానును పేజ్ మేకర్ / అను ఫాట్స్ స్క్రిప్ట్ మేనేజర్ 6 తో ఉపయోగించుకునే వీలుందా తెలుప గలరు.
చాలా బావుంది. మంచి సమాచారం అందించినందుకు నెనరులు.
నా దృష్టిలో – శ్రమ తీసుకుని కొత్తఖతుల్ని డిజైన్ చేయడం కన్నా ముందు పాతవాటిని ఎలక్ట్రానిక్ సాధనాల్లోకి లాక్కురావడం మీదనే ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఇంగ్లీషులో ఉన్న Times Roman, Century Schoolbook, Garamond, Gothic, Bank Gothic, Gill Sans మొదలైన ఖతులు మొదట్లో లెటర్ ప్రెసులవాళ్ళు వాడేవారు. అవే తరువాత డిజిటలైజ్ అయ్యాయి. అలాగే ఎవఱైనా పాత లెటర్ ప్రెస్సులవారు వాడిన తెలుగు కాంపోజింగ్ ఖతుల్ని కంప్యూటరీకరిస్తే బావుంటుంది.
ఎన్నాళ్ళో వేచిన ఉదయం… ఈనాడే ఎదురవుతుంటే….
చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడే ఈ మెయిల్ లో ఆ ఫాంటు పంపమని అభ్యర్థించాను.
ఆదిత్య ఫాంట్సు వారికి కృతజ్ఞతలు. వారు చూపిన ఈ దారి చాలా మంది అనుసరించాలని, వారి వ్యాపారం కోసం మరిన్ని అందమైన యూనీకోడ్ ఫాంట్లు సృష్టించి ప్రజలకు అందుబాటు ధరలో అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
వికీపీడీయాను రమణీయ ఫాంటుతో వీక్షిస్తే…
మంచి వార్త.
చాలా మంచి విషయము థెలిపినoధుల కు సంథోషముగా వున్నది.