మార్చిన టపాలు ఇక కూడలిలో రావు!
మీరు (బ్లాగుస్పాట్ బ్లాగర్లు) టపాలో ఏ మార్పు చేసినా లేదా టపాల యొక్క లేబుళ్ళు మార్చినా అవి కూడలిలో తిరిగి దర్శనమిచ్చేవి. ఈ ఇబ్బందికరమైన సమస్యని ఎట్టకేలకు పరిష్కరించాను.
అన్నట్టు, తర్వాతి తరం కూడలిపై పని మొదలైంది. (కూడలి మెరుగుపరచడం కోసం వస్తున్న టపాలు చదువుతున్నాను.) అయినా, ఇప్పట్లోనే ఇంకా ఏమీ ఆశించవద్దు. :)


అమ్మయ్య, రక్షించావు మహాప్రభో. టోకు టపాలు ఏం చేయగలవో మీ ఇష్టం. పలువురి అభిప్రాయాలు పలు విధాలుగా ఉన్నాయి. టపాలు టోకుగా వ్రాయటం బ్లాగరు జన్మహక్కు అయుండొచ్చేమో గానీ, కూడలిలో అన్నీ ప్రదర్శించబడటమా లేదా అన్నది నిర్ణయించటం ముమ్మాటికీ కేవలం కూడలి జన్మహక్కే. ఒరెమూనా అన్నట్లు, ఎవడి బ్లాగుకు వాడే సుమన్, ఎవరి కూడలికి వారే సుమన్.
వికటకవి
జూలై 29, 2008 at 10:08 సా.
అవునా పరిష్కరించేసారా? ఇప్పుడెలాగా? :-(
ఏకాంతపు దిలీప్
జూలై 30, 2008 at 12:24 ఉద.
గత కొన్నిరోజులు గా జరుగుతున్న వివాదాలకు కాస్త ఊరట. ఇంకా ఒకేరోజు ఎక్కువ అనే సమస్య మిగిలింది. :) :(
Naga Muralidhar Namala
జూలై 30, 2008 at 12:46 ఉద.
వేనవేల అభినందనలు మరియు ధన్యవాదములు వీవెన్ గారు … మీ అవిరళ కృషి,పట్టుదల, ఓపిక, ఆసక్తి,ఉత్సాహం మొదలగునవి శతధా ప్రశంసనీయం ..
“తర్వాతి తరం కూడలిపై పని మొదలైంది” అన్నారు కాబట్టి … Architecture, Features, Framework and Extension Plans etc వీలైతే Open Discussion/Forum లాగా పెడితే ఎలా ఉంటుందో ఆలోచించండి … కారణాలు ఏవైనా గానీ ఇది మీకు (లేదా/మరియు ఇందులో పాలుపంచుకునే వారికి) ఇష్టం లేకపోతే వదిలేయండి పర్వాలేదు. The reason I’m asking is, I already started preparing the UI, Features etc and I will send/share them with you in either case.
Good Luck and All The Best.
తెలుగు 'వాడి' ని
జూలై 30, 2008 at 1:05 ఉద.
కూడలి సమస్య లపై ఇంత త్వరగా స్పందించి పరిష్కరిస్తున్న మీకు నా అభినందనలు.
chilamakuru vijayamohan
జూలై 30, 2008 at 3:38 ఉద.
ఇంతోటి దానికి పుంఖాను పుంఖాలుగా చర్చలు. కొక్కొరొక్కో కోళ్ళన్నీ సద్దు చేయకుండా గంప కిందకొచ్చేస్తాయన్నమాట. ఈ గంపేదో పది రోజుల ముందు బొర్లించింటే బావుండేది వీవెన్. మళ్ళీ ఏ గంపవసరమవుతుందో. ఏదన్నా వుంటే కాస్త మెయిల్ పెట్టండి. గంపలల్లడానికి వెదురు పంపిస్తా.
ధ.దే.వీ.గం.దొ. (ధన్య వాదాలు దేవుడా మరియూ వీవెనూ గంప దొరికింది)
– గంపల విహారి
విహారి
జూలై 30, 2008 at 4:22 ఉద.
వేవేల నెనర్లు వీవెన్ గారు. ఇక మేం ధైర్యం గా టపాలు మార్చుకోవచ్చనమాట. మీ కృషికి జోహార్లు.
వేణూ శ్రీకాంత్
జూలై 30, 2008 at 5:38 ఉద.
అమ్మయ్య, రక్షించారు.ఇక సంకోచం లేకుండా తప్పులు సవరించుకోడాలు చెయ్యొచ్చు. ఇక టోకు టపాల విషయమే చూడాలి మీరు! లేకపోతే ఒక టపా ఒకే సారి కూడలిలో వస్తుంది కాబట్టి టోకు టపాలు ఆరో పదో ఒకేసారి వచ్చి పడ్డప్పుడు మంచి టపాలు ఎక్కువమంది చదవకుండానే వెనక్కి పోతుందేమో !
ధన్యవాదాలు.
సుజాత(మనసులో మాట)
జూలై 30, 2008 at 6:21 ఉద.
అభినందనలు.
cbrao
జూలై 30, 2008 at 7:05 ఉద.
Thank You sir.
sujata
జూలై 30, 2008 at 7:32 ఉద.
ధన్యవాదాలు.
Shankar Reddy
జూలై 30, 2008 at 9:29 ఉద.
మంచి పని చేసారు సార్. తరువాతి తరం కూడలి లో, టెస్టింగు వగైరా అవసరాలు యేమైనా ఉంటే, ఇక్కడ వాలంటీర్లు ఉన్నారు. కాస్త గుర్తుంచుకోండి :-)
రవి
జూలై 30, 2008 at 9:34 ఉద.
అభినందనలు.
జాన్ హైడ్ కనుమూరి
జూలై 30, 2008 at 9:36 ఉద.
మంచిది. ఇక కూడలిలో అన్నీ కొత్త టపాలే చూడొచ్చన్నమాట.
విహారి గారు,
మీరు చాలా రోజుల క్రిందట ధ.దే.ఈ.శు అని అర్దంగాని పదం వాడే వారు కదా.. నాకు అది ఇప్పుడు అర్ధమయిపోయింది :).
-రమణ.
వెంకట రమణ
జూలై 30, 2008 at 10:04 ఉద.
thank god. ఇక ఏ ఇబ్బంది లేకుండా టపాలు మార్చుకోవచ్చన్న మాట.
ప్రతాప్
జూలై 30, 2008 at 10:18 ఉద.
అసలు ఈ పని ఎప్పుడో చేసేసి ఉండాల్సింది, అప్పుడెప్పుడో నేను మొత్తం అన్ని టపాలకూ వర్గాలను చేర్చి, రెండు రోజులు ఫీడుని ఆపేసా, అయినాకూడా అవన్నీ కూడలిలో ప్రత్యక్షమైపోయాయి. అప్పట్లో ఇప్పుడొచ్చేటన్ని టపాలు రాలేదేమో. మార్చినందుకు చాలా thanks.
మాకినేని ప్రదీపు
జూలై 30, 2008 at 10:35 ఉద.
నాదీ ఏకాంతపు దిలీప్ గారి మాటే! ;)
చదువరి
జూలై 30, 2008 at 11:28 ఉద.
వెరీ గుడ్…
ప్రవీణ్ గార్లపాటి
జూలై 30, 2008 at 12:25 సా.
వేయి కృతజ్ఞతలు..కోటి ధన్యవాదాలు.
Saraswathi Kumar
జూలై 30, 2008 at 2:24 సా.
వీవెన్ గారు, మంచి పని చేసారు.
కూడలిలో అస్సలు ఉదయం నుంచి టపాలు రావడం లేదండి. ఏదన్నా సాంకేతిక సమస్యా? నేను మద్యాహ్నం ఒక టపా పోస్ట్ చేశాను ఇంతవరకూ అది కూడలిలో ప్రత్యక్షం కాలేదు. అందుకని అడుగుతున్నాను.
కల
జూలై 30, 2008 at 5:49 సా.
Super.. హమ్మయ్యా.. great job.. రక్షించారు :-)
నిషిగంధ
జూలై 30, 2008 at 7:19 సా.
[...] ఓ జాబు రాసారు. ఆ తరువాత రెండు రోజులకే వీవెన్ కూడలిలో తగుమార్పులు చెయ్యడంతో…సమస్య పరిష్కారమైంది. దీనికి తోడు [...]
పొద్దు » Blog Archive » జూలైలో తెలుగు బ్లాగుల విశేషాలు
ఆగస్ట్ 1, 2008 at 6:07 సా.
[...] Anagrams « మార్చిన టపాలు ఇక కూడలిలో రావు! [...]
కూడలిలో టపాల జీవితకాలాన్ని పెంచడం « వీవెనుడి టెక్కునిక్కులు
ఆగస్ట్ 2, 2008 at 12:34 సా.
నేను నా బ్లాగులో ఏమన్నా మార్పులు చెయాల్సి వస్తె ఫీడ్ ని డిసబుల్ చేసి టపాలు మార్చి అయ్యాకా ఒక రోజు తరువాత మళ్ళా ఎనెబుల్ చేసేదానిని.ఇప్పుడు అ0త కష్ట0 లేదన్న మాట నాకళాచాలా థా0క్స్.ఇ0క నేను ప్రశా0త0గా మార్పులు చేసుకు0టాను.
radhika
ఆగస్ట్ 8, 2008 at 9:48 ఉద.