మార్చిన టపాలు ఇక కూడలిలో రావు!

మీరు (బ్లాగుస్పాట్ బ్లాగర్లు) టపాలో ఏ మార్పు చేసినా లేదా టపాల యొక్క లేబుళ్ళు మార్చినా అవి కూడలిలో తిరిగి దర్శనమిచ్చేవి. ఈ ఇబ్బందికరమైన సమస్యని ఎట్టకేలకు పరిష్కరించాను.

అన్నట్టు, తర్వాతి తరం కూడలిపై పని మొదలైంది. (కూడలి మెరుగుపరచడం కోసం వస్తున్న టపాలు చదువుతున్నాను.) అయినా, ఇప్పట్లోనే ఇంకా ఏమీ ఆశించవద్దు. :)

మార్చిన టపాలు ఇక కూడలిలో రావు!”పై 24 స్పందనలు

 1. అమ్మయ్య, రక్షించావు మహాప్రభో. టోకు టపాలు ఏం చేయగలవో మీ ఇష్టం. పలువురి అభిప్రాయాలు పలు విధాలుగా ఉన్నాయి. టపాలు టోకుగా వ్రాయటం బ్లాగరు జన్మహక్కు అయుండొచ్చేమో గానీ, కూడలిలో అన్నీ ప్రదర్శించబడటమా లేదా అన్నది నిర్ణయించటం ముమ్మాటికీ కేవలం కూడలి జన్మహక్కే. ఒరెమూనా అన్నట్లు, ఎవడి బ్లాగుకు వాడే సుమన్, ఎవరి కూడలికి వారే సుమన్.

 2. గత కొన్నిరోజులు గా జరుగుతున్న వివాదాలకు కాస్త ఊరట. ఇంకా ఒకేరోజు ఎక్కువ అనే సమస్య మిగిలింది. :) :(

 3. వేనవేల అభినందనలు మరియు ధన్యవాదములు వీవెన్ గారు … మీ అవిరళ కృషి,పట్టుదల, ఓపిక, ఆసక్తి,ఉత్సాహం మొదలగునవి శతధా ప్రశంసనీయం ..

  “తర్వాతి తరం కూడలిపై పని మొదలైంది” అన్నారు కాబట్టి … Architecture, Features, Framework and Extension Plans etc వీలైతే Open Discussion/Forum లాగా పెడితే ఎలా ఉంటుందో ఆలోచించండి … కారణాలు ఏవైనా గానీ ఇది మీకు (లేదా/మరియు ఇందులో పాలుపంచుకునే వారికి) ఇష్టం లేకపోతే వదిలేయండి పర్వాలేదు. The reason I’m asking is, I already started preparing the UI, Features etc and I will send/share them with you in either case.

  Good Luck and All The Best.

 4. ఇంతోటి దానికి పుంఖాను పుంఖాలుగా చర్చలు. కొక్కొరొక్కో కోళ్ళన్నీ సద్దు చేయకుండా గంప కిందకొచ్చేస్తాయన్నమాట. ఈ గంపేదో పది రోజుల ముందు బొర్లించింటే బావుండేది వీవెన్‌. మళ్ళీ ఏ గంపవసరమవుతుందో. ఏదన్నా వుంటే కాస్త మెయిల్ పెట్టండి. గంపలల్లడానికి వెదురు పంపిస్తా.

  ధ.దే.వీ.గం.దొ. (ధన్య వాదాలు దేవుడా మరియూ వీవెనూ గంప దొరికింది)

  — గంపల విహారి

 5. అమ్మయ్య, రక్షించారు.ఇక సంకోచం లేకుండా తప్పులు సవరించుకోడాలు చెయ్యొచ్చు. ఇక టోకు టపాల విషయమే చూడాలి మీరు! లేకపోతే ఒక టపా ఒకే సారి కూడలిలో వస్తుంది కాబట్టి టోకు టపాలు ఆరో పదో ఒకేసారి వచ్చి పడ్డప్పుడు మంచి టపాలు ఎక్కువమంది చదవకుండానే వెనక్కి పోతుందేమో !

  ధన్యవాదాలు.

 6. మంచి పని చేసారు సార్. తరువాతి తరం కూడలి లో, టెస్టింగు వగైరా అవసరాలు యేమైనా ఉంటే, ఇక్కడ వాలంటీర్లు ఉన్నారు. కాస్త గుర్తుంచుకోండి :-)

 7. మంచిది. ఇక కూడలిలో అన్నీ కొత్త టపాలే చూడొచ్చన్నమాట.

  విహారి గారు,

  మీరు చాలా రోజుల క్రిందట ధ.దే.ఈ.శు అని అర్దంగాని పదం వాడే వారు కదా.. నాకు అది ఇప్పుడు అర్ధమయిపోయింది :).

  -రమణ.

 8. అసలు ఈ పని ఎప్పుడో చేసేసి ఉండాల్సింది, అప్పుడెప్పుడో నేను మొత్తం అన్ని టపాలకూ వర్గాలను చేర్చి, రెండు రోజులు ఫీడుని ఆపేసా, అయినాకూడా అవన్నీ కూడలిలో ప్రత్యక్షమైపోయాయి. అప్పట్లో ఇప్పుడొచ్చేటన్ని టపాలు రాలేదేమో. మార్చినందుకు చాలా thanks.

 9. వీవెన్ గారు, మంచి పని చేసారు.
  కూడలిలో అస్సలు ఉదయం నుంచి టపాలు రావడం లేదండి. ఏదన్నా సాంకేతిక సమస్యా? నేను మద్యాహ్నం ఒక టపా పోస్ట్ చేశాను ఇంతవరకూ అది కూడలిలో ప్రత్యక్షం కాలేదు. అందుకని అడుగుతున్నాను.

 10. పింగ్‌బ్యాక్: పొద్దు » Blog Archive » జూలైలో తెలుగు బ్లాగుల విశేషాలు

 11. పింగ్‌బ్యాక్: కూడలిలో టపాల జీవితకాలాన్ని పెంచడం « వీవెనుడి టెక్కునిక్కులు

 12. నేను నా బ్లాగులో ఏమన్నా మార్పులు చెయాల్సి వస్తె ఫీడ్ ని డిసబుల్ చేసి టపాలు మార్చి అయ్యాకా ఒక రోజు తరువాత మళ్ళా ఎనెబుల్ చేసేదానిని.ఇప్పుడు అ0త కష్ట0 లేదన్న మాట నాకళాచాలా థా0క్స్.ఇ0క నేను ప్రశా0త0గా మార్పులు చేసుకు0టాను.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s