కూడలిలో టపాల జీవితకాలాన్ని పెంచడం

ప్రస్తుత కూడలిలో ఉన్న సమస్యల్లో మరోటి కూడలిలో టపాల జీవితకాలం. దీన్ని కూడలి ప్రస్తుత నిర్మాణాకృతిలోనే పరిష్కరించ ప్రయత్నం చేసాను. ఇది అంసంపూర్ణం మరియు తాత్కాలికం. (మరింత మెరుగైన పరిష్కారం కొత్త కూడలిలో ఆశించవచ్చు.)

 • మొదటి పేజీలో ప్రస్తుతం కనిపించే టపాల సంఖ్యను 40కి పెంచాను. దీనివల్ల మొదటి పేజీ కొంత మెల్లగా లోడవవచ్చు. తేడా అంతగా తెలియకపోవచ్చులేండి. కానీ మీ టపా మరికాస్త ఎక్కువ సేపు కూడలిలో ఉంటుంది.

మరో ముఖ్యమైన మార్పు ఏమంటే—

 • అన్ని బ్లాగులు అనే కొత్త పేజీ
  • దీనిలో వివిధ జాబితాల నుండి శీర్షికలు మాత్రమే కనిపిస్తాయి.(సర్వరు పై భారం ఎక్కువ లేకుండా ఉండేందుకుగానూ బ్లాగులన్నింటినీ కూడలి జాబితాలుగా విభజించి ఈ జాబితాలని తాజాకరిస్తుంటుంది.)
  • మొదటి పేజీ మరియు బ్లాగుల పేజీల కంటే, ఈ పేజీలో 15 నిమిషాల ముందే టపాలు కనిపిస్తాయి. (మీరు టపా రాసిన తర్వాత కూడలిలో కనబడడానికి మామూలు పరిస్థితులలో గరిష్ఠంగా 75 నిమిషాలు పడుతుంది. కానీ ఈ పేజీలో అయితే గరిష్ఠంగా 60 నిమిషాలు పడుతుంది. )
  • ఈ పేజీలోని మరిన్ని అనే లింకుల ద్వారా ఆయా జాబితాల పేజీలకు వెళ్ళవచ్చు. ఉదాహరణ పేజీ: జాబితా 7 (లేలేత బ్లాగర్లు). ఈ జాబితాల పేజీలన్నీ కలగలుపుకుని 420 (60 x 7) టపాలు చూడవచ్చు. మీరు ఓ రెండు వారాలు కూడలి చూడలేకపోయినా, ఈ జాబితాల పేజీ మీకు అక్కరకు వస్తుంది.
  • ఈ పేజీ యొక్క మరో ప్రయోజనమేమంటే, ఎవరైనా ఓ బ్లాగరు చాలా టపాలు ఒకే రోజునే ప్రచురించారనుకోండి, ఈ పేజీలో ఆ బ్లాగరున్న జాబితాలో మాత్రమే అతని టపాల ప్రభావముంటుంది.
  • ఈ పేజీకి మొదటి పేజీలోని లింకుల పెట్టెలోని అన్ని బ్లాగులూ అన్న లింకు ద్వారా చేరుకోవచ్చు.

   కూడలి త్వరిత లింకుల పెట్టె
   కూడలి త్వరిత లింకుల పెట్టె

ఈ మార్పులు అసలైన పరిష్కారాలు కాకపోయినప్పటికీ, మొన్నటి పరిష్కారంతో కలిపి సమస్య తీవ్రతని తగ్గించడానికి దోహదపడతాయని ఆశిస్తున్నాను.

అన్నట్టు, కొత్త తరం కూడలిపై చర్చలో మీరు పాల్గొనవచ్చు.

ప్రకటనలు

7 thoughts on “కూడలిలో టపాల జీవితకాలాన్ని పెంచడం

 1. వీవెన్ గారు
  నా బ్లాగు http://saahitheeyanam.blogspot.com అన్ని బ్లాగులలో కనిపిస్తుంది కానీ సాహిత్యం కేటగిరీలో కనిపించటం లేదు. దయచేసి చేర్చరూ.
  బహుసా మీరు గమనించే ఉంటారు నా బ్లాగులో కవితలను మాత్రమే పోష్ట్ చేస్తూ వస్తున్నాను.
  ఈ బ్లాగు సాహిత్యం కేటగిరీలో కూదా ఉంటే బాగుంటుండని నా ఆశ.
  ఈ సమస్యను పరిష్కరించరూ.

  బొల్లోజు బాబా

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.