ఈ మధ్య లేఖిని పనిచేయడం లేదన్న పిర్యాదుని తరచూ వింటున్నాను. కానీ నా లినక్స్ కంప్యూటరుపై ఈ సమస్యని నేను చూడలేదు. బహుశా ఇది పాడయిన కోశం వల్ల అయ్యివుండొచ్చు. మీ జాల విహారిణి ఫైర్‌ఫాక్స్ అయితే ఇలా ప్రయత్నించి చూడండి:
- Tools మెనూ నుండి Options… అన్న ఆదేశాన్ని ఎంచుకోండి.
- ఆ తర్వాత వచ్చే కిటికీలో, (క్రింద తెరపట్టులో చూపినట్టు) Advanced అన్న ప్రతీకాన్నీ తర్వాత Network అన్న ట్యాబునీ ఎంచుకోండి.
- Offline Storage విభాగంలో (పై తెరపట్టులో గుర్తించి చూపిన చోట) lekhini.org అని ఉంటే, దాన్ని ఎంచుకుని Remove బొత్తాన్ని నొక్కండి.
- తొలగింపుని నిర్ధారించండి; OK బొత్తాన్ని నొక్కి అమరికల కిటికీని మూసేయండి.
- ఇప్పుడు lekhini.orgకి వెళ్ళి చూడండి.
అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే, నాకు తెలియజేయండి.
మీ మిత్రులెవరైనా ఈ సమస్యని మీతో ప్రస్తావించి ఉంటే, వారికి కూడా ఈ టపాని చూపించండి.
ఆనంద లేఖనం!
mari naenu chrome vaaDataanu. naenelaa corect cheyyaali.
Lekhini is not working for “~ca” and “~ja”.
అవును, చాన్నాళ్లుగా ఫైర్ ఫాక్స్ లో లేఖిని సతాయిస్తుంది. గాయబ్! మీరు చెప్పినట్లు చేస్తే, సమస్యకు పరిష్కారం దొరికింది. ఇప్పుడు ఫైర్ఫాక్స్ లో లేఖిని ఎప్పటిలా ఛెంగున పనిచేస్తోంది.
I haven’t faced this problem on my Linux box with any browser. It works perfectly fine :)
~sUryuDu
నా సిస్టమ్ లోని ఫయర్ఫాక్సులో లేఖిని ఇప్పటికీ బాగానే పనిచేస్తోంది. ఎటొచ్చీ నేనది వాడ్డం మానేసి మూడేళ్ళవుతోంది.
మీరు చెప్పినట్లు చేస్తే, సమస్యకు పరిష్కారం దొరికింది. ఇప్పుడు ఫైర్ఫాక్స్ లో లేఖిని ఎప్పటిలా పనిచేస్తోంది.
chrome loa pani ceayaDam leadu saar :(
తెలుగులో కొన్ని వత్తులు సరిగ్గా కనిపించటం లేదు. కొన్ని వత్తులు పక్క అక్షరం కింద కనిపిస్తున్నాయి. దీని వల్ల వెబ్ సర్చ్ లో తప్పులు జరగకపోయినా, చూడతానికి బాగోలేదు! ఇది కేవలం ‘display’ కి సంబంధించిన సమస్యలా కనిపిస్తోంది.
ఈ ప్రవర్తన ఫైర్ఫాక్స్ 4 తోటి మొదలయ్యింది! నేను MAC OS X 10.6.7 వాడుతున్నాను. Can you help?
lekhi is doesnot working on my mobile.how to type a message on mobile
లెఖిని లొ వ్రాసిన పదాలు ఎలా తీసుకొవడం తెలియడం లెదు
Chrome lo hatathhu ga panu cheyadam manesindi…
లేఖిని లో టైప్ చేయడానికి చాలా సదుపాయంగా ఉంది. దీనిని ఆఫ్ లైన్ లో వాడే వీలుందా? దయచేసి తెలియజేయగలరు..