కంప్యూటర్లో తెలుగు టైపు చెయ్యడానికి అనేక పద్ధతుల్లో లేఖిని ఒకటి. ఇప్పటికీ లేఖినికి రోజుకి సగటున 1,250 సందర్శనలు నమోదవుతున్నాయి. లేఖినితో ఉన్న ప్రధాన ఇబ్బందులలో మొదటిది జాల సంధానం అవసరమవడం, రెండోది ఇక్కడ టైపు చేసి మరో చోటకి కాపీ చేసుకోవాల్సి రావడం. అయితే జాల సంధానం అవసరం లేకుండా లేఖినిని వాడుకోవచ్చు. ఇందుకు గల రెండు పద్ధతులను ఈ టపాలో వివరిస్తున్నాను. వీటివల్ల, మీకూ మరియు లేఖినికీ బ్యాండ్‌విడ్త్ వినియోగం తగ్గుతుంది.
మొదటగా ఈ మధ్యే సాధ్యమవుతున్న ఒక పద్ధతి (HTML5 లోని ఆఫ్‌లైన్ వెబ్ ఉపకరణాల సౌలభ్యం) ద్వారా:
- ఫైర్‌ఫాక్స్ లేదా ఓపెరా విహారిణి (browser) లో లేఖినిని తెరవండి. (లేఖిని మీ కంప్యూటర్లో తన ఫైళ్ళను భద్రపరచమని అడుగుతుందంటూ, ఫైర్‌ఫాక్స్ మీ అనుమతిని కోరుతుంది. అనుమతించండి.)
- మీ విహారిణిని మూసేయండి.
- జాల సంధానం తెంచివేయండి.
- మీ విహారిణినిని తెరిచి
lekhini.org
అని చిరునామా పట్టీలో కొట్టండి. (జాలానుసంధానం అవసరం లేకుండానే లేఖిని ప్రత్యక్షమవుతుంది.)
(You do not need to download Lekhini. You can use Lekhini offline if your browser supports. Currently, Firefox, Opera, and (probably) Safari support offline web applications.)
ఇది మీకు పనిచేసిందా? ఈ పద్ధతిలో మీకైమైనా సమస్యలు ఎదురైతే తెలియజేయండి.
ఈ పద్ధతిలో లేఖిని (మీ విహారిణి సహాయంతో) తనక్కావలసిన ఫైళ్ళని మీ కంప్యూటర్లో భద్రపరుస్తుంది. ఆ తర్వాత నుండి మీరు lekhini.org
అని టైపు చెయ్యగానే, మీ విహారిణి లేఖిని సైటుకి అనుసంధానమవకుండా, మీ కంప్యూటర్లో భద్రపరచిన ఫైళ్ళనుండి లేఖినిని తెరుస్తుంది. మీ కంప్యూటర్ జాలానికి అనుసంధానమై లేకపోయనా, లేఖిని పనిచేస్తుంది. అయితే, ఇక్కడ పాత్ర అంతా విహారిణిదే. కాబట్టి, మీ విహారిణిలో ఆఫ్‌లైన్ వెబ్ ఉపకరణాలకి తోడ్పాటు ఉండి ఉండాలి. నాకు తెలిసి ఫైర్‌ఫాక్స్ 3 మరియుఓపెరా 9.6 లు ఈ తోడ్పాటుని కలిగి ఉన్నాయి. భవిష్యత్తులో మరిన్ని విహారిణులూ దీన్ని అందిస్తాయి.
రెండవ పద్ధతి లేఖినిని మీ కంప్యూటర్లో భద్రపరచుకోవడం:
- మీ అభిమాన విహారిణిలో లేఖినిని తెరవండి.
- File మెనూ నుండి Save Page As … అన్న ఆదేశాన్ని ఎంచుకోండి.
- ఆ తర్వాత, ఫైలుని భద్రపరచాల్సిన చోటు, File Type ఆన్న చోట “Web page, complete” అన్న అంశాన్ని ఎంచుకోండి.
- ఇకపై, మీరు భద్రపరచుకున్న ఫైలుని నొక్కి (జాల అనుసంధానం లేకుండా) లేఖినిని ఉపయోగించుకోవచ్చు.
ఒకవేళ లేఖినిలో ఏమైనా మార్పుల చేర్పులుంటే, అవి మీ వద్దకు చేరవు. అదే పైన చెప్పిన పద్ధతిలో అయితే, లేఖినిలో జరిగే మార్పులని మీ విహారిణి గమనించి తెచ్చుకుంటుంది.
ఆనంద లేఖనం!
ఇండిక్ ఇన్ పుట్ ఎక్స్ టెన్షన్ ఇన్స్టాల్ చేసిన తరువాత నేను లేఖిని వాడడం మానేశాను. దాని వల్ల కూడా మీ వెబ్ సైట్ బ్యాండ్ విడ్త్ కొంత వరకు సేవ్ అయ్యింది. ఇండిక్ ఇన్ పుట్ ఎక్స్ టెన్షన్ ఎంకరేజ్ చెయ్యడమే మంచిదనుకుంటాను కానీ స్టార్టర్స్ కి మాత్రం లేఖిని అవసరమే. http://telugu-blog.pkmct.net/2009/03/blog-post_4943.html
గురూజీ
అక్షరమాల ఉబుంటూ వెర్షను కావాలి. ఎక్కడ దొరుకుతుందండీ?
లేనట్లయితే ఉబుంటులో పనిచేయగలిగే అక్షరమాల లాంటి సాఫ్ట్ వేర్ ఏమైనా ఉందా?
wine ద్వారా ఇన్స్టాల్ చేసిన బరహా “టైప్ పాడ్” లో బాగానే పని చేస్తుంది కానీ బరహా డైరక్ట్ సరిగా పనిచేయ్యటం లేదు.
SCIM ఇన్ స్క్రిప్ట్ తెలుగు బాగానే ఉంది కానీ ఓపెన్ ఆఫీస్ లో సిస్టం చాలా స్లోగా రన్ అవుతుంది.
ప్రస్తుతానికి ఏదైనా టైప్ చెయ్యాలంటే ఇండిక్ ఇన్పుట్ ఎక్స్టెంషను ద్వారా మెయిల్ బాక్స్ లో డ్రాఫ్ట్ లలో టైప్ చేసుకొని బ్లాగులోకి కాపీ పేష్టు చేసుకోవలసి వస్తుంది.
విండోస్ లో అయితే అక్షరమాల చాలా బాగుండేది. దానిని ఆన్ చేసుకొని వర్డ్లోనో, నోట్ పాడ్ లోనో, లేక ఒపెన్ ఆఫీస్ లోనో నేరుగా టైపు చేసుకొనే వాడిని.
లేఖిని ఆన్ లైన్ కనుక ఇంతవరకూ దీని గురించి ఆలోచించలేదు. ఇప్పుడు దీన్ని ప్రయత్నించాలి. ఇదైనా కాపీ పేస్టు తప్పేలా లేదు.
దయచేసి నా సమస్యకు పరిష్కారం చెప్పగలరు. ఎందుకంటే నేను ఈ మధ్యే ఉబుంటూకు మారిపోయాను. బాగుందికూడా.
భవదీయుడు
బొల్లోజు బాబా
బాబా గారూ, మీరు SCIM ద్వారా బ్లాగులో నేరుగా టైపు చెయ్యలేక పోతున్నారా?
మీకు ఇన్‌స్క్రిప్ట్ వస్తే, SCIM ద్వారా కాకుండా, నేరుగా తెలుగు కీబోర్డు లేయవుటు ద్వారా టైపు చెయ్యవచ్చు. System > Preferences > Keyboard > Layouts లో తెలుగు లేయవుటుని చేతనం చేసుకుని చూడండి.
ఓపెన్ఆఫీస్ తెరిచినపుడు మాత్రమే మీ కంప్యూటర్ నెమ్మదిస్తుందా?
లినక్స్ తెలుగు వాడుకర్ల గుంపులో కూడా అడిగిచూడండి.
thanq sir. Useful info.
థ్యాంక్యు! మీరు చెప్పిన ఆఫ్ లైన్ రెండవపద్ధతి లేఖిని కే కాకుండా తెలుగు యంత్రం,తెలుగుvirtual keyboard,తెలుగుటైఫింగ్ మరియు ఇతర ఆన్ లైన్ లిఫి సాధనాలకు కూడా వర్తిస్తుంది!
బాగుంది. మంచి ఫీచరు.
అన్నట్టు “వింపరేటరు”. భలే, నేనూ వాడాతాను :-)
@ప్రవీణ్, ఓహో! మూషికం వాడకుండా కంప్యూటర్ని ఉపయోగించడమంటే నాకు మోజు. హిట్-ఎ-హింట్, మెజ్‌లెస్, మోస్‌లెస్ బ్రౌజింగ్ పొడగింతల తర్వాత నాకు వింపరేటర్ తగిలింది. ఇప్పుడు ప్రతీ ఉపకరణం ఇలానే ఉంటే బాగుండు అనిపిస్తోంది.
వీవెన్ గారికి నెనర్లు. HTML5 తో సంబంధం లేని రెండో పద్ధతి రెండేళ్ళ క్రితం నుంచే పనిచేస్తూ ఉంది.
మరొక విషయం, వీవెన్ గారూ ! అప్రస్తుత ప్రసంగానికి మన్నించండి. మీరు వర్డ్ ప్రెస్సు స్థానికీకరణ మధ్యలో నిలిపివేశారా ? అందులో చాలా పదాలూ, పదబంధాలూ ఇప్పటికీ ఇంగ్లీషులోనే దర్శనమిస్తున్నాయి.
తాడేపల్లి గారూ, ఈ మధ్య మీడియావికీ మరియు మంటనక్క స్థానికీకరణల్లో పాల్గొంటున్నాను. తతిమా పనివత్తిడులు కూడా తోడయ్యి వర్డ్‌ప్రెస్ స్థానికీకరణ జోలికి పోలేదు.
super. you are too quick to grab it. Safari 4 public beta seems to be having some issue though it supports HTML 5 offline cache.
సుధాకర్, సఫారీలో ఏం సమస్య వస్తుందో చెప్పవా? కనబడేదైతే, తెరపట్టు లాంటిదేమైనా నాకు పంపించు.
వీవెన్ గారూ,
లేఖిని గూగుల్ గేర్స్ తో వాడుకొనే సౌలభ్యం కల్పిస్తే మరింత మంచిది కదా!
శ్రీకాంత్, HTML5 లోని సౌలభ్యం గూగుల్ గేర్స్ కంటే తెలికగా అనిపించింది. ఇలా అయితే వాడుకర్లు మరో ఉపకరణం స్థాపించుకోవాల్సిన పనిలేదు కదా.
హార్స్ లీ హిల్స్ గురించి యెదైనా బ్లాగ్ వుందా ? దయచెసి తెలపగలరు.
యునిక్స్ లో బరహా సాఫ్ట్ వేర్ పని చెయ్యదు. మా యునిక్స్ \ లైనక్స్ సిస్టమ్స్ లో లేఖిని లేదా ఫైర్ ఫాక్స్ ఇండిక్ ఇంపుట్ ఎక్స్టెన్షన్ ద్వారా టైపింగ్ చేస్తుంటాం. అలా టైప్ చేసినవి కాపీ చేసి జినోమ్ ఎడిట్ లేదా ఓపెన్ ఆఫీస్ లో పేస్ట్ చేస్తుంటాం. విండోస్ సిస్టమ్ లో మాత్రం అను స్క్రిప్ట్ మేనేజర్ వాడుతాం.
థాంక్సండీ
మార్తాండ గారి సమాధానం ప్రకారం కూడా లీనక్స్ లో అక్షరమాల లాంటి ఉపకరణం లేదేమోననిపిస్తుంది. SCIM అలానే పనిచేస్తుంది కానీ ఫైర్ ఫాక్స్ ఇండిక్ ఇంపుట్ ఎక్స్టెన్షన్ అంత వేగంగా చెయ్యటంలేదు.
ఏదో పెంటియం II లో లా అనిపిస్తుంది.
థాంక్స్ అగైన్ ఫర్ షేరింగ్
Suse, Ubuntu లాగ Unix/Linux టెక్నాలజీతో డెవెలప్ చేసిన అన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ UTF-8 ఎంకోడింగ్ ని సపోర్ట్ చేస్తాయి. తేడా వస్తే ఫాంట్స్ లో తేడా రావచ్చు. ఇందులో డౌట్ అవసరం లేదు. విండోస్ కంటే లైనక్స్ లో యూనికోడ్ ఫాంట్స్ క్లియర్ గా కనిపిస్తాయి కాబట్టి నేను లైనక్స్ నే ఎక్కువగా రికమెండ్ చేస్తాను.
ఇక్కడ టైపు చేసిన తెలుగు అక్షరములు అన్ని వెబ్ సైట్ లలొ వాడవచా? లేదా వెబ్ సైట్ లొ తెలుగు అక్షరములువ్రాయుటకు ఇంకాఇతర మార్గములు ఉన్నాయా? తెలియజేఅయండ్
ఈ అక్షరాలని అన్ని సైట్లలోనూ వాడవచ్చు. అయితే, ఆ సైట్లకి యూనికోడ్ తోడ్పాటు ఉండాలి. పెద్ద సైట్లన్నీ ప్రస్తుతం యూనికోడుకి అనుకూలంగానే ఉన్నాయి.
తెలుగు టైపు చెయ్యడానికి అనేక మార్గాలు ఉన్నాయి.
vvnudigaaru
I request you to open ‘ Akshamala.org ‘ and see the telugu typed pages and also the telugu manuscripts of Vedanta Sabdaarda Ratnamala. The telugu typing was done using Telugu Lipi Editor developed by Sirigina Srinivas & Anuradha Koneru. Now I want to use lekhini for continuing that work. Pl. let me know how to save page after page,book after book & also copying what was already done into lekhini.
Mangu Venkata Joga rao
I’ve seen this page in akshamala.org. All I see junk characters instead of Telugu characters. Might be because I didn’t have necessary font.
You can use Lekhini for your work. However, Lekhini does not allow you save where you type. You need save in Word or Notepad.
Of course, you can have these benefits by using Lekhini: (1) your users do not need separate font as most of the modern operating systems come with a Telugu font, (2) people can find you site on Google or other search engines, when they search in Telugu.
You get these benefits not because of Lekhini but because the text produced by Lekhini is encoded in Unicode. (What is Unicode?)
In addition to Lekhihi, there are other tools for typing in Telugu. Please have a look at these tools and ask me any specific questions you have.
Also, I am not sure if there are any tools for converting ‘Telugu Lipi’ text into Unicode.
విండోస్ విస్టా ఫైర్ ఫాక్స్ కొత్త వర్షన్ లో కుకీస్ స్టోర్ చేస్తే లేఖిని ఓపెన్ అవ్వడం లేదు. “unsupported form of compression” అని మెసేజ్ చూపిస్తోంది.

పై లింక్ ఓపెన్ అవ్వకపోతే ఈ లింక్ ఓపెన్ చెయ్యండి: http://img42.imageshack.us/img42/5048/clipboard01.gif
please use :
http://lekhini.org/index.html
లేఖిని ఫైర్ ఫాక్స్ 3.5లో సరిగా పని చెయ్యకపోతే లినక్స్ KDE Konquererలోనూ, విండోస్ IE 8లోనూ వాడాను. ఫైర్ ఫాక్స్ లో ఇండిక్ ఇంపుట్ ఎక్స్టెన్షన్ ద్వారా తెలుగు టైపింగ్ చేస్తున్నాను.
i need to save the message in ms word. please tel me how to do that
How to download and open lekhini in Msword or excel directly?
గూగుల్ IMEని వాడిచూడండి. వర్డ్, ఎక్సెల్ మాత్రమే కాకుండా మీ కంప్యూటర్లో టైపుచెయ్యగలగిన చోటల్లా తెలుగులో టైపు చెయ్యవచ్చు.
వీవెన్ గారూ, ధన్యవాదాలు. మీరు చెప్పినట్లుగా “ఆల్ట్ + షిఫ్ట్” తర్వాత నా కోరిక పూర్తిగా నెరవేరింది. ఇప్పుడు ఈ సమాధానాన్ని నేరుగా తెలుగులో రాయగలుగుతున్నాను. కాని ఈ ప్రతి లేఖిని లో కాకుండా “గౌతమి” లో ఉంది. దీనిలో లేఖిని లోలా “కీబోర్డ్ లేఅవుటు” కాకుండా, నాలుగు దగ్గరి పదాలు ఇస్తున్నట్లు గా ఉంది. అవికూడా తెలుగు అక్షరాలుగా కాకుండా, చతురస్ర గుర్తులుగా వస్తున్నాయి. ఇది కూడా బాగానేఉన్నా, ఆపదాలు సరిగా వచ్చేతట్లుగా ఉంటే బాగుండేది. లేఖినిలోలా కీబోర్డ్ లేఅవుటు ఉన్నా బాగుండేది. మీకు మరొకసారి మరీ మరీ ధన్యవాదాలు.
జగన్నాధం ఆలపాటి
ఆ చతురస్త్రాల బదులు తెలుగు అక్షరాలు కనబడటానికి ఈ లంకెలో చెప్పిన మొదటి మూడు సోపానాలు పాఠించి చూడండి.
ఈరోజె నేను చూచితిని చాలా బగుంది థన్యవాదములు
Many thanks. Though I have not experimented with Lekhini fully, my initial experiment is very satisfying. Very good blog and I wish you all the best. May God guide and bless.
Love and Love alone ….
P. Gopi Krishna
Dear Sir,
As per your instructions, I have installed lekhini – offline by using Firefox. what I would like to know is “how to SAVE the matter ” which I typed with a file name and then re-use or re-open the same whenever I want to use it.
Yours friendly,
P.Madhava Rao.
such direct saving facility is not available in Lekhini.
one can copy the Telugu text and paste into notepad
and use “save as” method to save the text in unicode
OR one can copy into MS-Word / any word processor
and save the Telugu text for later use.
i want to use this in my jsp page can anyone help me my mail is :msg4srinu@gmail.com
అయ్యా మీ ప్రయత్నం బాగుంది . కాని మీరు సూచించినట్లు ఆఫ్ లైన్ లో లేఖిని పనిచేయడం లేదు. మార్గం తెలుపండి . — ఎ.రామమోహన శర్మ. నంద్యాల.సెల్ నెంబర్ 9010568235
how can we print only telugu matter only without printing the rest of the page? sudhakar
లేఖిని నుండి పాఠ్యాన్ని వర్డ్‌లో పేస్టు చేసుకుని ప్రింటు తీసుకోండి.
dhanyosmi!!! anugraheetosmi. meeru chestunna ee seva telugu prapanchaaniki ento laabha daayakam. vidheyuDu sudhakar. how do we type blog answer in telugu directly? Dr.Rao
guriji gaaru nenu telugu typing adobe photoshop lo typ cheyadaaniki oka manchi software chppandi ippatiki nenu chala softwares(aksharamala,google input tools, baraha ) vaadaanu kaani emi prayojanam ledhu perfect gaa type chyadaaniki kaavali
kaaka pothe naaku a=అ aa=ఆ
ee vidhangaa type cheydaaniki oka manchi softwar kaavali
me replay kosam edhuru chusthaanu
it is usefull
tq
miru chala manchi software andhicharu thanks
sir da daa dha dha lu type chesina only dha mathrame osthundhi pls answer mee .
Lekhini message share cheyyabadadamledu
Sir, I am a beginner for use of lop-top & I-Pod. but I am able to type in telugu but could not save, using lekhini. I am facing problems to write certain compound letters also. Is there any device like writing pad to write to suplement such?
లేఖినిలో “చందమామ” అనే మాటని కరెక్ట్ పద్ధతిలో పైన ఫోనెటిక్ సింబల్ వచ్చేలా రాయడానికి ఇంగ్లీష్ కాంబినేషన్ కోడ్ తెలుసా?
I want this “_o” phonetic symbol on top of “cha” and Ja in jalleda
ౘ, ౙలు బాగానే వస్తున్నాయి కాని దీర్ఘాచ్చుతో ౘాలు ౙాలు – వీటినెలా రాయాలో చెప్పండి, ప్లీజ్.
మీరు వ్రాసినట్టే! కాకపోతే, వాటిని సరిగా చూపించే ఖతి (ఫాంటు) మీ కంప్యూటరు/ఫోనులో ఉండాలి.
(ఇది గూగుల్ ఇన్పుట్ తెలుగు లో టైపు చేస్తున్నాను. ) నా సిస్టంలో ఫైర్ ఫాక్స్ గాని ఓపెరా గాని లేవు. కంప్నేయుటర్ను జ్ఞానం కూడా అంతంత మాత్రమే. కేవలం ఇంగ్లీష్ టైప్ చేయగలను. ఇంతకు ముందు బరహ సాఫ్ట్ వేర్ వాదేవాడిని, కాని అది వర్డ్ కి compatible కాకపోవటంతో ప్రస్తుతం గూగుల్ ఇన్పుట్ వాడుతున్నాను. ఇది పర్వాలేదు కాని దీని ఇబ్బందులు దీనికి ఉన్నాయి. సంగీత పాఠాలు నోట్ చేసుకోవటానికి —- పై స్థాయిని సూచించ టానికి ఆ ఆ స్పైవరాల పైన చుక్కలు, అలాగే మంద్ర స్థాయి సూచించ టానికి కింద చుక్కలు పెట్ట వలసి ఉంటుంది. దానికి ఏం చేయాలి.
పై పోస్ట్ లో కొన్ని తప్పులు దొర్లాయి. [కంప్యుటర్ బదులు ‘కప్నేయ్యుటర్’ అని ; [వాడేవాడిని కి బదులు వాదేవాడిని] అని పడింది. ఇవి గూగుల్ ఇన్పుట్ ఇబ్బందులు.