గణతంత్ర దినోత్సవ కానుక: ఇన్‌స్క్రిప్ట్ లేఖిని

ఇప్పుడు లేఖినిలో ఇన్‌స్క్రిప్టుని టైపు చేసుకోవచ్చు మరియు నేర్చుకోవచ్చు: lekhini.org/inscript

ఇన్‌స్క్రిప్ట్ లేఖిని తెరపట్టు

ఇన్‌స్క్రిప్ట్ నేర్చుకునే వారికి ఉపయోగంగా ఉండాలన్న ప్రధాన ఉద్దేశం తోనూ, ఎప్పుడైనా ఇతరుల కంప్యూటర్లో త్వరగా టైపు చెయ్యాల్సి/చేసుకోవాల్సి వచ్చినప్పుడు (ఇన్‌స్క్రిప్ట్ స్థాపించే సమయం తీరికా లేనప్పుడు టైపు చేసుకోడానికి) వీలుగా ఉండాలన్న అనుబంధ ఉద్దేశంతోనూ దీన్ని తయారు చేసాను.

ఇదింకా సంపూర్ణం కాదు. లోపాలు ఉండొచ్చు. చేయాల్సినవీ ఉన్నాయి.

 • అక్షరమాల
  • ప్రస్తుతానికి దీనిలో ఇన్‌స్క్రిప్ట్ లేయవుట్ పూర్తిగా లేదు: ౠ, ఌ, ౡ వంటి అక్షరాలులేవు. కానీ రోజువారీ టైపింగుకి సరిపోతుంది.
  • తెలుగు అంకెలు కనిపిస్తున్నా వాటిని ఇంకా టైపు చెయ్యలేరు.
  • అలానే ఇన్‌స్క్రిప్టులో లేని ౘ, ౙ లను కూడా చేర్చాలి.
  • ఇన్‌స్క్రిప్ట్, ఫైర్‌ఫాక్స్ వంటి పదాల్లో పొల్లుకి తర్వాతి అక్షారాన్ని వేరుగా ఉంచే ZWNJ కూడా ప్రస్తుతం పనిచేయట్లేదు. (కంట్రోలు + షిఫ్టు సంయుక్తంలో వచ్చే అక్షరాలు చేయాలి.) ఇది పూర్తయ్యింది.
 • సాంకేతికాంశాలు
  • దీన్ని కేవలం ఫైర్‌ఫాక్స్ మరియు క్రోమియం విహారిణులలో మాత్రమే పరీక్షించాను. ఓపెరాలో సరిగా పనిచేయకపోవచ్చు. IEలో ఏం జరుగుతుందో తెలియదు. మీరు మీమీ విహారిణుల్లో పరీక్షించి తెలియజేస్తే సంతోషం.
  • మీటల శైలికి బొమ్మలు కాకుండా, CSS3 శైలులని ఉపయోగించాను. మీరు పాత విహారిణులని ఉపయోగిస్తూంటే, పైన తెరపట్టులో చూపించినట్టు కనిపించకపోవచ్చు. మీ విహారిణిని కొత్త సంచికకి నవీకరించుకోండి.
  • మీరు టైపు చేస్తున్నప్పుడు మీటలు స్పందించడం జావాస్క్రిప్టు ద్వారా జరుగుతుంది. మీరు వేగంగా టైపు చేసినప్పుడు మీ కంప్యూటరు భారంగా నడవవచ్చు. (అన్ని ప్రముఖ విహారిణులూ తమ కొత్త సంచికల్లో జావాస్క్రిప్టుని మరింత వేగంగా పరిగెత్తించడానికి ప్రత్యేక ప్రయత్నాలు చేస్తున్నాయి. కనుక మీరు మీ విహారిణి యొక్క కొత్త సంచికని ఉపయోగించండి. ఇతరత్రా మీ జాల విహారణ కూడా వేగవంతమవుతుంది.)
  • మీరు ఆల్ట్, కంట్రోల్, షిఫ్ట్ మీటలను నొక్కినప్పుడు మీరు నొక్కింది కుడివైపు మీటో ఎడమవైపు మీటో విహారిణులు తెలియజేయడం లేదు. (మీరు సాంకేతిక నిపుణులైతే, ఈ విషయాన్ని పరిశోధించండి, ఏదైనా పరిష్కారం దొరికితే తెలియజేయండి.) కనుక మీరు ఏవైపు మీట నొక్కినా దీనిలో రెండు వైపుల మీటలూ స్పందిస్తాయి.

నా దృష్టిలో ఇన్‌స్క్రిప్ట్ అన్నది తెలుగులో టైపుచెయ్యడానికి అత్యుత్తమైన పద్ధతి. కాకపోతే, కొత్త వారికి దాన్ని నేర్చుకోవడమే కాస్త కష్టం (… అన్న భావన అంతే). ఇన్‌స్క్రిప్ట్ నేర్చుకోడానికి ప్రేరణోత్సాహాలకై ఈ టపాలను చూడండి:

అన్నట్టు, మీ సలహాలూ సూచనలూ సందేహాలూ తెలియజేయడం మర్చిపోకండి.

ఆనంద ఇన్‌స్క్రిప్ట్ లేఖనం!

తా.క.: దీనితో ఈ బ్లాగులో 200 టపాలు!

తా.క. 2013-05-19: కినిగె వారి ఉచిత తెలుగు టైపింగ్ ట్యూటరుకు లంకెను చేర్చాను.

10 thoughts on “గణతంత్ర దినోత్సవ కానుక: ఇన్‌స్క్రిప్ట్ లేఖిని

  1. ఈ మీటలు ప్రస్తుతం కీబోర్డుకే స్పందిస్తాయి. కనుక ఐపాడ్ వంటి వాటితో ఈ మీటలపై నొక్కలేరు. (మూషికాన్ని ఈ మీటలతో అనుసంధానం చేస్తే అప్పుడు పనిచేయవచ్చు.)

   పరీక్షించి చూసినందుకు నెనరులు.

 1. వీవెనుగారూ. ఈ టపా చాలా ఉపయోగపడుతుంది. చాలా సంతోషం.

  పైన “ప్రేరణోత్సాహాలకై” అన్న పదం తప్పుగా రాసారు. గమనించగలరు.

  అన్నట్టు “wordpress.com” నందు translation members లో మీ పేరు చూసాను. నాక్కూడా interest ఉంది. కానీ ఏం చెయ్యాలో తెలియదు. దయచేసి సూచనలివ్వగలరు. తెలుగు కోసం కొంత సమయం తప్పకుండా కేటాయించగలను.

  1. బాలు గారూ, అచ్చుతప్పుని సూచించినందుకు నెనర్లు. సరిచేసాను.

   అనువాదాలు చెయ్యడానికి ముందుకొచ్చినందుకు కృతజ్ఞతలు. WordPress.comని ఇక్కడ అనువదించవచ్చు: translate.wordpress.com. మీకు WordPress.com లో ఖాతా ఉండాలి.

   (బయటి గూళ్ళలో కూడా స్థాపించుకోదగిన) WordPressని లాంచ్‌ప్యాడ్‌లో అనువదించవచ్చు. వర్డ్‌ప్రెస్ తెలుగు అనువాదకుల గుంపులో చేరండి.

   అలానే, ఇతర తెలుగు స్థానికీకరణ చేపట్టులలో పాల్గొనాలంటే, తెలుగు స్థానికీకరణ గుంపుని చూడండి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.