అభిప్రాయ సేకరణ: కూడలిలో కెలుకుడు బ్లాగులని ఉంచాలా?

సూటిగా, సుత్తి లేకుండా ;)

 

పరాచికాలు అలా ఉంచితే, కూడలి కొన్ని రకాలైన బ్లాగులని అనుమతించడం ద్వారా ప్రోత్సహిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలానే నిందాపూర్వక, ద్వేషపూర్వక (లేదా అటువంటి వ్యాఖ్యలని ప్రోత్సహించే) బ్లాగులకీ కూడలిలో స్థానం ఉండకూడదన్న విన్నపాలూ నాకొస్తున్నాయి. నన్ను సంప్రదించిన వాళ్ళకి నచ్చని బ్లాగులు చదవకండి అని సలహాని ఇస్తూ వస్తున్నాను. (నచ్చని బ్లాగులని మీకు కనబడకుండా చేసుకునే సౌలభ్యం కూడా కూడలిలో ఉంది.)

తెలుగు బ్లాగుల సంఖ్య మునుపెన్నడూ లేనంత వేగంగా పెరుగుతుంది. కూడలిని మెరుగుపరిచే విషయంతో బాటు, నిర్వహణాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా కూడలికి విషయ విధానం ఉండాలని ఆలోచిస్తున్నాను. అదే పనిలో, బ్లాగరుల ప్రవర్తనా నియమావళి, బ్లాగర్ యొక్క విషయ విధానం, వర్డుప్రెస్సు.కామ్ యొక్క విషయసమర్పకుల బాధ్యతల (రెండవ బిందువు దాని ఉపబిందువుల) నీ చదువుతున్నాను. మీరూ చదవండి; బ్లాగరుగా మన హక్కులూ భాధ్యతలని తెలుసుకోవచ్చు.

ఈ సందర్భంగా, మీరు—కూడలి సందర్శకులు—కూడలిలో ఎటువంటి బ్లాగులని చూడకూడదనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని ఇక్కడ వ్యాఖ్యలుగా గానీ, లేదా నేరుగా support ఎట్ koodali డాట్ org అన్న చిరునామాకి వేగు ద్వారా గానీ తెలియజేయవచ్చు.

తా.క.: వ్యాఖ్యలు నాకు ఖాళీ సమయం దొరికేంతవరకూ అనుమతి కోసం వేచియుంటాయి.తాజాకరణ.

37 thoughts on “అభిప్రాయ సేకరణ: కూడలిలో కెలుకుడు బ్లాగులని ఉంచాలా?

 1. ఒకరు ఒక కంప్యూటర్ నుంచి ఎన్ని వోట్లైనా వేయగలిగే సౌలభ్యం ఉన్నపుడు ఈ వోటింగ్ కి విలువ లేదు.

 2. The title says “కెలుకుడు బ్లాగులని” and the text says “నిందాపూర్వక, ద్వేషపూర్వక” – Are you trying to link those two apsects? I can guess where this is going :))

 3. మీరు కెలుకుడు బ్లాగులు అని ఏ బ్లాగులకు ఎలా ముద్ర వెస్తారొ తెలీదు. ఉదాహరణకి ఈ మద్య వెలిసిన కొన్ని బ్లాగులు పర్ణశాల లొ కెలికిన కెలుకుడుకి, మొదట బాధ పడి.. ఎన్నొ రొజులు సహించి..అఖరుకు కడుపుమండి.. అత్మగౌరవ సమస్యగా అనుకున్నకే వెలిసినవి. అవి ఒక్కటే ఆ పర్ణశాల బ్లాగు పిచ్చిరాతలకి అడ్డు వెయ్యగలవు అని నమ్మాకే ఆ బ్లాగులకి ఇంత సప్పొర్ట్.. ముందు కలుపు మొక్కలవంటి పర్ణశాల వంటి బ్లాగులు తీసెస్తే అసలు మిగతా కెలుకుడు బ్లాగులన్ని వాటికవే ముగుసుకుపొతాయ్

 4. ఇప్పుడు రెగులేషన్ గుర్తుకొచ్చిందన్నమాట! సంతోషం! ‘ నీ గొడుగు వూపే
  అసలు కెలుకుడు బ్లాగు ఎదుకు తెరిచారు? స్వయంప్రకటిత ‘మేధావులు ‘, ‘హేటువాదులు ‘ మతపరమైన విషయాలమీద ఇది మంచిదికాదు, వద్దని వారించినా ‘ నా బ్లాగు , నా ఇష్టం ‘ , ‘ఇష్టంలేకుంటే రావొద్దు ‘ , ఇలా పెడసరంగా జవాబివ్వడం వల్ల. వాక్స్వాతంత్ర్యము వుంది కదా అని అమ్మనా బూతులు బ్లాగుపట్టుకుని ఎవడేమనుకుంటే నాక్నేటి , ఎందుకు వేయకూడదు?
  పెంటశాల బ్లాగ్ లో అభ్యంతరకరమైన , తన ముస్లిం మిత్రుని ‘ సహకారంతో ‘ హిందూ మతాన్ని టార్గెట్ చేసుకుని ఈ తోలుమంద మేధగేదెలు(ఆవులు కాదు ) కూసిన కారుకూతలను రెగులేట్ చేయాలని మీకెందుకనిపించలేదు?
  ఆ తురక ఎదవ డేనిష్ కార్టూన్లు ఈ మేధగేదెకు తన బ్లాగులో వేయమని ఎందుకివ్వలేదు?

  ” Your freedom ends, where others rights begin “

 5. కాబట్టి, అలాంటి తింగరి ఎదవలు , ఎదవిలు వున్నంతవరకూ కెలుకుడు బ్లాగు కొనసాగించడం తప్పులేదు, అని మనవి.
  అది ఫ్రీడం ఐతే , మరి ఇదీ ఫ్రీడమే కదా!? అసలు మీకీ ధర్మసందేహమెందుకొచ్చింది, సమవర్తీ? :P

 6. అందరినీ పిలిచి ఆ ఏటిగట్టునో, ఇరానీచాయి హోటల్లోనో కూర్చోబెట్టి మంగలిగంగన్నని పిలిపించి గొరిగించండి! ఏంటి గొరిగించేది? ఓ అదా ! అవును అదే అదే! ఆపైన సువర్ణరత్నమణిమయలతో తాపడం చేసిన బంగారు కుక్కలను తెచ్చి ఆ గొరగబడ్డవాళ్ళతో దానమిప్పించండి! ఎవరికి ? వారికే – ద్వేషులకూ, వేషులకూ, సూకరములకూ!

  అసలు జనాలు మిమ్మల్ని సతాయించడమేమిటో! మీరు ఇలా జనాలను అడగటమేమిటో! మీకు తీసెయ్యాలనుంటే తీసెయ్యండి. అడిగేవాడెవడు? ఐతే ధర్మం పాటించండి. తీసేస్తే అన్నీ తీసిపారెయ్యండి. ఉంచితే అన్నీ ఉంచెయ్యండి. అంతేకానీ కొన్ని సూకరాల్ని వదిలిపెట్టే సడలింపు కార్యక్రమాలు వైపు మొగ్గారనుకోండి, మనకు సకిలింపులే శరణాగతి – ఇప్పుడు కాకపోతే కొన్నిరొజులకైనా. అలవాటైన వాసనల కోసం సూకరాలు ఘూర్జరించకమానవు, వాటిని అదిలించటానికి చర్నాకోలలు రాకా మానవు. మళ్ళీ కప్పలబావే…

  గొణిగేవాళ్ళు మూసివాయనం ముత్తైదువుల్లాగా వాకిట్టో నుంచునే వుంటారు. మరి మీరు అంగోస్త్రం జాడిస్తారో, కొల్లాయిగుడ్డ జాడిస్తారో – చేసే పని చక్కగా , పిండే నీళ్ళు తిరిగి బావిలోకి పోకుండా చూస్కోండి… భోక్త, హోత అన్నీ మీరే,మంత్రం కూడా మీదగ్గరే ఉన్నది. రెండవ భోక్తకోసమో , వాడి వెర్రిమొర్రి ఆలోచనల కోసమో, అబ్బి గాడి ఇప్పరాయాల కోసమో చూస్తే – ఇహ ఇంతే సంగతులు.

 7. సూటిగా సుత్తి లేకుండా అడిగారు కాబట్టి :

  1. నిందాపూర్వక, ద్వేషపూర్వక బ్లాగులంటే ఏమిటి?
  2. కెలుకుడు బ్లాగులంటే ఏమిటి?

  హిందువులని అపహాస్యం చేసి, ఆనందించే బ్లాగులు మొదటి రకం అనుకుంటే, వాటిని ఎగతాళి చేస్తూ వ్రాసే ఇతర బ్లాగులు రెండో రకం అనుకోవచ్చేమో. రెంటికీ కూడలిలో స్థానం కల్పించారు కాబట్టి, ఇక మీకు కలుగుతున్న ఇబ్బందేముంది?

  మొదటి రకం బ్లాగులని కాదంటే మిమ్మల్ని “నియో హిందు మతతత్వ వాదులుగా” ప్రతిఘటిస్తారు. రెండో రకం బ్లాగులని కాదంటే, “నియో దళితిస్టు వాదులుగా” పరిగణిస్తారు.

  మీరు ఎలా పరిగణించబడాలనేది, బ్లాగర్ల ఛాయిస్ మీద ఆధారపడటంలో అర్ధం లేదు.
  That’s your choice.

 8. మీరు కొద్దిమంది ఆడోళ్ళ వొత్తిడికి లొంగిపోయి ఈ పోల్ పెట్టారని జనాభిప్రాయం. ఆపై మీ ఇష్టం.

 9. వీవెన్ గారు, ‘కెలుకుడు బ్లాగులు ‘ అనే పదం అంత సరైనది కాదు. అది ఒకరి రాతలకి ‘వ్యంగ్యం’ గా వ్రాస్తున్న పోస్టులు మాత్రమే. ఎక్కడా పానశాల బ్లాగులో కత్తి పేరు గాని, అతని బ్లాగుల లంకె గాని ఇవ్వట్లేదు. అయినా నగ్న చిత్రాలనే ‘ఆర్ట్’ గా ఆనందించే వారికి ‘వ్యంగ్యం’ ఆర్ట్ అని తెలీదా?

  అయినా ఒకరు వ్రాసిన టపా లకి కౌంటర్ గా ఇంకొకరు వ్రాయటం, అందులో వ్యక్తిగత నిందలవరకు కామెంట్లు వ్రాయటం జరుగుతున్నదే. మీరు నిషేదించాల్సివస్తే యావత్ హిందూ సమాజాన్ని ‘కెలుకుతున్న ‘ బ్లాగుని ముందుగా నిషేదించండి, లేదా ఆ బ్లాగు నించి వచ్చే కొన్ని పోస్టులని నిషేదించండి. అప్పుడు ఎవరికీ కెలకాల్సిన అవసరం రాదు.

 10. వ్యక్త్వాన్ని దెబ్బతీసే విధంగా కొ౦తమ౦ది పేరుతొ బ్లాగులు రాస్తున్నారు. ప్ర.సి.సే.నా.పేరుతొ వున్నా బ్లాగు పూర్తిగా పేరడీగా కొనసాగుతోంది. ఇది మంచి పద్దతి కాదు. ఆ మధ్య జ్యోతి గారిపైన కుడా బూటు వ్యాఖ్యానాలతో రాసారు. ఇది తెలుగు బ్లాగులలో చోటుచేసుకున్న అనారోగ్యకర పరిణామం. వీటికి ప్రాచుర్యం కల్పిమ్చాకపోవడమే మ౦చిది. ఎవరైనా రాసిన విషయాలు నచ్చకపోతే చదవకు౦డా వదిలేయోచ్చు. లేదా తను రాసిన కామె౦ట్లు పక్కన బెడితే కొ౦తకాలానికి ఆయనే మానుకు౦టాడు. అ౦తే కానీ పెరడిగా ఒక బ్లాగు మొదలెట్టి వ్యక్తిత్వాన్ని గాయపరచారాడు. ఇది నా అభిప్రాయం. విజ్ఞులు ఎలా స్పందిస్తారో మీ ఇష్టం.

 11. కొన్ని బ్లాగులు నీతి హేయమైన టపాలను రాస్తు ఇతరుల మనోభావలను దెబ్బ తీస్తున్నాయి. ఇటువంటి బ్లాగులను తీసివెయటమె మంచిది.

 12. freedom of expression, freedom of rights , freedom of speech , freedom of atrocities , freedom of religion , freedom of caste, freedom of views , freedom of compassion …
  అంటూ చాల వున్నాయి కదండీ …

  వీటి మాట ఏంటి ?
  రెండు వైపులా నరుకుతే ఎవరికీ బాధ లేదు , అదే ఒక వైపే చేస్తే , it will completely raise questions on your integrity .

  Think veeven gaaru …

  what should be there and what should not be there is up to the individual.

  If you say koodali is to help telugu people to read blogs then how can you ban something basing on these kind of things ? That is utter one sided story of the blogs . what about the other side ?

  లేక కూడలి కేవలం మీ బ్లాగు అగ్రిగేటర్ అనుకుంటే సమస్యే లేదు , మీకు తోచింది చేయండి …
  భవదీయుడు
  జాతర్ డమాల్

 13. There is a limit for everything. When one crosses the decency it ie extremely regrettable. It only reflects on the menatl state of the person who comesa cross with such humour coated indecency.

 14. అలాగే ఓ మతాన్ని పనిగట్టుకొని ద్వేషించే తోలుమందం గాళ్ల బ్లాగులు, కేసులు పెడతాము అని బెదిరించే కేతి గాళ్ల బ్లాగులు కూడా మన(మీ) కూడలి లో ఉంచాలో, వద్దో అంటూ ఓ అభిప్రాయసేకరణ ఎందుకు పెట్టటం లేదు మీరు?
  మీమీద కేసులు పేడతారేమోనన్న భయమా?

 15. ఇతరుల మనోభావాలను గౌరవించటం అనేది బాధ్యత . ఆబాధ్యత లేకుండా ఇతరుల మత,సాంస్కృతిక విషయాలను విమర్శిస్తూ వ్రాసే రాతలను అనుమతించినప్పుడు ,వాటికి పేరడిలు కూడా మొదలవుతాయి. అలాగే ఇతర బ్లాగుల విషయం లోకూడా . ఇక ఇది మీరు ఎంతో కష్టించి నిర్మిస్తున్న సౌధం . దీనిలో ఎవరిని సంతృప్తి పరచాలనే అంశం కాకుండా ధర్మనిర్ణయం చేయండి . ఇక ఇది మీ స్వంతం కనుక మేము సూచనను మాత్రమే చేయగలిగి ఉంటాము .ధన్యవాదములు

 16. @saamaanyudu
  అయ్యా,
  ప్రపీసస గురించి ఇక్కడ చర్చ ఎందుకు?? మా బ్లాగు కూడలి/జల్లెడ/హారం లో లేదు.. వాటి అవసరం మాకు లేదు/రాదు. నచ్చకపోతే చదవకుండా వదిలెయచ్చని మీరే చెప్పారు. మరి మీరు ఇక్కడ మా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు??
  తెలుగు బ్లాగులలో కనిపిస్తున్న అనారోగ్యకర పరిణామమా?? ఓహో సారు బయలుదేరారండి! మరి సదరు బ్లాగరు భరద్వాజ గారి కుటుంబాన్ని గురించి మాట్లాడినప్పుడు మీరు ఎందుకు వ్యతిరేకించలేదు?? అది ఆనారోగ్యకర పరిణామం లా మీకు కనిపించలేదా??

  చివరగా ఒక్కమాట: ప్రపీసస కు కూడలి చెత్త గొడవలకు ఎటువంటి సంబంధం లేదు. కనుక ప్రజలు తమ హద్దులెరిగి మమ్మల్ని ఇందులోకి లాగకుంటే మంచిది.. మేము మా బ్లాగును కూడలి లో చేర్చమని ఎప్పుడూ అడగలేదు. కేవలం మా “మిత్రులు” అనుకున్న కొందరికి మా వ్యక్తిగత మెయిల్ ద్వారా link ఇవ్వడం జరిగింది..

  Hope people will realise their limits and stick to them.

  -కార్తీక్
  ప్రచార కార్యదర్శి
  ప్రపీసస

  1. ఎవరిగురించైనా ఒక వ్యక్తిపై అంత తీవ్రంగా ఒక బ్లాగురూపంలో రాస్తున్నారని నేను ఇక్కడ ప్రస్తావించాను. కూడలిలో వుందో లేదో గమనించలేదు. ఇలా రాయడం భావ్యంకాదనిపించి రాసాను. ఆయనకు చాలా తిట్లు తిడుతుంటారు. అలాగే భరద్వాజ గారి గురించి ఆయన మాటాడింది నేను చూడలేదు. ఎవరైనా వ్యక్తిగత దూషణలకు దిగడాన్ని నాకు నచ్చదు. అదే రాసాను. నేనేమీ బ్లాగోద్దరుడ్ని కాదు. మీరు సారు బయలుదేరారండీ అని వెక్కిరించడానికి. నేను అనవసరమైన విషయాలలో, చర్చలలో ఎప్పుడూ పాల్గొనను. నాకు తోచింది రాస్తాను. అది అంతా చదివి పొగడాలని కోరుకోను. నా భావాలను వ్యక్తీకరించడానికి మాత్రమే ప్రయత్నిస్తాను. అవి నచ్చకపోయినవాళ్ళ స్పందనలు కూడా నేను డిలెట్ చేయను. స్పాం గా కనిపించినవి వదిలేస్తుంటాను. వాటి గురించి నాకు తెలియదు. కొంతమంది కామెంట్లు అలా రాస్తూనే పనిగా వున్నారు. ఎవరి ఆనందం వారిది.కానీ అది అంతా గమనిస్తుంటారన్న జ్ఞానం వుండాలని కోరుకుంటున్నా.
   మీ బ్లాగు మీ ఇష్టం.

   1. ఒక వ్యక్తి గురించి రాసినప్పుడు ఆ వ్యకే బాధపడతాడు..
    ఇంకొకడు కొన్ని కోట్ల మంది మనొభావాలను గాయపరుస్తూ , కించ పరుస్తూ, అగౌరవపరుస్తూ, రాస్తుంటే…

    పైన మీరు చెప్పిన ఉదాహరణ లొ ఆ సదరు వ్యక్తి ఏ అభ్యంతరం చెప్పలేదు .. వళ్ళు అలొచించడానికి
    కానీ నేను చెప్పిన ఉదాహరణ లొ చాలా మంది ” మీ రాతల వల్ల మేము బాధపడుతున్నాం..మామ్మల్ని ..మా నమ్మకాల్ని కించపరచడం మానండి బాబొ” అని చెప్పిన సరే అలాగే రాస్తుంటే …

    – ఎం చేద్దాం సామాన్యుడు గారు

   2. @ సామాన్యుడు
    అసలు వున్నా వందల బ్లాగుల్లో కేవలం కొందరిని మాత్రమె కెలుకుతున్నారంటే అర్థం ? తప్పు ఎప్పుడు రెండువైపులా వుంటుంది సామాన్యుడు గారు . మీరు ఇలాంటి వాటికి దూరం అంటున్నారు , మరి ఎలా మా బ్లాగు సంఘాన్ని వాడారు ఇక్కడ ? అసందర్భం.

    విషయం అంతా చూడకుండా మీ పాటికి మీరు మా ప్ర పీ స స ని లాగటం అన్యాయం .
    – జాటర్ డమాల్ ప్ర పీ స స elite group .

 17. ముందుగా ఎవరినైనా నొప్పి౦చి వు౦టే సారీ..
  మీరు ఎదురుచూస్తున్నా ఆ ఇద్దరు చర్చకు దూర౦గానే వున్నారు.
  బ్లాగుల ద్వారా తెలుగు వాళ్ళ మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పడాలని ఆశించే వాళ్ళలో మొదటివాడిని.
  వ్యక్తిగత, కౌటు౦బిక విషయాలపై దాడి చేసే వాళ్ళను వ్యాఖ్యలను౦డి దూర౦గా వు౦చడ౦ మ౦చిది.
  కాస్తా విజ్నుల౦తా ఆలోచి౦చగలరు..

  1. అసామాన్యుడు గారు
   మీరీ మద్య ” సరిగ్గా ” గమనించి వుంటే ఒకే ఒక బ్లాగులొ రాసిన విషపు రాతలవల్ల ఇన్ని పేరడీ బ్లాగులు వచ్చాయి..
   మీరు కోరుకున్నట్టు కాస్తాయిన వున్న సుహృద్భావ వాతావరణం మొత్తం చెత్త చెదారమయిపొయింది..

   ఒకడు తనని తిడతే బాదపడతాడు.. ఇంకోడు తన కుటుంబ సభ్యులని తిడతే బాధపడతాడు.. ఇంకోడు తన లొటుపాట్లని ఎగతాళి చేస్తే బాధపడతాడు , ఇంకోడు తన నమ్మకాల్ని ఎగతాళి చేస్తే బాధపడతాడు.. ఒకడు కులం పేరు ఎత్తితే కేసు అంటాడు.. ఇంకోడు తమ మతాన్ని తిడితే ఎడుస్తాడు …

   ఎదుటి వ్యక్తి ఎందుకు ఫీల్ అవుతాడొ తెలిసినప్పుడు వాళ్ళ మనోభావాలను గౌరవించటం అనేది ఒక మనిషిగా అతని బాధ్యత.. అవన్నీ గాలికి వదిలేసి ఇస్టం వచ్చినట్టు పెట్రేగిపొయి వాగుతూ ఎంతొ మంది మనొభావాలని గాయపరుస్తున్నప్పుడు మీరు ఏం చెస్తున్నారు .. అప్పుడు ” సుహృద్భావ వాతావరణం” గుర్తుకురాలేదా… లేక కావాలనే మర్చిపొయారా.. ఇప్పుడు విజ్ఞులకి పిలుపులు ఇస్తున్న మీ విజ్ఞత అప్పుడు ఎక్కడికి పొయింది.. అంటే ఆ రాతల వల్ల బాధపడినవాళ్ళు మీ ద్రుస్టిలొ మనుషులు కాదా .. వారిది బాధ కాదా.. ఎం మనొభావాలు అనేవి కేసులు పెట్టగలిగే వారికే వుంటాయా .. ఎంతో పవిత్రం గా చూసుకునే దేవతామూర్తులను కించపరుస్తా రాస్తున్నప్పుడు మీరు ఎంజాయ్ చేసారా.. అప్పుడు మీ నోరు మూగబొయిందే ..

   ” నచ్చకపోతే చదవకు౦డా వదిలేయోచ్చు. లేదా తను రాసిన కామె౦ట్లు పక్కన బెడితే కొ౦తకాలానికి ఆయనే మానుకు౦టాడు.” ఈ ఉచిత సలహా ఇక్కడ ఇచ్చేబదులు .. ఎక్కడో ఎవరికొ అన్యాయం జరిగిపొయింది అని మీరు తెగ ఫీల్ అవుతున్నరుకదా .. వారికి ఇవ్వండి.. ముఖ్యంగా మీరు ఎదుటివారికి ఎదయినా సలహా ఇచ్చెముందు .. ఒక్క క్షణం మీకు మీరు అలొచించుకొండి.. తర్వాత మమ్మల్న్ని ఉద్దరించవచ్చు.. ఎమంటారు

  2. “మీరు ఎదురుచూస్తున్నా ఆ ఇద్దరు చర్చకు దూర౦గానే వున్నారు” అంటున్నారు సామాన్యుడు గారు, ఆ ఇద్దరు ఎవరో చెబుతారా? ఒక వేళ ఆ ఇద్దరిలో మా ప్రవీణ్ అన్నయ్ ఒకరని మాత్రం చెప్పి మా అన్నాయ్ పరువు తీయకండి, మా ప్రవీణ్ అన్నయ్ తింగరి అయితే కావచ్చు కాని, తను ఓ మనిషి, పశువు మాత్రం కాదు:), గొడ్డు మాంసం కోసం తపించి పోతూ, ఆత్మనూన్యతలో పీకల దాకా కూరుకొన్నవాడు కాదు,
   పైన ఉన్న గొడవ నాకు తెలిసి ఒకరి గురించే, ఇందులోకి అనవసరం గా పాపం ప్రవీణ్ ను ఎందుకు లాగుతున్నారు మీరు, ఏదయినా ఎజండా నా? ఉన్న సమస్యను పక్క దారి తెలివిగా పట్టించే ప్రయత్నమా?

   కూడలి లో ఎప్పుడూ లేనట్టి “ప్ర. పీ. స.” గురించి ఇక్కడ ఇక్కడ మాట్లాడటం అవసరమా? ఎందుకు చర్చను పక్క దారి పట్టించాలని కేతిగాడి తోక లాగా ప్రయత్నిస్తున్నారు? లేక ప్రవీణ్ అన్నాయ్ ని, కేతి గాళ్లతో కలిపి ఒకే తూనిక లో వేయటం ద్వారా , తనను భారిగా మానసికంగా హింసించే కుట్రా? “”ప్ర. పీ. స.” కూడా ఇంత దారుణానికి ఎప్పుడూ ఒడగట్టాలని అని అనుకోలేదే!!

   “”ప్ర. పీ. స.” అతిధి కార్యవర్గ సబ్యుడు.

 18. ప్ర.పీ.స.స బ్లాగ్ ని నవంబర్ నెలలో ఒకసారి మాత్రమే చూశాను. ఆ తరువాత మళ్ళీ చూడలేదు. నాకు ఫోన్లు చేసి ఆ బ్లాగ్ చూడరా బాబు అని విసిగిస్తున్నారు. అయినా చూడలేదు. ఇష్టం లేనప్పుడు ఫోన్లు చెయ్యకూడదని తెలియదా? నాకు భరద్వాజతో గొడవ వస్తే భరద్వాజ ఫోన్ చెయ్యాలి. అతని తరుపున పది ఇరవై మంది అవసరం లేని ఫోన్లు చెయ్యడం ఎందుకు?

 19. నేను ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్నాను. ఇవన్నీ చదివే టైమ్ నాకు లేదు. ఏదో సామాన్యుడు గారు అడిగారు కాబట్టి చెప్పాను.

 20. My 4 annas.
  ౧. ఈ పోల్ కి విలువ లేదు. ఎందుకంటే దొంగ వోట్లు వేయడం వీజీ కాబట్టి.
  ౨. ఇక్కడ వ్యాఖ్యలకు, పోల్ రిజల్టుకు పొంతన కనబడట్లేదు.
  ౩. మీకేవైనా external pressures ఉంటే, అభిప్రాయాలు గట్రా వద్దు. మీ ఇష్టమొచ్చిన పని చేయడం మంచిది.
  ౪. మీరు నిజంగా సందిగ్ధతలో ఉంటే, రెండు వైపులా న్యాయం చూడండి.

 21. అస్సలు కెలుకుడు పోస్టు అంటే ఇదే. అనవసరంగా ఓ కెలుకుడు పోల్ పెట్టి, బ్లాగర్ల మధ్య చిచ్చు పెట్టి, మంట ఎగదోసి వ్యాఖ్యలకు ఇంకా సమాధానం ఇవ్వకుండా తమాషా చేస్తున్న/చూస్తున్న ఈ బ్లాగుని ముఖ్యంగా కూడలి నుండి నిషేధించాలి అని డిమాండ్ చేస్తున్నాను అధ్యక్షా!

 22. ప్రవీణ్ ని కత్తి ని ఒకే గాటన కట్టడం నేను ఖండిస్తున్నా .. ప్రవీణ్ కి కాస్త నిజాయితీ మానవత్వం వున్నాయ్ .. ఎవర్ని బాధపెట్టి సంతొషించే పైశాచిక ఆనందం లేదు..

 23. జ్యోతి గారి గురించి డిస్కషన్ ఇక్కడ అనవసరం. జ్యోతి గారి టపాలో ఆమెకి లింక్ ఎవరు పంపారో చెప్పలేదు. ఆ లింక్ నేను పంపలేదు. ఆ రోజు మలక్పేట్ రౌడీ (భరద్వాజ) ఆ లింక్ నేను పంపానని తన బ్లాగ్ లో వ్రాసే “ఎద్దు ఈనింది అంటే దూడని కట్టేయండి” అన్న సామెతలాగ తలలు ఊపారు. నాకే సరిగా గుర్తు లేని నేను వ్రాసిన “కొత్త చిగురు” కథకి ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చారు.

వ్యాఖ్యలను మూసివేసారు.