కూడలిలో మీకు నచ్చని బ్లాగులు, గట్రా

మీరు కూడలికి వచ్చినప్పుడు ఇలా అనుకోవాల్సివస్తుందా?

ఇప్పుడే కూడలి ఓపెన్ చేస్తే షరా మామూలు గా ఒక […] టపా కనిపించింది.
ఎప్పటిలానే మొదటగా కోపం, తర్వాత నవ్వు కొంచెం చిరాకు..

అది నిరాసక్తత, ఆందోళనగా మారే ముందే ఒక ఉపశమనం.

కూడలికి పెద్దయెత్తున మార్పులు జరిగి, టపాలకు రేటింగులు, మీకు నచ్చిన బ్లాగులతో ‘నా కూడలి’ లాంటి సౌలభ్యాలన్నీ అందుబాటులోకి వచ్చేవరకూ కాస్త ఉపశమనంగా మీకు నచ్చని బ్లాగులని నుండి వచ్చే టపాలను కూడలి నుండి తొలగించుకొనే సదుపాయం కల్పిస్తున్నాను. మీకు నచ్చని బ్లాగులని ఒక జాబితాలో చేర్చుకుంటారు (ఈ జాబితా మీ విహారిణిలో కూకీలుగా భద్రమవుతుంది.). మీరు కూడలి తెరిచినప్పుడు, ఆ బ్లాగులనుండి టపాలని కూడలి మీకు చూపించదు.

మీరు చూడకూడదనుకుంటున్న బ్లాగుల టపాలని తొలగించేసేసుకోవడం వల్ల, కూడలికి వచ్చే ప్రతీసారీ మీరు కొంత ప్రశాతంగా ఉండొచ్చు. (ఇలా ఎక్కువ మంది తొలగించుకున్న బ్లాగులకి కూడలి నుండి వీక్షణలు తగ్గి, అది ఆయా బ్లాగులకి నిరుత్సాహకంగా పనిచేస్తుంది.)

ఎలా? కూడలికి వెళ్ళండి. పేజీ పైన ఉన్న నిర్వహణ అనే బొత్తంపై నొక్కండి.

నిర్వహణ పానెల్ బొత్తం

ఈ బొత్తం నిర్వహణ ప్యానెలుని తెరుస్తుంది. (కొంత సహాయిక సమాచారం కోసం అందులోని “సూచనలు” అన్న లింకు నొక్కండి.)

నిర్వహణ ప్యానెలులో మీరు కూడలిలో చూడకూడదనుకుంటున్న బ్లాగు చిరునామాని (http, www లు లేకుండా) ఇవ్వండి. ఉదాహరణకి, నా బ్లాగుని చూడకూడదనుకుంటే veeven అన్న దాన్ని చేరిస్తే సరిపోతుంది. మీరిచ్చిన పాఠ్యం చిరునామాలో గల టపాలన్నింటినీ కూడలి మీకు చూపించదు. (అందువల్ల వేరెవరైన టపా చిరునామాలో veeven అని వాడితే ఆ టపా కూడా మీకు కనిపించదు. ) wordpress అని చేరిస్తే, మీకు వర్డుప్రెస్ బ్లాగులేమీ కనిపించవు. కనుక బ్లాగు చిరునామాని డొమైను పేరుతో చేర్చండి. ఉదా.: veeven.wordpress.com

ఇది మీ విహారిణిలో పనిచేయడానికి జావాస్క్రిప్టు చేతనమై ఉండాలి. దీన్ని ఫైర్‌ఫాక్స్, ఓపెరా, అయ్యీ విహారిణులలో పరీక్షించాను. పరీక్షించడంలో తోడ్పడిన మిత్రులకు నెనర్లు. ఈ సౌలభ్యాన్ని ఏకలింగానికి అంకితమిద్దాం. :)

ఇది మీకు పనిచేస్తుందా? ఉపయోగకరంగా ఉందా?

మరొక్కటి!

కూడలికి ఉన్న హంగుల్లో మొదటిపేజీలోని యాదృచ్ఛిక ఫొటో ఒకటి. అయితే, కొన్నిసార్లు యాదృచ్చికంగా :) అక్కడ ఫొటో కనబడదు. ఇలా:
యాదృచ్చిక ఫొటో ఏది?

దీనికి సమస్య ఎక్కడ ఉందో అందం రాకేశ్వర కనిపెట్టి తెలియజేసారు. దాంతోబాటే, ఇక్కడ చూపించేవి పూర్తి వెడల్పు బొమ్మలు కాకుండా తక్కువ వెడల్పు బొమ్మలు బ్లాగర్ నుండి ఎలా తెచ్చుకోవాలో కూడా సూచించారు. వీటిని నేను అమలు చేసాను. ఇప్పుడు మీకు యాదృచ్ఛిక ఫొటో తప్పక కనిపిస్తుంది మరియు అందుబాటులో ఉన్నప్పుడు చిన్న (1600 పిక్సెళ్ళ బదులు 400 పిక్సెళ్ళ వెడల్పు) చిత్రాలనే తెచ్చిచూపించడం వలన మీకు బ్యాండ్‌విడ్త్ కలిసివస్తుంది.

ఆనంద కూడలి విహారం!

30 thoughts on “కూడలిలో మీకు నచ్చని బ్లాగులు, గట్రా

 1. ముందుగా వీవెన్ గారికి అభినందనలు.
  అయితే దీనిలో నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి.
  నచ్చని బ్లాగుల జాబితా కుకీ రూపంలో ఉంచుతుందన్నారు. అయితే మనకు నచ్చని జాబితా పెద్దగా ఉంటే వాటన్నింటినీ కుకీలో తక్కువ మెమొరీ మాత్రమే ఉండటం వల్ల కుకీలో పెట్టలేము కదా!

  [వీవెన్: అంత పెద్ద జాబితా ఉంటుందా? కుకీలో 4 వేల అక్షరాల వరకూ పడతాయి. సరిపోతుందనుకుంటున్నాను.]

  ఇంకో సందేహం ఏంటంటే…..సపోజ్ జనరల్ కూడలి ముందు పేజీలో ఒక ఇరవై టపాలు డిస్ప్లే అవుతున్నాయనుకుందాం. అందులో ఒక అయిదు మనకు నచ్చని బ్లాగర్ టపాలు ఉంటే….కస్టమైజ్డ్ కూడలి లో ( ఆ అయిదు టపాలు బ్లాగులు బ్లాక్ చేశామనుకుందాం..) ఈ అయిదు టపాలకు బదులు మరో అయిదు టపాలు అదనంగా ఆర్డర్ లో ఉన్నవి యాడ్ అవుతాయా? లేదంటే పదిహేను టపాలు మాత్రమే కనిపిస్తాయా?

  [వీవెన్: అదనంగా చేరవు. మీ ఉదాహరణ ప్రకారం పదిహేను టపాలు మాత్రమే కనిపిస్తాయి. తర్వాతివి ఆటోమెటిగ్గా చేరడం అనేవి ముందు ముందు.]

 2. Thanks you very much Veeven గారు. ఇది నేను ఊహించని మార్పు. ఈ మార్పును మీరు ఏకలింగం బ్లాగుకు అంకితం ఇచ్చి మీ పెద్దమనసు చాటుకున్నా దాన్ని అందుకునే అర్హత లేనివాని. ఈ మార్పు కూడలి బాగుండాలిని అని కోరుకున్న అందరికీ అంకితం.

 3. కొన్ని బ్లాగులను జతచేసిన తర్వాత, కూడలి ని ఓపెన్ చేసిన వెంటనే పేజ్ లోడ్ మొత్తం పూర్తయిన తర్వాత కుకీ ఛెక్ చేస్తున్నట్లుంది. దానివల్ల కుకీ తనిఖీ జరిగేవరకూ (కొన్ని సెకండ్లు) బ్లాక్ లిస్ట్ లోని బ్లాగులూ కన్పిస్తున్నాయి. ఇది పెద్ద అసౌక్యరం కాకపోయినా జస్ట్ మీ దృష్టికి తీసుకురావడానికి తెలియపరుస్తున్నాను.

  1. ప్రస్తుతానికి విహారిణిలోనే సంభాళిస్తున్నాను. అంత శక్తివంతం కాని కంప్యూటర్లలో లేదా నెమ్మది జాల అనుసంధానం ఉన్నప్పుడు (పేజీ లోడయినతర్వాత చేయడంవల్ల) కాస్త జాప్యమనిపించవచ్చు.

   సర్వరులోనే వడపోసి తేవడం ముందు ముందు చేద్దాం. నెనర్లు.

 4. మరో చిన్న సూచన. మీకు వీలువెంబడి “కూడలి” FAQ’s ఒక డాక్యుమెంట్ తయారుచేసి అందులో ఇతర సదుపాయాలు, ఇలాంటి కొత్త సదుపాయాలను ఎలా వాడాలి వంటి వివరాలు పొందుపరిచి మెయిన్ పేజీలో అందరికీ కన్పించేలా లంకె ఇస్తే కొత్తవారికీ ఈ సదుపాయాలపై అవగాహన వస్తుంది. మీ ఈ పోస్ట్ మహా అయితే ఒక్కరోజు మాత్రమే జీవితకాలం కలిగి ఉంటుంది. తర్వాత ఆ సదుపాయం ఉందన్న విషయం కొత్తవారికి తెలియదు కదా!

 5. మంచి మార్పు. నచ్చిన బ్లాగ్స్ బ్లాగ్లోనే పెట్టుకొనే అవకాశం. నచ్చనివి కూడలొంచి తీసె అవకాశం. కాని నాకో అనుమానం ..నాకు నచ్చని బ్లాగు నాకు మాత్రమె కనపడదు కదా. ఒక బ్లాగు మనకి నచ్చలేదు అని విషయం సదరు బ్లాగరు కి తెలిసే అవకాశం ఉందా?

  1. మనకి నచ్చలేదు అనే విషయం ఆ బ్లాగరుకి తెలియదు. ఈ జాబితాలు మీ విహారిణిలో ఉంటాయి. మీ కంప్యూటరు/విహారిణి రక్షణావలయాన్ని చేధిస్తే తప్ప ఇతరులకి తెలియదు.

   కానీ, ఎక్కువ మంది ఒక బ్లాగుని నచ్చని జాబితాలో పెట్టుకుంటే, కూడలి నుండి ఆ బ్లాగుకి వీక్షణలు తగ్గుతాయి. ఆ ధోరణి తెలుస్తుంది అంతే.

 6. బానే ఉంది ఫీచరు కానీ కుకీలతో దీనిని అమలు చేయడం బాగాలేదు. నాలాగా రోజూ కుకీలు తొలగించే వారికి అసౌకర్యం :-)

  ఇది చూడగానే నాకిది గుర్తుకొచ్చింది. ;-)

 7. వీక్షకుల సంఖ్య ఏమీ తగ్గదు. http://science.teluguwebmedia.net బ్లాగ్ పై కూడా కొందరు విమర్శలు చేశారు. అయినా ఈ బ్లాగ్ కి నిన్న 641 హిట్లు వచ్చాయి. బ్లాగ్ నచ్చిన వాళ్ళు చదువుతారు, నచ్చని వాళ్ళు చదవరు, అంతే.

 8. అద్భుతం! ఇక ఇది టపాల వరకే పరిమితమా?
  కూడలిలో నుంచి తీసేసిన నచ్చని టపాలతో పాటు లోని వ్యాఖ్యలు – కూడా కనపడకుండా పోతాయా?

 9. మనకు నచ్చని బ్లాగులని బ్లాక్ చేయడం బాగానే ఉంది.
  అలాగే ఒకో బ్లాగు నుండి కేవలం లెటెస్ట్ పోస్ట్ మాత్రమే కనపడేలా చేస్తే ఇంకా ఈజీగా ఉంటుంది. ఏమంటారు?

 10. వీవెన్ గారు. మీరు కూడలి కామెంట్ల సెట్టింగ్ కూడా మార్చి మూడు కంటే ఎక్కువ కామెంట్లు కనిపించకుండా సెట్టింగ్ పెట్టారు కదా. అయినా తమ కామెంట్లు తరుచూ కనిపించేలా చెయ్యడానికి తన బ్లాగ్ లో అజ్నాతల పేరుతో ఎక్కువ కామెంట్లు వ్రాసే వాళ్ళ సంగతి ఏమిటి? ఈ లింక్ లో 400+ కామెంట్లు వచ్చాయి. నేను వ్రాయడం తగ్గించి చదవడం పెంచితే రోజుకి ఒక పోస్టు మాత్రమే వ్రాయాలని సలహాలిచ్చిన వాళ్ళు ఒకే పోస్టులో వందల కామెంట్లు వ్రాసి కామెంట్ల సెక్షన్ లో తమ కామెంట్లు ఎక్కువ కనిపించేలా చేస్తున్నారు. నేను వాళ్ళతో మాట్లాడడం మానేశాను కానీ కామెంట్ల సెక్షన్ చూసే వారి కన్వీనియన్స్ గురించి ఆలోచించండి. 400+ కామెంట్లు వచ్చిన లింక్ http://malakpetrowdy.blogspot.com/2009/07/blog-post_6509.html కామెంట్ల సెక్షన్ చూసే వాళ్ళు ఉన్నారు కాబట్టి కామెంట్లు కూడా ఎక్కువ అనుమతించినా ప్రోబ్లమే.

 11. ఒక బ్లాగ్ నచ్చకపోతే ఆ బ్లాగ్ కనిపించకుండా కుకీస్ మార్చొచ్చు అని సెట్టింగ్ ఉన్నప్పుడు నచ్చని బ్లాగర్లని విమర్శిస్తూ 400+ పోస్టులు చెయ్యడం అవసరమా? ఈ సెట్టింగ్ లేని రోజుల్లో కూడా నాకు నచ్చని బ్లాగులు కనిపించినా చూడలేదు. ఇప్పుడు మాత్రం నచ్చని బ్లాగులు చదివి వాటిని మీద వందల కామెంట్లు వ్రాసి కూడలి వీక్షకులకి uncomfort సృష్టించడం అవసరమా?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.