బ్లాగోగులు

గమనిక: చాలా రాద్దామనుకునే దీన్ని మొదలు పెట్టాను. కానీ దీనిపై సమయం వెచ్చించలేకపోతున్నాను. మొదలు పెట్టిన ఈ టపాని ఇలాగే ప్రచురించేస్తున్నాను. కానీ నేనిచ్చిన లింకులు మంచి సమాచారాన్ని అందిస్తాయి.

XKCD - Duty Calls

XKCD by Randall

 • శోధన సుధాకర్ తెలుగీకరించిన బ్లాగర్ల ప్రవర్తనా నియమావళిని చూడండి.
 • బ్లాగుల్లో స్పందనలపై రానారె క్షణికమ్
 • Core Rules of Netiquette
 • New Game, Old Rules
 • కొత్తపాళీ బాగా చెప్పారు:

  బ్లాగడం మనందరికీ ఒక గొప్ప శక్తినిస్తోంది. ఒక వేదికనీ ఆ వేదిక మీద మాట్లాడేందుకు గొంతునీ ఇస్తోంది. ఆ శక్తి సామాన్యమైనది కాదు. గొంతులు నొక్కి వెయ్యబడే ఉక్కు పిడికిళ్ళ రాజ్యాల్లో సమయం గడిపి వచ్చిన వారిని అడగండి ఇది ఎంత అపురూపమైన శక్తో! దాన్ని సద్వినియోగం చేసుకుందాం. చర్చ ముఖ్యం .. ఆలోచనలు పంచుకోవడం ముఖ్యం. విభిన్నమైన ఆలోచనలు బయటికి రావడం, నిర్భయంగా స్వేఛ్ఛగా వ్యక్తీకరించ బడటం ముఖ్యం. ఆలోచనల్తో విభేదించడం తప్పు కాదు. అవసరమైతే విమర్శించడం కూడా మంచిదే. కానీ మన మాటలు ఒకరిని కించ పరచరాదు. జుగుప్సా కరమైన భాషా, వ్యక్తీగతమైన దాడులూ, అశ్లీలపు రాతలూ ఎవరికీ ఉపయోగం కావు. పూని ఏదైన ఒక్క మేల్ కూర్చి జనులకు చూపవోయ్ అన్న మహాకవి బోధని మనసులో పెట్టుకుందాం. ఏదన్నా పనికొచ్చే పని చేద్దాం.

ఆనంద బ్లాగాయనం!

15 thoughts on “బ్లాగోగులు

 1. చెప్పాలని ఉన్నదీ, ఊసులు చెప్పాలనీ ఉన్నాదీ అనుకుంటూ మంచి మంచి లంకెలు ఇచ్చారు, ఇస్తూ….ఊనే ఉన్నారు బానే ఉన్నది…అభినందనీయులే… అయినా కొద్దిగా అయినా బుఱ్ఱ ఉన్నవాళ్ళకు ఇవి అన్నీ ఎక్కుతాయి కానీ, లేని వాళ్ళకు ఎలా? ఇన్నిసార్లు ఇదే బ్లా”గోగుల” మీద చెప్పడం అనవసరం, ఆ పైన ఎలా మెలగాలో ఎంత మంది ఎన్ని సార్లు చెప్పినా, మెలిగే వాడికి లేని గుణమయిన “మెలకువ” – పాడిన పాట దాసరి వారి పరం అవ్వటం తప్ప ఉపయోగం లేదని పరమపిత చెప్పినట్టు గుర్తు…అదండీ లెఖ్ఖ.. ఇంతే సంగతులు చిత్తగించవలెను..

 2. రాజకీయాలు, మతం అనే అంశాలపై బ్లాగద్దు అని ఒక ప్రముఖ బహుళజాతి సంస్థ కి సంబంధించిన బ్లాగు మర్యాదల్లో వుంది. ఎంత నిజం. సంవత్సరం క్రితం తెలుగు బ్లాగులు సాహిత్యం, కవితలు, రసాస్వాదనలు, లలితకళలు అనేస్కుంటూ మూడు పువ్వులు ఆరు కాయలు గా వుంది. ఒక సారి సెన్సిటివిటీ ని దెబ్బ తీస్తే పడ్డవాడు వూర్కున్నా పక్కవాడు వూర్కోడు. అందరి చేతుల్లో విద్య వుంది కానీ కొందరి బుర్రల్లోనే మంచి వుంది.

 3. ఆధునిక కాలంలో మానవ జీవితాన్ని అత్యంత ప్రభావితం చేసే రాజకీయం,మతం (ఈ మధ్యకాలంలో ఈ రెంటికీ పెద్ద అవినాభావసంబంధం ఉంది) భావవ్యక్తీకరణ పరిధిలో లేకుంటే ఇక చర్చించడానికీ, సంస్కరించుకోవడానికీ మిగిలేదేమిటి?

  లలితకళలు కడుపునిండినోడికి, కడుపుమండినోడి మాటేమిటి? వారికి బ్లాగుల్లో స్థానం లేదా! లేక బ్లాగడానికి వాడు అర్హుడు కాదా!! ఏమిటీ అర్థం లేని పోకడ? కొత్తపాళీ గారన్నట్లు విభేధనా,విమర్శనా లేకుంటే మానవ జీవితం ఎదిగేనా? జుగుప్సాకరమైన రాతలూ,వ్యక్తిగత దాడూలూ,అశ్లీల చేష్టలూ లేనంతవరకూ అన్నివిషయాలమీదా బ్లాగాలి…లేకపోతే భావస్వేఛ్ఛకు అర్థమే లేదు.

 4. ఎవరూ ఎవరి స్వేచ్ఛని నియంత్రించకూడదు కాదు. కానీ, రాజకీయాలు మరియు మతం గురించి చర్చించేప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. రాజకీయాలు, మతం ఈరెండూ అందరికీ సంబంధించే అంశాలు. కనుక ప్రతీ ఒక్కరూ ఏదో ఒక అభిప్రాయం కలిగివుంటారు. చర్చలు పక్కకి దారితీసే అవకాశం ఎక్కువ. ఇదే విషయంపై పాల్ గ్రాహం ఒక చక్కని వ్యాసం రాసాడు చదవండి.

  మహేష్ ప్రశ్నలు కూడా ప్రతీ బ్లాగరీ తనకి తాను సమాధానం చెప్పుకోవాల్సినవి. తన బ్లాగులో ఏమేం రాయాలన్నది బ్లాగరు వ్యక్తిగత నిర్ణయం.

  మహేష్, కడుపు నిండినోళ్ళే రాజకీయాలు మరియు మతం గురించి ఎక్కువ పట్టించుకుంటారేమో. కడుపు మండినోడు, వాడి మంట తీర్చుకునే మార్గం చూసుకుంటాడు.

 5. రాజకీయం, మతం మాత్రమే కాదు, శృంగారం (sex) గురించి కూడా పది మంది కొత్తవారున్నచోట సంభాషించడం అభిలషణీయం కాదు. జాలమనే కాదు, ఎక్కడైనా సరే! తెలుగు బ్లాగరి ఎదుగుతున్నారు. కనుక ఇవి తప్పవు.

 6. @వీవెన్: కడుపుమండే కారణాలైన ఆకలిని,మనుగడని,బ్రతుకుతెరువునీ నిర్దేసిస్తున్న రాజకీయాలు ఎప్పటికీ చర్చనీయాంశాలే. ఇక మతం సంగతంటారా, బ్రతుకుతో పొసగని మతాన్ని కడుపుమండిన ప్రజలు ప్రశ్నిస్తే, కడుపునిండినోళ్ళు అది మడిగట్టుకునే ఉండాలని ప్రచారం చేస్తారు. ప్రశ్నించేవాళ్ళని తీవ్రవాదులూ,వితండవాదులుగా ముద్రవేసి పబ్బంగడుపుకుంటారు. ఇది అనునిత్యం జరిగే పరిణామం. కాకపోతే ఈ మధ్యకాలంలోని మార్పు తీవ్రతవల్ల కొంచెం ఈ స్పందనలు అతిగా అనిపిస్తాయి. అంతమాత్రానా వాటిని అంటరాని విషయాలుగా చూస్తే ప్రగతి ఆగిపోదూ!

 7. కడుపు నిండక కడుపుమండే వాళ్ళు బ్లాగులు రాస్తారా? బ్లాగులు రాసేవాళ్ళందరూ కడుపునిండినవాళ్ళే అనుకుంటున్నానే.
  కడుపునిండిన కడుపుమంటలది వేరే సంగతి :-)

 8. నేను గత ఏడాది జనవరి నెలలో నా తెలుగు బ్లాగ్ తెరిచాను. అప్పట్లో నా కంప్యూటర్లలో యూనికోడ్ ఫాంట్స్ స్పష్టంగా కనిపించేవి కావు. అప్పట్లో నా బ్లాగ్ లోకి jpg ఫైల్స్ అప్ లోడ్ చేసేవాడ్ని. ఆ మధ్య దుప్పల రవి ఒక సారి నా ఆఫీస్ కి వచ్చినప్పుడు యూనికోడ్ ఉపయోగించమని సలహా ఇచ్చాడు. కానీ విండోస్ పాత వర్షన్స్ లోని టెక్నికల్ ప్రోబ్లమ్స్ వల్ల యూనికోడ్ టైపింగ్ ప్రాక్టీస్ చెయ్యలేదు. ఈ మధ్య నా కంప్యూటర్లలో SUSE, ఉబుంటు & ఓపెన్ సోలారిస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇన్స్టాల్ చేశాను. వాటిని అప్ డేట్ చేస్తే యూనికోడ్ ఫాంట్స్ స్పష్టంగా చూడొచ్చు. విండోస్ అప్ డేట్ చేసినా యూనికోడ్ ఫాంట్స్ కనిపిస్తాయి. ఉబుంటు & ఓపెన్ సోలారిస్ లో అయితే విండోస్ కంటే స్పష్టంగా కనిపిస్తాయి.

 9. సున్నితమైన అంశాల గురించి సున్నితంగా చర్చించాలే తప్ప తమ విపరీత భావాలతో అవతలివారిని రెచ్చకొట్టకూడదు. దేశానికి, దేశ భక్తికి, హిందూ మతానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ కుల, మత భావనలను రుద్దే “బ్లాగు తీవ్రవాది” ఒక్కడున్నా చాలు బ్లాగుల్లో గొడవలు, కల్లోలాలు మొదలవుతాయి. అలాంటి “బ్లాగు తీవ్రవాది” ని తరిమి కొట్టినపుడే బ్లాగులోకం ప్రశాంతంగా ఉంటుంది

 10. ఏది “సున్నితమో”, ఏది “విపరీతమో” ఎవరు నిర్ణయిస్తారు? సాయిబాబా మూడోరోజు మళ్ళీ బ్రతికిన వైనం. పూజచేస్తుంటే అగ్నిలో శివుడు తాండవించిన పవిత్ర అనుభూతీ సున్నితమా! విపరీతమా? మతాన్ని మూఢనమ్మకాల స్థాయిలో ప్రచారం చేస్తే అది సున్నితం…మతం పేరుతో జరుగుతున్న దాష్టీకాలను గౌరవప్రదంగా ప్రశ్నిస్తే అది విపరీతం, తీవ్రవాదం!!!

  ఉంటే రెండురకాల విధానాలకూ ఒకటే విరుగుడుండాలి. లేదా ఎంత గౌరవప్రదంగా ప్రశ్నించచ్చో అంత space ఉండాలి. లేకపోతే ఇది బ్లాగు ప్రపంచం అనిపించుకోదు. ఛాంధసవాదుల గురుకులం అవుతుంది.

 11. >>రాజకీయాలు, మతం అనే అంశాలపై బ్లాగద్దు అని ఒక ప్రముఖ బహుళజాతి సంస్థ కి సంబంధించిన బ్లాగు మర్యాదల్లో వుంది

  బహుశా అవి అఫిషయల్ బ్లాగ్ రూల్స్ అవి ఉంటాయి. వాటిలో సాధారణంగా సాంకేతిక విషయాలకే పరిమితమవ్వటం మర్యాద. వ్యక్తిగత బ్లాగుల్లో అటువంటి నియమాలు ఏవీ లేవు. ఓపికున్నంత వరకు బ్లాగుకోవచ్చు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.