డ్రీమ్‌హోస్ట్ ఉచిత హోస్టింగ్

డ్రీమ్‌హోస్ట్ ఇప్పుడు ఉచిత ఉపకరణ హోస్టింగుని అందిస్తుంది. దీనిలో మీరు వర్డ్‌ప్రెస్, దృపాల్, మీడియావికీ, జెన్ ఫొటో, పీహెచ్‌పీ బీబీ, గూగుల్ ఆప్స్ వంటి ఉపకరణాలని ఎంచుకొని వాడుకోవచ్చు.

ముందుగా 10వేల మందికి ప్రైవేటు బీటాగా ఆహ్వానిస్తున్నారు. నేనిది రాస్తున్నప్పటికి ఇంకా 9,040 ఆహ్వానాలు మిగిలిఉన్నాయి. త్వరపడండి.

తా.క.: మీరు డ్రీమ్‌హోస్ట్‌లో హోస్టింగ్ తీసుకోవాలనుకుంటే, KOODALI అన్న ప్రమోకోడ్ వాడితే గరిష్టంగా $97 వరకు (మీరు ఎన్ని సంవత్సరాలకి చెల్లిస్తున్నారు అన్నదాన్ని బట్టి) తగ్గింపు పొందవచ్చు.

7 thoughts on “డ్రీమ్‌హోస్ట్ ఉచిత హోస్టింగ్

  1. @Bhaskar,
    వీళ్ళు డెబియన్ లినక్సు వ్యవస్థని వాడుతున్నారు. PHP, Perl, Ruby, Python వంటి భాషలు వాడుకోవచ్చు. డేటాబేసుకి MySQL కానీ sqlite కానీ వాడుకోవచ్చు. పూర్తి వివరాలు చూడండి.

    అయితే, ఈ ఉచిత హోస్టింగులో మాత్రం కేవలం పైన టపాలో చెప్పిన ఆరేడు ఉపకరణాలని మాత్రమే వాడుకోగలం.

  2. నేను నా బ్లాగులన్నీ నా సొంత లైనక్స్ సర్వర్ (ఫెడోరా) లో హోస్ట్ చేస్తున్నాను. ఉచిత హోస్టింగ్ వాళ్ళు ఎక్కువ బ్యాండ్ విడ్త్ అందించరు. చిన్నప్పుడు నేను జియోసిటీస్ ని నమ్ముకున్నప్పుడు కూడా అలాగే జరిగింది. మీ కూడలి ఈ మధ్య మరీ స్లో అయినట్టు ఉంది. నా బ్లాగులు జల్లెడలో వెంటనే ఇండెక్స్ అయ్యాయి కానీ కూడలిలో ఇండెక్స్ అవ్వడం లేదు.

  3. @PKMCT,

    వీడు ఉచిత సర్వీసులో ఎంత ఇస్తున్నాడో తెలియదు. కానీ ఇది వీడి చెల్లింపు హోస్టింగుని అమ్ముకోడానికి ఒక మార్గం.

    ఇక, కొత్త టపాలు కూడలిలో రావడానికి 75 నిమిషాల వరకూ పట్టవచ్చు. కూడలి ఉపకరణం దాని గరిష్ఠ సామర్థ్యానికి దగ్గరవుతోంది. మెరుగుపరచాల్సిన అంశాలు చాలా ఉన్నాయి.

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.