అభిప్రాయ సేకరణ: మీ రోజువారీ సమాచార వినియోగంలో తెలుగు ఎంత?

రోజూ మనం ఎంతో సమాచారాన్ని (క్రియాశీలంగానైనా లేదా యధాలాపంగానైనా) చదివి వినియోగిస్తుంటాం: వార్తలు, బ్లాగులు, ఈమెయిళ్లు, కబుర్లు (IM), సూక్ష్మ బ్లాగులూ, బజ్, వాల్, స్క్రాపులు, గట్రా. మీకు సంబంధించి వీటిలో సగటున రోజుకి తెలుగు ఎంత శాతం ఉండవచ్చు? మీ మౌఖిక సంభాషణలనీ, టీవీలో చూసిన మరియు రేడియో, జాలంలో విన్న తెలుగుని వదిలేస్తే, మీరు రోజు వారీ చదివే దానిలో తెలుగు సమాచారం/విషయం యొక్క శాతం ఎంత?

ఉదాహరణకి, మీరు ఒక రోజు అన్ని పనులూ ఇతరత్రా కాలక్షేపాల నుండి విరామం తీసుకుని, కేవలం ఒక్క నవ(ల)లే చదివారనుకుందాం. ఆ నవల(లు) తెలుగు అయితే, ఆ రోజు మీ తెలుగు సమాచార వినియోగం నూరు శాతం. ఆదే నవల ఆంగ్లమయితే, తెలుగు సున్నా. అలాంటి అనుభవాలు మీకు అరుదు అయితే, వాటిని వదిలివేసి సగటున మామూలు రోజుల్లో తెలుగు వినియోగం ఎంత అన్నది ఆలోచించండి.

మీరు చేసేవన్నీ పద్దురాసి, సంకలనించి, శాతం కట్టేంత ఖచ్చితంగా అక్కరలేదు కానీ, స్థూలంగా మీ అంచనా ఏమిటి?

 

అంకెల్లో తేల్చలేకపోతే, ఇక్కడ వ్యాఖ్యగా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మీ సమాచారం వినియోగంలో తెలుగు శాతం పెరగాలనుకుంటున్నారా? లేదా, మీ తెలుగు వినియోగ ధోరణితో (నెమ్మదిగా అయినా పెరుగుతుందనే అనుకుంటున్నాను) మీరు సంతృప్తిగా ఉన్నారా?

ఇంకా మీరు తెలుగులో ఏయే సమాచారం/విషయాల్ని (ప్రత్యేకించి జాలంలో) చూడాలనుకుంటున్నారు? మరో రకంగా, మీకు తెలుగులో దొరకని సమాచారం ఏముంది? ఈ ప్రశ్నలడగడానికి కారణమేమంటే, మన సమాధానాలు లేదా అవసరాలు సమాచార సృష్టికర్తలకీ (బ్లాగర్లని కలిపే) మరియు జాల గూళ్ళ నిర్వాహకులకీ తమ తమ ప్రాధాన్యతలలో ఉపకరిస్తాయి. (చాలామంది తెలుగులో పర్యాటక సమాచారం చూడాలనుకుంటున్నాం అన్నారనుకోండి, ఆ దిశగా బ్లాగులూ లేదా సైట్లూ వస్తాయని ఆకాంక్ష.)

దీన్ని నా బ్లాగుకే పరిమితం చేయనవసరంలేదు; ఈ విషయంపై మీ ఆకాంక్షలనీ, అభిప్రాయాలని టపాగా మీ బ్లాగులో కూడా వ్రాయండి.

ఆనంద తెలుగీకరణం!

36 thoughts on “అభిప్రాయ సేకరణ: మీ రోజువారీ సమాచార వినియోగంలో తెలుగు ఎంత?

  1. .. నేను “ఆ అంకోపరి ఇలా అందుకుని విహరిణి తెరు” అనగానే .. తెలుగు బ్లాగులు చదవడం మొదలెట్టినప్పటి నించీ బ్రౌజరు తెరిస్తే చాలు తెలుగే చదువుతున్నాం, అసలు ఇంగ్లీషు మర్చిపోతున్నాం అని మొన్న మా ఆవిడ గోల పెట్టింది, :)

  2. సృష్టికర్తకి క్లుప్తరూపం స్రష్ట.

    ఇక్కడ నా అణా వంతు. నారాయణస్వామిగారు సరదాగా అన్నారు గానీ కొంతమంది గంభీరంగా తీసుకునేవాళ్ళు కూడా ఉంటారు. తెలుగు చదివితే ఇంగ్లీషు మర్చిపోవడం గానీ, లేదా ఇంగ్లీషు చదివితే తెలుగు మర్చిపోవడం గానీ జఱుగుతుందనుకోను. అది కేవలం కాన్వెంట్ ఫిలాసఫీ. వాస్తవానికి మాతృభాష, పరాయిభాష (acquired language) ఈ రెండూ మనిషి మస్తిష్కంలో రెండు వేఱువేఱు నాడీకేంద్రాల్లో నమోదవుతాయని పదేళ్ళ క్రితం శాస్త్రశోధకులు కనుగొన్నారు. చిత్రమేంటంటే మాతృభాష నిలవయ్యే చోట ఇంకే భాషకీ మెదడు స్థానం ఇవ్వదట. అందుచేత పరాయిభాషల గతి అప్రమేయం (Default) గా రెండో నాడీకేంద్రంలో నమోదవ్వడమే. వాటికి గత్యంతరం లేదు.

  3. మర్చిపోవటం అంటే .. పూర్తిగా మర్చిపోవటం కాకపోవచ్చు. కొన్ని రకాల వాక్య ప్రయోగాలు చెయ్యలేకపోవటం, కొత్త ప్రయోగాలపై అవగాహన లేకపోవటం (ఆంగ్లానికి ఇది మరీ ఎక్కువగా వర్తిస్తుంది) అరుదుగా వాడే పదాల కోసం కొంత ఎక్కువగా తడుముకోటం .. ఇలాంటివయ్యుండొచ్చు.

  4. ఇప్పటివరకూ ఈ అభిప్రాయ సేకరణలో పాల్గొన్న వారందరికీ నెనర్లు.

    ఎనభై శాతం పైన తెలుగు వినియోగించేవారు పది శాతం పైన ఉంటారని నేను ఊహించలేదు. బహుశా వారు ఉద్యోగరీత్యా కూడా ప్రధానంగా తెలుగే ఉపయోగించేవారయి లేదా ఉద్యోగరీత్యా ఉపయోగించే సమాచారాన్ని ఈ లెక్కలోనికి తీసుకోనివారయి లేదా ఇంటిపట్టున ఉండే గృహిణులు గట్రా అయివుంటారని అనుకుంటున్నాను.

    కానీ పాల్గోన్న వారు కేవలం 73 మందే. :( మిగతావారందరూ, ఓ సారి ఇటు చూడవలసిందిగా మనవి.

  5. ఎనభై శాతానికి పైగా తెలుగు ఉపయోగించేవారిలో నేను కూడా ఉన్నాను. మా ఇంట్లో అందరం వీలైనంత వరకూ తెలుగే మాట్లాడతాం. మా పాపకూడా తెలుగు మాట్లాడి తీరవలసిందే!ఇంగ్లీష్ స్కూల్లో, మరియు స్నేహితుల వద్ద మాత్రమే! ఇతర భాషల స్నేహితులెవరైనా ఇంటికి వచ్చినపుడు వారి సౌలభ్యం,సౌకర్యం కోసం మాలో మేము కూడా ఇంగ్లీషులో మాట్లాడుకుంటాం.

    ముఖ్యంగా మా పాప మాట్లాడే తెలుగు చూసి చాలా గర్వంగా ఉంటుంది. అతి చక్కని పదాలు “అభిప్రాయం” “సమాధానం” “వెలుతురు” “స్నేహితులు” “ఆటవస్తువులు(toys అని పొరపాటున కూడా అనగా వినలేదు),వంటివి వాడుతుంది.

    మరో పక్క అద్దిరిపోయే ఆంగ్లంలో దంచేస్తుంది కూడా!ఆంగ్లంలో పుస్తకాలు సొంతగా చదివేస్తుంది.

  6. నేను ఎక్కువగా బీదతనం, ఆర్ధిక అభివ్రుద్ధి, సైన్సు విషయాలు చదువుతున్నాను. ఇందులో ఎక్కువ కొంచెము శాస్త్రప్రకారం రాసిన వ్యాసాలు ఆంగ్లంలోలోనే ఎక్కువగా దొరుకుతున్నయ్యి. ప్రస్తుతానికి అలాగే సాగుంతుందనుకొంటున్నాను. కొంచెం అలవాటు తప్పిపోయి అలాంటి విషయాలు తెలుగులో చదవటం కష్టం, రెండోది తెలుగులో చాలామంది అభిప్రయాలు చెప్పుతారు కాని వాటికి సోర్సులు సరిగ్గా చెప్పరు. నేను చదివే రకం వ్యాసలు చెప్పుతాను, ఇలాంటివి తెలుగులో దొరుకుతవేమో చెప్పండి:
    History, Institutions and Economic Performance: The Legacy of Colonial Land Tenure Systems in India
    A. Banerjee and L. Iyer
    October 2004
    from http://econ-www.mit.edu/faculty/banerjee/papers
    More such in my blog.

    నేననుకోటం ఆంగ్లం ఎక్కువగా వాడినా, చిన్నప్పుడు తెలుగు మీడియంలో చదివిన నాబోటి వాళ్ళకు, కొంత తెలుగు ఎప్పుడూ మిగిలేవుంటుంది. నేను ఇప్పటికీ తెలుగులోనే లెక్క పెడుతాను, కోపమొస్తే తెలుగే ముందు వస్తుంది. తెలుగు పోతందనే భయం లేదు కాని, అవసరాలకు వాడే భాషకూ పుస్తకల్లో రాసే భాషకు దూరం ఉన్నట్లుంది. ఇది తగ్గాలంటే చిన్నప్పుడు పిల్లలకు పనికొచ్చే పుస్తకాలూ, విడియో అటలూ, విడియో పాటలూ, హుషారుగా ఉండే సైన్సు విషయాలూ తెలుగులో చౌకగా అందచేస్తే కొంతవరకు ఉపయోగపడవచ్చు. కాని తరువాత ఉద్యోగాలకు పనివచ్చే విషయాలు ముఖ్యం. మధ్య తరగతులనుంచీ రెండు భాషలన్నా నేర్చుకుంటే మంచిదేమో, దానిమూలాన బుర్రకు కూడా అభివ్రుద్ధి వస్తుంది అంటారు, తరువాత కష్టం.

  7. సుజాత గారు, మీ పాప భాషా విజయాల విషయంలో అభినందనలు.
    నేనూ ఇక్కడ కొందరు పిల్లల్ని చూశాను. సరే పెరిగింది అమెరికను సమాజంలో కాబట్టి అంగ్లం చర్చనీయాంశం కాదు. కానీ తల్లిదండ్రులు తీసుకున్న శ్రద్ధని బట్టి తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు.

    తాడేపల్లి గారు, మీరు చెప్పిన నాడీ కేంద్రాల విషయం బావుంది.

    వీవెన్ .. ఒక సూచన – ఒక నెల్రోజుల పాటు ఈ సర్వేని ఉద్యమంగా పెట్టుకుని, మెయిల్లో, ఇతరత్రా ఊదరగొట్టి మరికొంతమంది పాల్గొనేట్టు చెయ్యాలి.
    Try to enroll very popular bloggers like jyothi, malakpeta rowdy, et al.
    Also contact admins of other aggregators like jalleda, haaram, etc. to keep a link there.

  8. ee letter wrayadaniki nenu siggu padutunnanu

    telugu bhasha gurinchi english loo wryaalsi vastondi
    ee taram pilalaku telugu matlada galare gani wrayadam baga taggipoindi
    english medium chaduvule chadvulu anna durabhipryam
    telugu valla medallalo baga patuka poindi
    city lo ite telugu matladevallanu pichivalanu choosi
    nattu choostaru enduko artham kadu

    namatuku nenu rooju telugu papaer chaduvtanu
    andari to teluge matladutanu.
    edivarakyte dabbuvnna vallu matrame convent chaduvulu
    chdivinchevaru.kaani ippudu madhya aragathi,diguva madhya taragati varu sytam appu lu chesaina sare
    english medium lo ne chadivistunnaru.
    ante udaraposhanaardham ee english chadvulu tappadam
    ledu.
    ika andaru bhaya paduthunnattuga telugu anta twraga
    antarinchi poodu.
    manaku santosham vachina ,dhukam vachina mana bhavalu
    manabhashalone vyktam chestamu. paryi bhashalo
    velladinchalemu.
    daaniki todu ee separate state udyamam oketi
    telugunu samadhi cheyadanike upayogapadutunde tappa
    marenduku panikiraadu

  9. నేను తెలుగు బ్లాగులు, మాగజైన్లు, పుస్తకాలు చదువుతాను కాబట్టి రోజులో యాభై ఉంటుందేమో తెలుగు వాడకం! నాకిష్టమైన క్రికెట్, టెన్నిస్, నాక్కావాల్సిన సాంకేతిక సమాచారం తెలుగులో దొరకటం కష్టం. సరదాకి కూడా ఎవరూ ఆటల గురించి తెలుగులో అంతగా రాస్తున్నట్టు నాకనిపించలేదు, గత మూడేళ్ళుగా చూస్తున్నా బ్లాగులను. సాంకేతిక సమాచారం కొద్దో గొప్పో బానే ఉంది.. వీలున్నప్పుడల్లా చదువుతాను. నా పనికి కావాల్సింది మాత్రం ఇంగ్లీషులోనే ఉంటుంది.

    పుస్తకాలను ఎక్కువ ఇష్టపడినా, తెలుగు వచ్చేసరికి కాలక్షేపం కోసం చదివేవే ఎక్కువ. చరిత్ర, సైకాలజీ లాంటి ప్రత్యేకమైన సబ్జెక్ట్స్ చదవాలంటే ఇంగ్లీషు ఉండాల్సిందే! (దీనిపై నా మీద యుద్ధానికి దిగకుండా, మీకు తెల్సిన పుస్తకాలు, వాటి వివరాలు చెప్తే నాక్కావల్సినవా? కావా? అని చూసుకుంటాను.)

    ఇప్పటికింతే..

  10. నేను పూర్తిగా కోస్తా ప్రాంతం కాబట్టి ఉద్యోగం కూడా ఇక్కడే కాబట్టి అంతా తెలుగు వాడకమే ఎక్కువ. మా కార్యాలయానికి వచ్చే వ్యక్తులతో అంతా తెలుగే మాట్లాడతాము. కాకపోతే చేసే పని మాత్రం కంపూటర్ మీద కావున అదొక్కటి ఆంగ్లం తప్పదు. పని అంతా అంతర్జాలంలోనే సాగుతుంది. వైద్యులతో మట్లాడేటప్పుడు మాత్రం కొంత ఆంగ్లం అవసరమవుతుంది. వాళ్ళు కూడా మట్లాడుతూ మట్లాడుతూ ఒకేసారి తెలుగులోకి వచ్చేస్తారు. ఎంతైన ఇక్కడివాళ్ళే కదా. తెలుగు వ్రాత పని ఎక్కువ ఉండదు.

  11. ఉద్యోగాన్ని కలుపుకుంటే నా తెలుగు వినియోగం కనీసం 50 శాతం ఉంటుంది. ఉద్యోగం తీసేస్తే, 75 శాతం వరకూ. అయితే వ్యక్తిగతంగా నా సమస్య ఇది కాదు. రేప్పొద్దున మా పాపాయి చదువు మొదలెడితే, ఏ మీడియంలో చేర్చాలనేది పెద్ద సమస్య. తెలుగు మీడియంలో మంచి పాఠశాలల్లేవు. ఒకవేళ ఉన్నా కూడా అందులో చేర్చడానికి ఇంట్లో ఎవరూ వప్పుకోవట్లేదు. ప్రాథమికభాషా మాధ్యమంగా తెలుగు దొరక్కపోవడం చాలా అసహాయస్థితి. ఏమీ పాలుపోవట్లేదు!

    1. @రవి గారు

      నాది మీలాంటి సమస్యే మా పాప విషయంలో అందుకే నాదొక చిరు సలహా మీ అమ్మాయిని అందరిలాగే ఆంగ్ల మాధ్యమలో చేర్పించండి. కాని ఇంటి దగ్గర తప్పనిసరిగా తెలుగులో మాట్లాడటం, వ్రాయడం వంటివి చేయించండి. మా పిన్నిగారు వాళ్ళ అమ్మాయిని ఆంగ్ల మాధ్యమ బడిలోనే చేర్పించారు. చిన్నప్పటి నుండి ఇంటి దగ్గర తెలుగు నేర్పించారు. అందుకని ఆ అమ్మాయి రెండు భాషలలోను వ్రాయగలదు, చదవగలదు, మాట్లాడగలదు. అవసరమనుకొంటే మీరు పెద్ద బాలశిక్ష పుస్తకం కొనండి. అందరికి ఉపయోగం.

      1. వాసుకి గారు, జవాబుకు ధన్యవాదాలు. అయితే ఇంట్లో వాళ్ళ వ్యవహారం చూస్తుంటే, ఇది కష్టంగా కనిపిస్తూంది. పొద్దస్తమానం మార్కులరంధిలో పడి తోముతుంటారు. (మా మరదలి చదువును చూస్తూనే ఉన్నాను) ఓ పనికిమాలిన స్కూల్లో ఇచ్చే మార్కులే సర్వస్వంగా భావిస్తున్నారు. అలాంటప్పుడు పిల్లలను స్కూలుపుస్తకాలు కాకుండా, ఇతర విషయాలు నేర్పించడం కుదరదేమోనన్న అనుమానం పీడిస్తూంది. ఏదో ఒకటి ఆలోచించాలి.

        వీవెన్ గారికి, మీ సైట్ ను నా వ్యక్తిగత విషయాలకు వాడుకుంటున్నందుకు మన్నించాలి. ఇబ్బందయితే, వ్యాఖ్య నిరభ్యంతరంగా తొలగించండి.

  12. ఇంట్లో పిల్లలని తెలుగులో మాట్లాడేందుకై ప్రోత్సహిస్తుంటాము. చిన్నమ్మాయి చక్కని తెలుగు మాట్లాడుతుంది. ఇంటికి వచ్చిన అవారు కూడా తన తెలుగుని చూసి కాస్త అబ్బురపడుతుంటారు. అయితే తెలుగు చదివించే విషయంలో మాత్రం మాకు ఆసక్తి లేదు. ఇప్పటికే ఇంగ్లిషూ, ఫ్రెంచ్, స్పానిష్ స్కూలులో చదావాల్సొస్తోంది కాబట్టి మరో భాషను వారిమీద బలవంతంగా రుద్దదలుచుకోలేదు. మాకు తెలుగు మీద ప్రేమ వుంది కానీ మరీ అంతగా కాదు. మా తెలుగు ప్రేమని మా పిల్లల మీద రుద్దదలుచుకోలేదు – మాట్లాడటం విషయంలోనయినా ప్రోత్సాహం మాత్రమే – బలవంతం చేయము. అమెరికన్ సమాజంలో పెరుగుతున్నారు కాబట్టి వారి దృష్టి కోణం లోనుండి కూడా మేము ఆలోచించాలి. మన ఆసక్తులు వారి పట్ల చాదస్తంగా తయారవకూడదు.

  13. నేను తెలుగులో మాట్లాడే దాంట్లోనే తెలుగు శాతం ఎక్కువగా ఉండట్లేదు.
    అంతర్జాలంలో, ముఖ్యంగా బ్లాగుల కారణంగా, గత కొన్నేళ్ళుగా తెలుగు బాగా కనిపిస్తోంది.
    వికీ మీద జరుగుతున్న కృషి తెలుసు గాని, నేను వాడేది తక్కువ.
    తెలుగుకి సంబంధించినంత వరకూ, శోధన నేరుగా తెలుగులో చెయ్యడం వల్ల వచ్చే ఫలితాలు, ఆంగ్లంలో శోధించిన దానికంటే ఎంతో ఉపయోగపడుతున్నాయి.
    తెలుగులో టైపు చెయ్యడానికి లేఖిని మాత్రమే వాడుతున్నాను.
    http://swarnmukhi.blogspot.com/2010/02/blog-post_28.html లాంటివి చదివితే ఇలాంటి బ్లాగుల కోసం వెతకాలనిపిస్తోంది. శాస్త్ర విజ్ఞానం వారిది ఉన్నా, నేను పెద్దగా పట్టించుకోలేదు. ఇంకా తెలీనివి, పట్టించుకోనివీ ఎన్ని ఉన్నాయో మరి.
    పిల్లల కోసంగా ఉద్దేశించినవి ఇంకా పెరగాలని నా కోరిక.
    ఈ విషయంగా శోధించి కొత్తగా నాకు పరిచయమైన వాటిని పరిశిలించి పోగు చేసుకోవలసి ఉంది.

    అన్నట్లు, తెలుగు నేర్పించడం మన ఆసక్తిని పిల్లల పై రుద్దడం అంటే ఆలోచించాలనిపిస్తుంది.
    నేనేమీ మా పిల్లలను తెలుగు పండితులను చేయలేదు. తెలుగును వారికి పరిచయం చేసి, వాళ్ళ మరియు నా ఓపికనీ, అవకాశాలనీ బట్టి నేర్పిస్తున్నాను. కుతూహలం పెంచుతున్నాను, ప్రోత్సహిస్తున్నాను.
    కానీ నా అభిప్రాయం:-)
    వేరే దేశంలో / రాష్ట్రంలో స్థిరపడం, లేదా స్థిరపడవలసి రావడం అన్నది తల్లి దండ్రుల నిర్ణయం లేదా అవసరం. మరి ఆ విషయంలో పిల్లలకి ఎంపికే లేదు కదా. ఇక వాళ్ళ మూలాలు వాళ్ళకి పరిచయం చెయ్యడం మన బాధ్యత. ఒక్క తరంలో వారు వీరైపోరు కదా. వారి identity లో భాగం వారి తల్లిదండ్రుల జాతీయత, భాష, సంస్కృతి, సంబంధాలు… ఇవన్నీ కూడా కదా. మనం తినే ఆహారం లాగే మనం మాట్లాడుకునే భాష కూడా. అమెరికా అధ్యక్షుడే తన మూలాలను వదులుకోలేదు కదా మరి?

    కుతూహలం కొద్దీ అడుగుతున్నాను, Spanish, French ఇవి ఏ level లో నేర్పిస్తారు? ఇంతవరకూ మా పిల్లలు కొద్దిగా మాటలు నేర్చుకున్నారంతే. రాయడం, చదవడం బడిలో చేసినా, అంత పెద్ద ప్రాముఖ్యత లేదు. మన త్రిభాషా పద్ధతిలో నేను నేర్చుకున్నదానికీ, ఇక్కడ ఇప్పటివరకూ నేను చూసిన దానికీ పోలిక లేదు.

    1. నేను మన సంస్కృతిని కానీ, భాషని కానీ మా పిల్లల మీద బలవంతంగా రుద్దే ప్రశ్నే లేదు. నేను అన్ని రకాల ఛాయిస్ ఇస్తాను, ప్రతి దాంట్లో వున్న గొప్పదనాన్ని, లోపాలని విశదీకరిస్తాను. నిర్ణయం మాత్రం వాళ్ళదే. మన సంస్కృతి అంటే నాకు ఇష్టమే అలాగే ఇతర సంస్కృతులన్నా, భాషలన్నా నాకు గౌరవం వుంది. నా పిల్లలు కూడా నా సంస్కృతే పాటించాలనేంత మంకుపట్టులేదు. మీరన్నట్లు మా పిల్లల ఎంపిక లేకుండానే ఇక్కడికి వచ్చాము కానీ ఇప్పుడు ఇక్కడ వుండటం మాత్రం పూర్తిగా వారి యొక్క ఇష్టం మేరకే. నాకయితే భారత్ లోనే వుండాలని వుంటుంది. మూడేళ్ళ క్రితం భారత్ లో వుండాల్ని, పిల్లలకు భారత్ అలవాటు చేయించాలని చేసిన ప్రయత్నాలు వికటించాయి. కొంతకాలం వుండి (ముఖ్యంగా) పిల్లల ప్రయోజనాల దృష్ట్యానే మళ్ళీ ఇక్కడికి రావాల్సివచ్చింది. ఆ వికటించిన ప్రయోగాలు అన్నీ త్వరలో టపాలుగా వ్రాస్తాను. ఇక్కడ ఇంతకంటే వివరంగా చెప్పడం బావుండదు.

      కెనడాలో వున్నప్పుడు మా పెద్దమ్మాయి మూడవతరగతి నుండి అనుకుంటా ఫ్రెంచ్ నేర్చుకుంది. మా చిన్నమ్మాయికి రెండవ తరగతి నుండే స్పానిష్ నేర్పిస్తున్నారు.

      1. మీ perspective అర్థమయ్యింది.
        మీరు రాసే వివరాలు ఆలోచింప చేస్తాయనుకుంటున్నాను.
        ఇక్కడ Spanish curriculum మన వద్ద హిందీ curriculum తో పోలిస్తే చాలా తక్కువ కాదూ?
        కెనడాలో French సంగతి నాకు తెలియదు మరి.
        నేను మీ మాటల్ని బట్టి మీరు మీ పిల్లలకన్నీతెలియ చేస్తున్నారనే అనుకున్నాను.
        నేను చెప్పదల్చుకున్నదేమటే, మన భాష, సంస్కృతీ వంటి వాటి మీద ఒక లెవెల్ వరకూ అవగాహన కల్పించడం మనం చెయ్యక తప్పదు అని.
        ఆ పరిస్థితి రుద్దటం అవ్వదు అని.
        ఇంకా చాలా ఆలోచనలు సాగుతున్నా, చెప్పడానికి సమయమూ, వేదికా సరైనది వెతుక్కుని చెప్పే ప్రయత్నం చేస్తాను.

  14. వీవెన్ గారు:
    నేను సాధ్యమైనంత వరకు మాట్లాడేప్పుడు తెలుగు పదాలే ఉండేలా జాగ్రత్త పడతాను.
    నేను చదివింది తెలుగు మాధ్యమంలో అయినా, పరిస్థితుల ప్రభావం వలన, మధ్యలో ఆంగ్ల పదాలు వస్తు ఉంటాయి. ఇక్కడ నాకు ఒక సందేహం:
    రైలు, బస్సు, ఫ్యాన్ మొదలైన వాటికి బదులు తెలుగు పదాలు వాడొచ్చు కాని, రైలుకి బదులు ధూమశకటం అని అంటే జనాలు నావంక వింతగా చూస్తున్నారు. ఇక్కడ చెన్నైలో “Electric Train” అని announce చెయ్యడానికి “మిన్సార తోడార్ వండి” అని announce చేస్తారు. సో, నాకు ఏది సరైనదో తెలియడంలేదు.
    In Summary, my question or dilemma is:
    One I way I feel okay to use frequent English Words while talking/writing.
    OOTH, When I look at these Tamil People I feel that some what we lost in touch with our language. I worked with many Japanese guys and their e-mail also will be in Japanese and we need to use translator. Similarly, I observed the same with European countries.

    Second Difficulty I have in writing in Telugu is I don’t have good typing skills, rather Fingering. I need to search for letters while typing. I have a strong urge to write in my Telugu blog, but for me, composing a post because of this typing will take more than half a day. So, I left it in middle. Apart from learning typing, I thought of writing a on plain paper, scan it and upload it. I think it to be a feasible option. Also, I have heard about Stylus, if we write using stylus, how we can upload it to computer? Of course, If Pranav Mistry”s sixth sense comes reality, I can write on a scribble pad and it will be automatically uploaded to PC :P

    P.S. ఆంగ్లంలో వ్రాసినందుకు మన్నించాలి. నా టైపింగ్ ఇష్యూ వలన, ఇంకా కొంచం సేపట్లో Conf.call ఉన్నందువలన, సమయాభావం వలన తొందరగా వ్యాఖ్య వ్రాయాలని ఆంగ్లంలో వ్రాసాను.

  15. ప్రపంచంలో అంతరించుపోతున్న భాషలలో తెలుగు ఒకటి. దీని వాడుక క్రమేణా తగ్గిపోతోందని, ఇది ముందు ముందు మృతభాష అయిపోతుందని యునెస్కో అంటోంది. అందుచేత తప్పనిసరిగా తెలుగుని రక్షించుకోవల్సిన బాధ్యత మనందరిది. కేవలం మనమొక్కరమే తెలుగు మాట్లాడితే సరిపోదు, మన తర్వాత తరాల వారు కూడా తెలుగులో మాట్లాడాలి, వ్రాయగలగాలి అప్పుడే భాషకు జీవం ఉంటుంది. పిల్లల మీద బలవంతంగా రుద్దం అంటున్నారు. రుద్దనవసరం లేదు కాని దాని ఆవశ్యకత పిల్లలకు చెప్పాలి. వారి మూలాలు ఏమిటో పిల్లలకు తెలియాలి. పరాయి దేశంలో ఉన్న, పరాయి రాష్ట్రంలో ఉన్న,బయట వ్యవహారికం ఏదైనా ఇంట్లో మాత్రం తల్లితండ్రులు తెలుగు మాట్లాడితే తప్పక పిల్లలు కూడా అదే మాట్లాడతారు. పిల్లలకు రెండు, మూడు భాషలు ఏకకాలంలో నేర్చుకోగల గ్రహణ శక్తి ఉంటుందని పరిశోధనల ద్వారా తెలుస్తోంది. అందుచేత మాతృభాష నేర్పే విషయంలో కొంత శ్రద్ద తీసుకొంటే వాళ్ళు భవిష్యత్ భాషా రక్షకులు అవుతారు. మనం బ్లాగ్ లలో ఎంత తెలుగు వ్రాసిన ఇది చదివే వారు ఎంతమంది. చైనా, జపాన్, ఫ్రాన్స్ వంటి దేశాలన్ని మాతృభాషలోనే సాంకేతిక పరిజ్ఞానాన్ని తయారుచేసుకొంటున్నాయి కదా. అందుకే మనం తెలుగులో మాట్లాడదాం, వ్రాద్దాము ముందు తరాల వారికి తెలుగు సంసృతిని అందిద్దాము.

    వీవెన్ గారు నేను వ్రాసినది అభ్యంతరకరమనుకొంటే ప్రచురించవద్దు.

  16. మిగిలినవారి సంగతి ఏమో గానీ, నాకు మాత్రం, ఈ అంతర్జాలంలో ప్రవేశించినప్పటినుండీ, తెలుగే లోకం అయిపోయింది. వీలున్నంతవరకూ, నేను మెయిల్స్ తెలుగులోనే పంపుతాను.కానీ సమాధానం ఇంగ్లీషులో వచ్చినప్పుడు చాలా కోపంవస్తుంది.అవకాశం ఉండీ కూడా, జవాబు ఇంగ్లీషులో వ్రాస్తున్నారంటే నా ఉద్దేశ్యం–బధ్ధకం, తిన్న తిండి అరక్కపోవడం!!నా దురదృష్టం ఏమిటంటే,ఎంత ప్రయత్నించినా వారిని మార్చలేకపోయాను.అందులో కొంతమంది ప్రఖ్యాత రచయితలు కూడా ఉన్నారు.పైగా నేను ఈ విషయం ప్రస్తావిస్తే, వారికి కోపంకూడా వచ్చింది.మాతృభాషని ఏదో ఉధ్ధరిస్తున్నామూ అంటూ, తెలుగులో వ్రాయడానికి, అంత సిగ్గుపడిపోతారెందుకో అర్ధం అవదు.

  17. I have a doubt. Veeven’s questions are mainly addressed to the ‘elites’ who use both English and Telugu in different proportions livng in many countries. We also have a majority who know and speak only Telugu. I would think that though it may not be reflected in text communities, the living Telugu is mainly with the community that mostly speaks it. These questions may not really cater to their needs or have a bearing the type of Telugu that will emerge.
    On the other hand, I think that the blogs, unlike the older text communities, form perhaps a better bridge with the Telugu of the people who speak only Telugu.
    I am not sure whether I making any sense, but I am getting vague doubts of that type.

  18. దేవుడా ! పరిస్థితి ఎలా వచ్చిందంటే మనం ఇప్పుడు తెలుగుని బతికించాలంటే మన పాఠశాలల్నీ, కళాశాలల్నీ విశ్వవిద్యాలయాల్నీ అర్జెంటుగా మూసెయ్యాలేమో ! ఇవి తెలుగుభాష పాలిట పాకిస్తానీ టెఱ్ఱరిస్టు ట్రెయినింగ్ కేంద్రాల్లా పరిణమించాయి. మన డిగ్రీలు తెలుగుభాష పాలిట RDX బాంబులు. చదువురానివారి మూలంగానే తెలుగు బతుకుతున్నది.

  19. @ తాడేపల్లి గారు: ముందు టీవీ ఆ ముసేయ్యాల్సిన వరుసలో ముందు ఉన్నవి టీవీ ఛానళ్ళు ఇంకా చెప్పాలంటే తెలుగు అని చెప్పుకునే చానళ్ళు. ఇంటికి రాగానే తెలుగు పొరపాటున చూడాలనుకునే(/వినాలనుకునే) పిల్లలు ఒక గంట ఏదో ఒక తెలుగు కార్యక్రమం చూస్తె చాలు వాళ్ళ బాష బ్రష్టు పట్టుపోడానికి. దూరదర్శన్ ఒక్కటీ ఉన్నప్పుడే బావుండేది తెలుగు ని స్పష్టంగా పలికేవారు.

  20. మంచి ప్రయత్నమేనండీ. కనీసం 70 శాతమయినా మాటాడగలిగితే చాలు అనుకుంటున్నాను. నేను మాటాడినా, నాతో మాటాడేవారు ఇంగ్లీషులోనే సమాధానాలు ఇస్తారు కనక, నూటికి నూరు పాళ్లూ తెలుగులో నడపడం కష్టం. రెండో ఆటంకం విషయం. చర్చించే విషయానికి తెలుగు అనువు కాకపోయినా, సంభాషణ తెలుగులో సాగదు.

  21. హ్మ్మ్… మీ ప్రశ్న కి సమాధానం చెప్పటం చాలా కష్టంగానే ఉంది. శాతాలలో ఐతే అస్సలు చెప్పలేను. కాని నేను రోజువారి విషయాల్లో తెలుగు బాగానే వాడుతాను. ముఖ్యంగా, (ఎంత ఛండాలంగా ఉన్నా) న్యూసు మాత్రం తెలుగు పేపర్లోనే చదువుతాను. ఇప్పుడు బ్లాగులు. కాని బ్లాగులు మానెయ్యాలని ప్రయత్నం…
    ఇంకా, చిన్నపుడంతా బైబిలు, పాటలు, ప్రార్ధన తెలుగులోనే చేసేవాళ్ళం… ఇప్పుడు ఇంగ్లీషులో. కాని మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడు, లేదా ఇంటికి వెళ్ళినప్పుడు అన్నీ ఇంకా తెలుగే. నేను కూడా పిల్లలు పుట్టాక ఇంట్లో తప్పకుండా తెలుగులోనే ప్రార్ధన అలవాటు చెయ్యాలని అనుకుంటున్నా.
    ఆఫీస్లో తెలుగు వాళ్ళతో తెలుగు, మిగతావాళ్ళతో హింది లేదా ఇంగ్లీషు….
    ఇక ఇంట్లో, నేను మా అప్పారావు కొట్టుకునేటప్పుడు తప్ప, అంతా తెలుగే :)

  22. It is great pleasure to thank you for your contribution to the Telugu language. I think it is the only effort that leads to survaival of the language. I am very much interested to promote telugu in daily live. Now you can question me why I am writing in English. What to tell. Though I know telugu typing very vell off line I am unable to write telugu in this box. I have requested so many times to suggest tips, tricks, to write telugu in this box. Some gentlemen suggested to follow lekhini etc. Further I have tried as suggested in google group, translation tips etc., but I could not succeeded. It is invitable to write in english. sorry for this. The fault is with my computor, or with my trials.

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.