బయటి ప్రపంచంలో యూనికోడ్ తెలుగు!

బయటి ప్రపంచంలో యూనికోడ్ తెలుగు వాడకాన్ని ఈ మధ్య ఓ రెండు చోట్ల చూసాను:

రెండు రోజుల క్రితం అనుకుంటా, తనపై వచ్చిన ఆరోపణలను తిప్పికొడుతూ కేవీపీ చంద్రబాబుకి లేఖ రాసారు. ఆ లేఖని టీవీల వాళ్ళు చూపించారు. అది గౌతమి ఖతిలో ఉండడం చూసి నేను ఆశ్చర్యపోయాను.

ఈ మధ్య LIC వారు పంపించే నోటీసులని తెలుగులో కూడా పంపిస్తున్నారు. ఇవి కూడా గౌతమి ఖతిలోనే ఉన్నాయి.

మీరు గమనించారా?

ప్రకటనలు

5 thoughts on “బయటి ప్రపంచంలో యూనికోడ్ తెలుగు!

 1. ఈ మద్య మొబైల్స్ లో కూడా తెలుగు వాడకం బాగా పెరిగింది. ఎయిర్ టెల్ వాడు కూడా SMS లు తెలుగులో పంపుతున్నాడు. గ్రామాల్లో చాలామంది నోకియా తెలుగు ఇంటర్‌పేస్ పోన్లను వాడుతున్నారు .

 2. అవునండీ కేవీపీ లేఖ చూసి నేనూ ఆశ్చర్యపోయాను. ఇంకా చాలా మంది కూడా వాడుతూ ఉండాలి. సాధ్యమైనంత ప్రచారం చెయ్యడమే మన పని.

  @శివ గారూ, నేను కూడా మొబైల్ లో తెలుగు చూశానండీ. చూసి, నా N73 మొబైల్ లో తెలుగు స్థాపించడానికి ప్రయత్నించి విఫలమయ్యాను. యూనీకోడ్ ను సపోర్ట్ చేసే మొబైల్స్ ఏవున్నాయో సేకరించాలి. మీకేమైనా తెలిసుంటే చెప్పండి.

 3. వీవెన్ గారూ, యింతకు ముందే ఎన్నోమార్లు నా ప్రచురణలలో నేను వ్యక్తపరిచినట్లు, యీ ట్రాన్స్లిటరేషన్ ప్రక్రియ కానీండి, యూనికోడ్ ప్రక్రియ కానీండి, కంప్యూటర్ వినియోగం విస్త్రుతంగా పెరిగిన యీ తరుణంలో, వారి వారి భాషలలో తమను తాము వ్యక్తపరుచుకొనేందుకు ఇదో మహత్తర సౌకర్యమైతే… బ్లాగ్ ప్రక్రియ మరో వుత్క్రుష్టమైన వేదిక.మన తెలుగువారికి ఇదో వరం. ఇప్పుడు యీ ప్రక్రియ ద్వారానే అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అనేక యాక్టులు యీ ప్రక్రియ ద్వారానే తెలుగీకరిస్తున్నట్లు తెలుస్తోంది.
  కాగితం పై పెన్నెవరూ పెట్టడంలేదు.

  ఆయా ప్రక్రియలను ప్రజలదరికి చేర్చే దిశలో నిరంతరం నిస్వార్ధంగా క్రుషి చేస్తున్న మీ బోంట్లను యేమని అభినందించగలం?

  యిక కూడలి లో కెలుకుడు బ్లాగులగురించి మీరడిగిన ప్రశ్న పై ఇది సందర్భంకాకున్నా….ఒకమాట…
  యే కార్యక్రమ నిర్వహణకైనా నిర్దేసిక సూత్రాలే ఆధారం. “బైలాస్”అనే మౌలిక సూత్రాల ఆధారంగానే నిర్వహణ జరుగుతుంది. కార్యనిర్వాహకవర్గం…..స్థాపకులు,ప్రభుత్వ నిబంధనలకనుగుణంగా సిల్పించిన బైలాస్ కు అనుగుణంగా తీసుకొనే,నిర్ణయాలకనుగుణంగానే ,….. సంస్థ(కూడలిని) సదుపాయాలను వినియోగించుకొనేవారు(సాధారణ సభ్యులు) బద్ధులై వుండాలి.

  అంతర్జాలం… ఇందులో వివిధ సభ్యుల ద్వారా జరిగే పొరబాట్ల్లకు నైతిక భాద్యత వహించ వలసిన స్థితి కార్యనిర్వాహక వర్గానికి రాకుండాను, సంస్థ నిబద్ధతపై మచ్చ రాకుండానూ, కఠినమైన నిబంధనలే వుండాలి? ఫలానా వాటిని వుంచాలా/ అనుమతించాలా లాటి విషయాలు….. సంస్థ మౌలిక సూత్రాలకు అనుగుణంగా లేని దేనినైనా నియంత్రించే అధికారం కార్యవర్గానికి వుంటుంది.కాబట్టి
  మీ(కూడలి) మౌలిక ఆశయాలకు అనుగుణంగాలేని దేనినైనా విపులంగా చర్చించి ,అనువుకాని దాన్ని దేనినైనా నిస్సంకొచంగా తిరస్కరించే అధికారం, అదికారిక కార్యవర్గ సభ్యులకు వుంటాయి.
  స్థాపక సభ్యులు రేపు సంస్థలో ప్రాతినిధ్యం వహించే అవకాశం వుండకపోవచ్చు. కాని వారి ఆశయాలను, మౌలిక ధ్యేయాన్ని ఆ తర్వాతి తరాలకు ( తరువాతి కమిటీలద్వారా….ఎన్నికైన కార్యనిర్వాహక వర్గం ద్వారా) అందించే దిశగా ముందుకు తీసుకు వెళ్ళే విధంగా మౌలిక నిబంధనల నిర్మాణం, ఆదేశిక సూత్రాల నిర్మాణం…… మరో యాభై సంవత్సరాలలో రాగల సాంకేతిక విప్లవాని కనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకొనేందుకు అవకాశాన్నిస్తూ జరగాలి. లేకుంటే ఏ సంస్థ అయినా స్థాపకులతోనే కనుమరుగయ్యే అవకాశం వుంది.
  మౌలిక ఆశయాలపై నిర్దిష్టమైన అవగాహన, అంగీకరించిన భాధ్యతపై ,నిష్ట ,నిబద్ధత,వుండి స్వంత సమయాన్ని సంస్థకొరకు వెచ్చించ గల వ్యక్తులనే కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకోవాలి.
  మీకు తెలియని విషయాలు కావు కానీ….మీరిలా అడిగినప్పుడు ఏకు కూడా మేకులా గట్టిపడి యిలా నాలా
  పోక్ చేయడానికి ప్రయత్నిస్తుంది.
  ముందు మీరేమి చేయాలనుకున్నారో అందులో నిర్దిషత అవసరం.
  ………………………………….
  యికపోతే….అప్పటెప్పటివో
  http://www.nutakki.wordpress.com లో ఈతెలుగు సమావేశపు ఫొటొలుంచాను చూడండి సంబందించిన వారికి తెలుపండి.
  అభినందనలతో …మీ అందరి ….శ్రేయోభిలాషి…..గిజిగాడు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s