నూతన సంవత్సర కానుక: Koodali.Org

తెలుగు బ్లాగరులందరికీ శుభాకాంక్షలతో నూతన సంవత్సర కానుకగా సరికొత్త కూడలి ని సమర్పిస్తున్నాను. కొత్త కూడలిలో విశేషాలు ఇవీ:

  1. ఆహ్లాదకరమైన సరికొత్త రూపం (నేననుకొంటే సరిపోదుగా. మీరేమంటారు?)
  2. ఇకనుండి ప్రత్యేక పేజీల్లో బ్లాగులపై వ్యాఖ్యలు, వార్తలు మరియు వెబ్‌జైనులు కూడా.

కూడలి కొత్తరూపం

దీనికి ప్రతిగా మీరేంచేయాలంటే:

  • మీ బుక్కుమార్కులని, మీ బ్లాగు నుండి కూడలికి లింకుని http://koodali.org/ కి నవీకరించుకోండి. (veeven.com/koodali ని koodali.org కి మార్చండి)
  • కొత్త కూడలిపై మీ అభిప్రాయాలని తెలియజేయండి.

22 thoughts on “నూతన సంవత్సర కానుక: Koodali.Org

  1. చాలా బావుంది !!

    మఖ్యంగా వ్యాఖ్యలు , వార్తలు చేర్చడం ఇంకా బావుంది !!

    నాదో సందేహం కూడలి కి WEB 2.0 సౌకర్యం ఆపాదిచడం సాధ్యమేనా ??

    నా కోరిక ఏంటంటే DIGG.com లాంటి సైటును తెలుగు లో చూడాలి !!

  2. రాధిక గారు చెప్పిందే నేను చెప్పాలి అనుకున్నా. అందరి బ్లాగ్స్ లింక్స్ ఒక పక్క చూపిస్తే బాగుంటుంది. ఇన్ని తెలుగు బ్లాగ్లు ఉన్నాయి అని అందరికి తెలుస్తుంది.

  3. ప్రవీణ్, RSS సౌకర్యం నెలన్నరనుంచీ ఉన్నట్టుంది కానీ అందరికీ తెలియదంతే.

    రాధిక మరియు విజయ,అన్నీ ఒక్కసారే చెయ్యలేక బ్లాగుల జాబితాని ప్రస్తుతానికి వదిలేసా. త్వరలో అదికూడా వస్తుంది.

  4. కూడలిలో “149 తెలుగు బ్లాగులనుండి సంగ్రహం” అని ఉంది కదా, దాన్ని నొక్కగలిగే విధంగా మార్చి, బ్లాగుల జాబితాకి అనుసంధానిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అదే విదంగా వ్యాఖ్యలు వార్తలు మెదలయిన వాటిలో కూడా ఆయా జాబితాలను చూపిస్తే బాగుంటుంది.

  5. చాలా బాగుంది. అన్నింటిని ఒకే ఛత్రము కింద తెచ్చి మంచిపని చేశారు. అందుకే ఛత్రపతి వీవెన్ అని అనాలనిపిస్తుంది. ఇంత మంచి నూతన సంవత్సర కానుక ఇచ్చినందుకు కృతజ్ఞతలు

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.