ఫైర్‌ఫాక్స్ పొడగింత: లొకేషన్ బార్2

Firefox with Locationbar2 Extension

పైనున్న ఫైర్‌ఫాక్స్ తెరచాప (ప్రత్యేకించి చిరునామా పట్టీ) లో మీరేదైనా తేడా గమనించారా?

 • http:// అన్నది లేదు.
 • డొమైను పేరు బొద్దుగా ఉంది.
 • వెబ్ చిరునామాలో తె లు గు  అక్షరాలు కూడా కనిపిస్తున్నాయి.

ఇదంతా లొకేషన్ బార్2 అనే ఫైర్‌ఫాక్స్ పొడగింత యొక్క మహత్యం. ఈ పొడగింత యొక్క పై మూడు విశేషాలని మరికొంచెం వివరిస్తా.

 1. http:// : http లేదా https అన్నవి సాఫ్ట్‌వేర్ కొరకు ఉద్దేశించిన వెబ్ ప్రొటోకాల్సు. చిరునామా పట్టీలో వాటిని చూపించకపోయినా మనకి మామూలుగా వచ్చే నష్టమేమీలేదు. కానీ కొన్ని ప్రత్యేక అవసరాలకి (ఉ.దా. పేజీ URL ని కాపీ చేసుకునేప్పుడు) ఖచ్చితమైన వెబ్ చిరునామా కావాల్సిరావచ్చు. లొకేషన్ బార్2 పొడగింత http లేదా https ని చూపించదు. కానీ చిరునామా పట్టీ లో కర్సర్ ఉన్నప్పుడు లేదా చిరునామా పట్టీ పైకి మూషికాన్ని తీసుకెళ్ళినా పూర్తి చిరునామాని చూపిస్తుంది. అంటే సరిగ్గా మనకవసరమైనప్పుడే!
 2. బొద్దు డొమైను పేరు: డొమైను పేరుని ఇలా ప్రత్యేకంగా చూపించడం నకిలీ వెబ్ సైట్లని గుర్తించడంలో మనకి తోడ్పడుతుంది. మన లాగిన్ వివరాలు సరైన వెబ్ సైట్లోనే ఇస్తున్నామో లేదో ఓసారి సరిచూసుకోవచ్చు.
 3. వెబ్ చిరునామాలో తెలుగు అక్షరాలు: వెబ్ చిరునామాలో “%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81” కంటే “తెలుగు” అని చూడడం బాగుంటుందికదా. తెవికీ లేదా తెలుగు బ్లాగుల్లో విహరించేటప్పుడు ఉపయోగపడుతుంది.

ఇంకెందుకాలస్యం, లొకేషన్ బార్2 పొడగింతని తెచ్చుకోండి మరి.

5 thoughts on “ఫైర్‌ఫాక్స్ పొడగింత: లొకేషన్ బార్2

 1. అసలీ టపా రాసిందే ఆ మూడో దాన్ని అందరికి తెలియజెప్పడంకోసం. దానికి 1వ నెంబరు ఇచ్చి ఉండాల్సింది.

  చాలా రోజులనుంది దీన్ని వాడుతున్నాను. ఇతర పొడగింతలతో సరిగా పొసగేది కాదు. ఈమధ్యనే స్థిరత్వం సంతరించుకుంది. అందుకే దీని గురించి ఇప్పుడు బ్లాగా.

 2. మన వికీపీడియా చదువుతున్నప్పుడు, తెలుగు చిరునామాలు చాలా పొడవుగా గమ్మత్తుగా చూడలేక పోతున్నాం.
  ఇదెవరు కనిపెట్టారోగాని మహానుభావులు. Firefox is the God of User Experience.
  మీ చిట్కాకు కృతజ్ఞతలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.