ప్రవీణ్ యొక్క టపా స్పూర్తితో నా కంప్యూటర్లో విండోస్ XPలో VMWare ద్వారా ఉబుంటు లినక్సుని కూడా నడుపుతున్నాను. ఇన్‌స్టలేషన్ ప్రక్రియ సాఫీగా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తయింది.
వెనుక XP, ముందు కిటికీలో ఉబుంటు (తెలుగు చూపించడానికి ఇబ్బంది పడుతుంది):
అభినయ్ సూచనలతో తెలుగు కూడా సిద్ధం:
నేను రెండు సంవత్సరాలుగా Virtual PC ని వాడుతున్నాను. సరదాగా విండోస్ 1.0, లినక్స్ ని అప్పుడప్పుడూ వాడటానికి. అయితే ఇప్పుడు Virtual Server వచ్చేసింది. ఇది ఒకే సారి 64 ఆపరేటింగ్ సిస్టంలను host చెయ్యగలదు. మన బ్రౌజర్లో ఒకొక్క దానిని చూసి వాడుకోవటమే. ప్రస్తుతం ఇది ఉచితం కూడా :-)
కరణం అనే పదాన్ని వాడాలంటే ప్రతి సందర్భంలోను దాని ముందు పదానికి ఈకారం చేర్చడం పనికిరాదు.మొదటి పదం అకారాంతమైతేనే అలా చెయ్యాలి. ఉదాహరణకి సమం=సమీకరణం. ధ్రువం = ధ్రువీకరణం
అలా కాని సందర్భాల్లో మొదటి పదాన్ని ఏ మార్పూ లేకుండా ఉంచి కరణం అనేదాన్ని జతచెయ్యాలి. కనుక మిథ్యాకరణం అనేది సరైన పద నిర్మాణం.
సుబ్రమణ్యంగారు, కృతజ్ఞతలు. సరిచేసా.
చాలా సంతోషం…
ఇక పోతే మీరు ఇక్కడికి (http://www.vmware.com/vmtn/appliances/) వెళితే గనక మీకు ఎన్నో virtual appliances కనిపిస్తాయి. ఇన్‌స్టాల్ల్ చేసుకోవలసిన అవసరం లేకుండా download చేసుకుని వాడేసుకోవచ్చు.
ఇకపోతే శోధన గారు,
vmware కి కూడా browser లో వాడే సదుపాయం ఉంది.