వీవెనుడి టెక్కునిక్కులు

స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్, బహిరంగ జాలం, తెలుగు, ఇతరత్రా…

ఫైర్‌ఫాక్స్‌లో (unjustified) తెలుగు

12 వ్యాఖ్యలతో

గమనిక: ఫైర్‌ఫాక్స్ 3 మరియు ఆపైన వెర్షనులలో ఈ సమస్య లేదు.

మామూలుగా ఫైర్‌ఫాక్స్ తెలుగుని బానే చూపిస్తుంది (సరే, మీరు XPలో Support for Complex Script Languages ని చేతనం చేసిన తర్వాతే). కానీ జస్టిఫై చేసిన తెలుగు వచనాన్ని సరిగా చూపించలేదు. ఈ సమస్యని రెండు విధాలుగా అధిగమించవచ్చు. ఒకటి, తాత్కాలికంగా IE లేదా IE Tab వాడడం. రెండు, జస్టిఫై చేసిన వచనాన్ని వాడవద్దని ఆ సైటు నిర్వాహకునికి విన్నవించుకోవడం.

మొదటి పరిష్కారంలో IE వాడడం స్వల్ప అసౌకర్యం. IE Tab పర్లేదు, ఫైర్‌ఫాక్స్‌లోనే ఆ పేజీని IEతో చూపిస్తుంది. రెండవ పరిష్కారం కొన్నిసార్లు దైవాదీనం కావచ్చు. ఈ రెండూ కాకుండా, ఫైర్‌ఫాక్స్‌తోనే ఆ జస్టిఫై వచనాన్ని సరిచేసుకోగలిగితే బాగుంటుంది కదా.

అందుకే నేనో పిల్ల బుక్‌మార్కుని తయారుచేసా. దాని పేరు… ఆ unjustify. దీన్ని మీ బుక్‌మార్కు బారులో పెట్టుకొని, జస్టిఫై వచనమున్న తెలుగుపేజీ ఎదురైనప్పుడు దీనిమీద ఓ నొక్కు నొక్కితే చాలు. ఆ పేజీలోని వచనం మీరు చదివేందుకు వీలుగా మారుతుంది.

ఎలా వాడాలి?

  1. ఈ పేజీలోని unjustify లంకెని బుక్‌మార్కు బారు లో చేర్చుకోండి.unjustify
  2. జస్టిఫై చేసిన వచనమున్న ఒక వెబ్‌సైటుకి వెళ్ళండి.
  3. ఇందాక చేర్చుకున్న బుక్‌మార్కు మీద ఓ నొక్కు నొక్కండి.
  4. జుస్టిఫైడ్ వచనం సరి అవుతుంది.

ఇక మీరు ఫైర్‌ఫాక్స్ సౌఖ్యంతోనే తెలుగు పేజీలని చదవవచ్చు.  ఏమైనా ఇబ్బందులుంటే తెలుగుబ్లాగు సమూహానికి రాయండి. నేను బదులిస్తా.

(అన్నట్టు మీరోటి గమనించారా, కూడలిలో ఈ సమస్య రాకుండా నేను సరిచేసా.)

తాజాకరణ 2007-02-19: ఇప్పుడు WordPress.com బ్లాగులలో కూడా పనిచేస్తుంది. (మీ వర్డుప్రెస్ బ్లాగు థీమ్ justifed text లేదా/మరియు letter-spacing ని వాడుతుంటే ఫైర్‌ఫాక్స్ ని ఉపయోగించే మీ బ్లాగు సందర్శకులకి Unjustify ని వాడమని సూచించండి.)

Written by వీవెన్

ఫిబ్రవరి 19, 2007 వద్ద 8:00 పూర్వాహ్నం

12 స్పందనలు

Subscribe to comments with RSS.

  1. చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చి బ్లాగులు ముందుగా చదవాలని కూడలి తెరవగానే చూసాను. ఆశ్చర్యపోయా. అప్పుడు తెలిసింది ఇది unjustify మహిమ అని. చాలా మంచి ఆలోచన. చాలా బాగుంది. ధన్యవాదములు.

    kamesh

    అక్టోబర్ 13, 2006 at 1:55 అపరాహ్నం

  2. భలే భాలే చాలా థాంక్స్

    వైజాసత్య

    అక్టోబర్ 13, 2006 at 2:04 అపరాహ్నం

  3. తెలుగుకి మీరు చేస్తున్న సేవకి కృతజ్ఞతలు.

    –ప్రసాద్
    http://charasala.com/blog/

    charasala

    అక్టోబర్ 13, 2006 at 3:32 అపరాహ్నం

  4. బాగుంది, వీవెన్! అన్ని సైట్లకు పనిచెయ్యదా ఏమిటి ఇది? మనమాటలో (వర్డ్‌ప్రెస్సు ఇంజను) పనిచేస్తున్నట్లు లేదు. తెలుగుజాతీయవాదిలో (బ్లాగ్‌స్పాటు) పనిచేసింది.

    chaduvari

    అక్టోబర్ 17, 2006 at 5:36 అపరాహ్నం

  5. Well, it is not working on the elements where style is applied based on class or id. Now works!

    వీవెన్

    అక్టోబర్ 18, 2006 at 9:36 పూర్వాహ్నం

  6. చాలా మంచిపని చేశారు…… ఇంతకీ, ఫైర్ ఫాక్స్ 3.0 లో ఈ తంటాలు కూడా ఉండవు కదా?

    మధు

    ఫిబ్రవరి 20, 2007 at 6:00 పూర్వాహ్నం

  7. [...] on April 12th, 2007. ముందుగా unjustifyని తయారుచేసిన వీవెన్ కి ధన్యవాదాలు. ఐతే, [...]

  8. మీరు ఒ మతం పెట్టండి, అందులో నేను చేరతా. :)
    ఆశకు అంతు లేదు ఇలాంటిదేదైనా thunderbird లో ఫీడ్లు చదవడానికి ఉందా.

    రాకేశ్

    ఏప్రియల్ 24, 2007 at 4:10 అపరాహ్నం

  9. Rakesh, in your Thunderbird profile folder (on Windows typically C:\Documents and Settings\username\Application Data\Thunderbird\Profiles\somealphanumerics.default\), create folder named chrome. And, then create a file called userContent.css (in the newly created chrome folder) with the following line in it div[align='justify'] {text-align:left ! important;}.

    This will cover all the feeds from blogspot blogs. You do not have this problem with feeds from WordPress blogs.

    వీవెన్

    ఏప్రియల్ 24, 2007 at 5:04 అపరాహ్నం

  10. [...] లేకపోలేదు. వీవెన్ దీనికి ఓ మందు కనిపెట్టారు కూడా – ఇది బ్లాగు చదువుకునేవారికి [...]

  11. చాలా చాలా ధన్యవాదాలు.. వారం నుండి బుర్రగోక్కుంటున్నానండి.. ఇప్పటికి తెలిసింది.

  12. వీవెన్ గారు, ఫైర్ ఫాక్స్ లో తెలుగు బాగానే కనబడుతుంది, కానీ,IE7 కాని IE8 లో కనబడినంత అందంగా చేయాలంటే కొన్ని సెట్టింగ్స్ యేవో యెక్కడో చదివాను. దయచేసి మళ్ళీ చెప్పండి.


ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Follow

Get every new post delivered to your Inbox.

Join 106 other followers