ఫైర్‌ఫాక్స్‌లో (unjustified) తెలుగు

గమనిక: ఫైర్‌ఫాక్స్ 3 మరియు ఆపైన వెర్షనులలో ఈ సమస్య లేదు.

మామూలుగా ఫైర్‌ఫాక్స్ తెలుగుని బానే చూపిస్తుంది (సరే, మీరు XPలో Support for Complex Script Languages ని చేతనం చేసిన తర్వాతే). కానీ జస్టిఫై చేసిన తెలుగు వచనాన్ని సరిగా చూపించలేదు. ఈ సమస్యని రెండు విధాలుగా అధిగమించవచ్చు. ఒకటి, తాత్కాలికంగా IE లేదా IE Tab వాడడం. రెండు, జస్టిఫై చేసిన వచనాన్ని వాడవద్దని ఆ సైటు నిర్వాహకునికి విన్నవించుకోవడం.

మొదటి పరిష్కారంలో IE వాడడం స్వల్ప అసౌకర్యం. IE Tab పర్లేదు, ఫైర్‌ఫాక్స్‌లోనే ఆ పేజీని IEతో చూపిస్తుంది. రెండవ పరిష్కారం కొన్నిసార్లు దైవాదీనం కావచ్చు. ఈ రెండూ కాకుండా, ఫైర్‌ఫాక్స్‌తోనే ఆ జస్టిఫై వచనాన్ని సరిచేసుకోగలిగితే బాగుంటుంది కదా.

అందుకే నేనో పిల్ల బుక్‌మార్కుని తయారుచేసా. దాని పేరు… ఆ unjustify. దీన్ని మీ బుక్‌మార్కు బారులో పెట్టుకొని, జస్టిఫై వచనమున్న తెలుగుపేజీ ఎదురైనప్పుడు దీనిమీద ఓ నొక్కు నొక్కితే చాలు. ఆ పేజీలోని వచనం మీరు చదివేందుకు వీలుగా మారుతుంది.

ఎలా వాడాలి?

  1. ఈ పేజీలోని unjustify లంకెని బుక్‌మార్కు బారు లో చేర్చుకోండి.unjustify
  2. జస్టిఫై చేసిన వచనమున్న ఒక వెబ్‌సైటుకి వెళ్ళండి.
  3. ఇందాక చేర్చుకున్న బుక్‌మార్కు మీద ఓ నొక్కు నొక్కండి.
  4. జుస్టిఫైడ్ వచనం సరి అవుతుంది.

ఇక మీరు ఫైర్‌ఫాక్స్ సౌఖ్యంతోనే తెలుగు పేజీలని చదవవచ్చు.  ఏమైనా ఇబ్బందులుంటే తెలుగుబ్లాగు సమూహానికి రాయండి. నేను బదులిస్తా.

(అన్నట్టు మీరోటి గమనించారా, కూడలిలో ఈ సమస్య రాకుండా నేను సరిచేసా.)

తాజాకరణ 2007-02-19: ఇప్పుడు WordPress.com బ్లాగులలో కూడా పనిచేస్తుంది. (మీ వర్డుప్రెస్ బ్లాగు థీమ్ justifed text లేదా/మరియు letter-spacing ని వాడుతుంటే ఫైర్‌ఫాక్స్ ని ఉపయోగించే మీ బ్లాగు సందర్శకులకి Unjustify ని వాడమని సూచించండి.)

12 thoughts on “ఫైర్‌ఫాక్స్‌లో (unjustified) తెలుగు

  1. చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చి బ్లాగులు ముందుగా చదవాలని కూడలి తెరవగానే చూసాను. ఆశ్చర్యపోయా. అప్పుడు తెలిసింది ఇది unjustify మహిమ అని. చాలా మంచి ఆలోచన. చాలా బాగుంది. ధన్యవాదములు.

  2. బాగుంది, వీవెన్! అన్ని సైట్లకు పనిచెయ్యదా ఏమిటి ఇది? మనమాటలో (వర్డ్‌ప్రెస్సు ఇంజను) పనిచేస్తున్నట్లు లేదు. తెలుగుజాతీయవాదిలో (బ్లాగ్‌స్పాటు) పనిచేసింది.

  3. Rakesh, in your Thunderbird profile folder (on Windows typically C:\Documents and Settings\username\Application Data\Thunderbird\Profiles\somealphanumerics.default\), create folder named chrome. And, then create a file called userContent.css (in the newly created chrome folder) with the following line in it div[align='justify'] {text-align:left ! important;}.

    This will cover all the feeds from blogspot blogs. You do not have this problem with feeds from WordPress blogs.

  4. వీవెన్ గారు, ఫైర్ ఫాక్స్ లో తెలుగు బాగానే కనబడుతుంది, కానీ,IE7 కాని IE8 లో కనబడినంత అందంగా చేయాలంటే కొన్ని సెట్టింగ్స్ యేవో యెక్కడో చదివాను. దయచేసి మళ్ళీ చెప్పండి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.