e-తెలుగు ఎలా ఏర్పడింది?

e-తెలుగుని ఏర్పరచింది తెలుగు బ్లాగరులే. e-తెలుగు పుట్టు పూర్వోత్తరాల గురించి ఈ క్రింది లింకులు వివరంగా తెలియజేస్తాయి. మీకున్న సందేహాలని నివృత్తి చేసుకోడానికి ఇవి ఉపయోగపడవచ్చు. అన్ని ప్రశ్నలకూ నేరుగా సమాధానం దొరకపోవచ్చు. అప్పటి feelని మాత్రం ఇవి మీకు అందిస్తాయి.

e-తెలుగు గురించి మరింత:

ఆనంద బ్లాగాయనం!

17 thoughts on “e-తెలుగు ఎలా ఏర్పడింది?

  1. ఈ-తెలుగు గురించి కొన్ని విషయాలు మీ వ్యాసం ద్వారా తెలిసాయి అయితే ఓ సందేహం – మొదట్లో కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు – అదే కార్యవర్గం జీవితకాలం వుంటుందా లేక ప్రతి ఏడు ఎన్నికలు జరుగుతాయా లేదా అన్నది అర్ధం కాలేదు. ఆ వివరాలు నేను చదవని టపాలలో వున్నాయేమో తెలియదు కానీ బై-లా లో మాత్రం వున్నట్లు లేదు. పొతే బై-లా సగం ఇంగ్లిష్ లోనే వుందే!

    ఆ ఎన్నికలలో ప్రవాసులు పోటీ చేయవచ్చా? నాలాంటి విదేశీయులు ఈ-తెలుగులో సభ్యత్వం తీసుకోవచ్చా? ఎన్నికలలో పోటీ చేయవచ్చా?

    అందరూ తెలుగు సైనికులుగా, స్వచ్చంద సేవకులుగా వుండాల్సిన తరుణాన ఎవరినో ఒకరిని అధ్యక్షులుగా, ఇతర హోదాలతో గుర్తించడం అన్నది గొంతులో పచ్చి వెలక్కాయలా అనిపిస్తోంది. ఇహ హోదాలలో వున్నవారేమో పదివిలో వున్నందుకు వినయం లేకపోగా ఫక్తు రాజకీయనాయకులుగా సమస్త తెలుగు ప్రపంచానికి వకాల్తాలా వుంటాయి వారి వుపదేశాలు అయా వారి బ్లాగులలో – వ్యాఖ్యలలో. ఈ పరిస్థితికి ఏదయినా ప్రత్యామ్నాయం వుంటే బావుండును. ఈ-తెలుగు కార్యవర్గం పదవిలో వున్నంతవరకయినా తమ స్వంత భావాలు ప్రకటించకుండా, పక్షపాతం లేకుండా తెలుగు సేవకు మాత్రమే అంకితం అయితే ఇలాంటి సమస్యలు రాకపోవచ్చు అన్నది నా అభిప్రాయం. ఈ-తెలుగు సభ్యులు ఏమో గానీ బ్లాగులకి రామసేనలా అగుపిస్తున్నారు కొంతమంది సభ్యులు. ఈ-తెలుగు సభ్యులుగా తెలుగుకు చేస్తున్న సేవను చూసి మెచ్చుకుంటూ ఈ-తెలుగులో పాల్గొనాలో లేక వారి చాదస్తాన్ని చూసి ఈ-తెలుగుకు దూరంగా వుండాలో అర్ధం కానీ ద్వైదీ భావం నాలాంటి వారిది.

  2. మొదటగా మీ ఆసక్తికి సంతోషం. మీ సందేహాలకు నా (వ్యక్తిగత) సమాధానాలు. ఇవి e-తెలుగు అధికారిక స్పందనలు కాదు.

    బై-లాలో కార్యవర్గ జీవితకాలం, ఎన్నిక వివరాలు ఉన్నాయి. కార్యవర్గ జీవితకాలం రెండేళ్ళు. చూడండి.

    బై-లాని పూర్తిగా తెలుగులోకి అనువదించాల్సివుంది.

    ప్రవాస భారతీయులు e-తెలుగు సభ్యులు కాగలరు అని బైలాలో ఉంది. (ప్రవాసులకి ప్రవాస భారతీయులకీ చట్టపరమైన భేదం ఉండొచ్చు.) ప్రవాస భారతీయులు ఎన్నికలలో పోటీ చేయగలరా అన్నది స్పష్టంగా లేదు. సభ్యులైన వారు కార్యవర్గానికి పోటీ చేయవచ్చన్నది నా భాష్యం. (e-తెలుగుకి ఇంకా విదేశాలనుండి సొమ్ముని స్వీకరించే అధికారం లేదనుకుంటా. ప్రభుత్వ అనుమతి లాంటి చాలా తతంగాలు ఉంటాయనుకుంటా.)

    ఇక మీ చివరి పేరా:
    సంఘంగా ఏర్పడదామనుకున్నప్పుడు వచ్చిన ఆలోచనల్లో సంఘం, హోదాలు అవసరమా అన్నవి కూడా ఉన్నాయి. మనకి ప్రభుత్వాలు, మీడియా, ఇతర సంస్థలు తగు గుర్తింపునివ్వడానికి సంఘం గా ఏర్పడితే తోడ్పడుతుందని అనుకున్నాం. మనం వ్యక్తులుగా ఓ నలుగురం వెళ్ళి ఎవరైనా నాయకుడిని, ప్రభుత్వ సంస్థతోనో తెలుగు గురించి మంతనాలు జరిపితే వచ్చే స్పందన వేరు. అదే ఒక సంస్థగా వెళితే స్పందన వేరు. వ్యక్తులుగా వెళ్ళినప్పుడు ‘మీరెవరూ, మీకేంటి’ లాంటి ప్రశ్నలతో పెద్దగా పట్టించుకోకపోయే అవకాశం ఉంది. (సంఘం ఏర్పడక ముందు ఇలాంటి కొన్ని అనుభవాలు కూడా ఉన్నాయి.) ఒక సంస్థగా వెళితే, వచ్చే ప్రయోజనాల మేరకే అంటే వాస్తవ ప్రపంచంలోని మన వాణిని వినిపించడానికే సంఘంగా నమోదవ్వాలని అనుకున్నాం. అయితే, తెలుగు అభివృద్ధికి జాలంలోనూ బయటా కృషి చేయడానికి ఎవరికీ సంఘం అడ్డంకి కాదు. ఎవరినీ ఆపలేదు.

    బ్లాగులనేవి వ్యక్తిగతమైనవి. బ్లాగుల్లోనూ వ్యాఖ్యల్లోనూ వ్యక్తపరిచే అభిప్రాయాలకూ e-తెలుగుకీ సంబంధం లేదు. (అవి ఎవరికి ఎలా అనిపిస్తాయన్నది ఇక్కడ అప్రస్తుతం. కొంత మంది కుండ బద్దలు కకొట్టినట్టు చెప్తారు, కొంత మంది ముక్తసరిగా చెప్తారు, కొంతమంది ఇదే సర్వం అన్నట్టుగా చెప్తారు. కొంత మంది మిగతా వారిపై రుద్దుతున్నట్టు చెప్తారు. కానీ అవన్నీ కేవలం వారి వారి అభిప్రాయాలే కదా.) కార్యవర్గంలో ఉన్నవారు బ్లాగులు రాయవచ్చువారి వారి అభిప్రాయాలు వ్యక్తపరచుకోవచ్చు. అందుకు విరుద్ధంగా నియమాలేమీ లేవు.

    కార్యవర్గంలో ఉన్న వారు తమ స్వంత భావాలు ప్రకటించ కుండా ఉండాలనే మీ సూచనని నేను అంగీకరించలేకున్నాను. మీ ద్వైదీ భావం నాకర్థమైంది. చాలా మందికి పలు అపోహలు సందేహాలు ఉండవచ్చనే ఈ టపాని నేను మొదలుపెట్టాను. నా ఉద్దేశంలో బ్లాగులని వారి అభిప్రాయాలని e-తెలుగు కార్యక్రమాలతో ముడిపెట్టిచూడకుంటే బాగుంటుంది. (బ్లాగుల్లో వాగ్యుద్ధాలు చేసుకుని, సమిష్టిగా పనిచేయాల్సివచ్చినప్పుడు అవన్నీ పక్కన పెట్టి చేతులు కలుపుతున్నవారు చాలా మంది ఉన్నారు.) e-తెలుగు కార్యక్రమాలని మరింత పారదర్శకంగా, ఎక్కువమంది పాలుపంచుకునేలా చేయడానికి ప్రయత్నాలూ జరుగుతున్నాయి. (నాకు తెలిసి సమయాభావం అనేది ముఖ్య సమస్య.) రానున్న రోజుల్లో e-తెలుగు ప్రజా సంబంధాలు మరింత మెరుగౌతాయని ఆశిస్తున్నాను.

    అదలా ఉండగా:
    తెలుగు వ్యాప్తికి e-తెలుగు అన్నది ఒక ప్రయత్నంమాత్రమే. ఎందరో వ్యక్తులు, సంస్థలు చేసిన కృషి వల్ల మనం కంప్యూటర్లో తెలుగుని చూడగలుగుతున్నాం, రాయగలుగుతున్నాం. సాంకేతికంగా జరిగిన అభివృద్ధి చాలా వరకూ e-తెలుగు రాక ముందే జరిగింది. దాన్ని సామన్య ప్రజల వద్దకి తీసుకెళ్తున్నాం. చేయాల్సిందీ చాలా ఉంది. ఇది e-తెలుగు ముఖంగానూ జరగవచ్చు, సంబంధం లేకుండానూ జరగవచ్చు.

    జాలంలో తెలుగుకి మీ వంతు తోడ్పాటునందించడానికి, ఈ క్రింది లింకుల్లో కొంత సమాచారం పొందు పరచాను. చూడండి.
    * Telugu on the Web: How can YOU help?
    * Localizing into Telugu, on the web

  3. “ఈ-తెలుగు కార్యవర్గం పదవిలో వున్నంతవరకయినా తమ స్వంత భావాలు ప్రకటించకుండా, పక్షపాతం లేకుండా తెలుగు సేవకు మాత్రమే అంకితం అయితే ఇలాంటి సమస్యలు రాకపోవచ్చు అన్నది నా అభిప్రాయం.”

    ఎంతవరకూ సబబు? అంటే తెలుగు భాష కోసం ప్రయత్నిస్తుంటే, వారు పౌరులుగా మిగిలిన ప్రాపంచిక విషయాలపై వారి అభిప్రాయాలని పది మంది ముందు పంచుకోకూడదా?

    ఇదేమి న్యాయం? అది వారి నుండి అతిగా ఆశించడం అవ్వదా? ఇలా ఆశించడం అన్యాయంగా, అసమంజషంగా అనిపించడం లేదా? ఒకరికి తెలుగు మీద అభిమానం, తెలుగు వాడుక కోసం కృషి చేసే సమయం ఉంటే ఈ-తెలుగు వారితో కలిసి పనిచేస్తారు… అలా పని చేసే ముందు, ఇప్పటి వరకు వాళ్ళ పని ఎలా జరిగింది, ఏమి చేసారు అని చూస్తారే గానీ, మిగిలిన ప్రాపంచిక విషయాల మీద వారి అభిప్రాయాలేంటి అని ఆరా తీసి వారితో చేరాలా వద్దా అనే ఆలోచన ఎందుకు చేయాల్సి వస్తుందో నాకు అర్ధం కావడం లేదు… ఆ ఆలోచన, ఆ గుంపు లక్ష్యానికే విరుద్ధంగా ఉంటుంది…

    అలా బేరీజు వేసుకుని, లక్ష్యానికి ఏ మాత్రం సంభంధం లేని అనవసరమైన లెక్కలు వేసుకుని ఆలోచించే వాళ్ళు ఈ-తెలుగుకి ( ఆ రకంగా చూస్తే ఏ సంస్థకైనా) లాభం కన్నా నష్టమే ఎక్కువ కలిగిస్తారని నా అభిప్రాయం.

    గమనిక: నేను ఈ-తెలుగు సభ్యుడిని కాను.

  4. వివేకానందుని మాట ఒకటి గుర్తుకు వస్తోంది.
    “Help if you can; if you cannot, fold your hands and stand by and see things go on. Do not injure, if you cannot render help.”

    e-తెలుగు అన్నది ఔత్సాహికులైన కొంతమంది వ్యక్తుల తో ఏర్పడ్డ ఒక స్వఛ్చంద సంస్థ. ఉత్సాహం ఉంటే ఇలాంటి ప్రయత్నాలకు సహాయం చేయాలి, లేదా విమర్శించాలనుకున్నప్పుడు ఇంతకన్నా మంచి పనులు చేసి చూపించాలి. అలా కాకుండా ఊరికే విమర్శిస్తే దానికి విలువ ఉండదు.

    బ్లాగుల్లో పెద్దరికాలు ఆపాదించుకుని కొత్తగా వచ్చిన వారిని గిల్లటం, గ్రూపులు గా తయారు కావటం లాంటివి ఉన్నమాట నిజం. అది పూర్తిగా ఆయా వ్యక్తుల వ్యక్తిగత సంస్కారం. వాటికీ ఇ-తెలుగు లంకె పెట్టడం భావ్యం కాదు. అలాంటి వాటిని ఎక్కడెక్కడ చూస్తామో అక్కడే ప్రశ్నించటం, ఎదిరించటం చేయాలి. (ఇది కూడా లాభం లేని పని అని స్వానుభవం, అది వేరే విషయం.)

    కమ్యూనిటీ బ్లాగింగు కు పూర్తి వ్యక్తిగత బ్లాగులకూ తేడా తెలిస్తే ఇలాంటి సమస్యలు రావు. నేను కలిసిన, నాకు తెలిసిన ఇ-తెలుగు సభ్యులెవ్వరూ “తాలిబన్” ల లా వ్యవహరించటం ఎప్పుడూ నేను గమనించలేదు. In fact, there is a silent precision with which they go about getting things done. అక్కడా ఇక్కడా గిల్లి గిచ్చి ఆనందించే పెద్దమనుషులు, గ్రూపులు కట్టేవారూ పనికొచ్చేపని ఏదీ చేసిన దాఖలాలు లేవు. వ్యాఖ్యలు రాసి అహం తృప్తి పరచుకోవటం తప్ప.

    Criticism are useless if they are not constructive in nature. Lets get rid of this peculiar Indian way of being nitpicky about everything, and lets appreciate where its due. If we can not, lets be silent, and let things happen.

  5. @ వీవెన్: “ప్రవాస భారతీయులు ఎన్నికలలో పోటీ చేయగలరా అన్నది స్పష్టంగా లేదు. “- ప్రవాస భారతీయులు వారు నివసించే ప్రదేశంలో ఏర్పరుచుకునే affiliated assocciation తరపున అక్కడి స్థానిక ఎన్నికలలో పాల్గొనవచ్చు. Affiliated assocciations స్వతంత్ర సంస్థలు. వీటికి కేంద్ర సంస్థనుంచి సాంకేతిక, ఇతర సలహాలు అందచేయబడతాయి. కేంద్ర e-telugu.org లో సంస్థ కేంద్రమైన హైదరాబాదు వారే ఎన్నికలలో పోటీ చేస్తారు. భారతీయ Registrar of companies వారి చట్టాలకు అనుగుణంగా కేంద్ర సంస్థ పనిచేస్తుంది.

  6. @వీవెన్,
    ఓపికగా నా సందేహాలు కొన్ని తీర్చినందుకు ధన్యవాదాలు. ఒక కామన్ కాజ్ కోసం వైరుధ్యాలను వ్యక్తిగతంగా వుంచేసి మనసులు కలిసిన వాటిల్లో కలిసి పనిచేస్తే బావుంటుందంటారు. ఇప్పటిదాకా (దాదాపుగా) చదువరినే ఈ-తెలుగు, ఈ-తెలుగునే చదువరి అనుకుంటున్న నాలాంటి వారు కాస్త మైండ్ సెట్ మార్చుకోవాలేమో.

    ప్రవాసాంధ్రులు, (ఇండియాకి) విదేశీయులు వేరు కాబట్టి ఆయా విషయాలలో మరింత వివరణ ఇవ్వగలరు. నేను కెనడా పౌరుడిని కాబట్టి ప్రవాసంధ్రుడిని కాదు (కదా).

    @దిలీప్
    అభిప్రాయలను కూడా మొగ్గలోనే తుంచే మీలాంటివారివల్ల ఈ-తెలుగుకు లాభం కంటె నష్టమే ఎక్కువే వుంటుంది. దయచేసి ఇకముందుకూడా ఈ-తెలుగు లొ మీలాంటివారు చేరకుండా వుంటే సంతోషిస్తాను. నేను అడిగింది ఈ-తెలుగుని, ఈ-తెలుగు సభ్యులను!

    @యోగి
    ఈ-తెలుగు గురించి మరింత స్పష్టత కోసం కొన్ని ప్రశ్నలు అడిగాను. విమర్శలే చేయదలుచుకుంటే నేను ఈ సైటులోకి రానవసరంలేదు :) దానికి వేదికలు ఈమధ్య కొన్ని మొదలయాయి. కొన్ని వేదికలలో నేనూ పాల్గొన్నాను.

  7. @ శరత్

    నేను కూడా ఈ విషయాన్నే “ఒక కామన్ కాజ్ కోసం వైరుధ్యాలను వ్యక్తిగతంగా వుంచేసి మనసులు కలిసిన వాటిల్లో కలిసి పనిచేస్తే బావుంటుందంటారు.” ఇంకో విధంగా చెప్పాను. మిమ్మల్ని బాధించి ఉంటే క్షంతవ్యుడను… నా ఉద్దేశం అది కాదు. నేను ఇప్పటి వరకు చూసిన చాలా సంధర్భాల్లో అలాంటి ఆలోచనా ధోరణి ప్రగతికి అవరోధంగా గమనించాను. అందుకే చదివిన వెంటనే స్పందించాను. స్పందించడానికి ఈ-తెలుగు సభ్యుడు అవ్వాల్సిన అవసరం లేదనుకున్నాను… ఎందుకంటే వారి కార్యకలాపాలు గమనిస్తున్నాను కాబట్టి, నేను కూడా ఈ-తెలుగు సభ్యుడుని కావాలనుకుంటున్నాను కాబట్టి.

  8. @ దిలీప్,
    మీరు నా మనసు నొప్పించిన సంగతి నిజమే. నా వ్యాఖ్యపై మీరు ఇలా (ఇంత త్వరగా) స్పందిస్తారని ఊహించలేదు! మీ మంచి హృదయానికి నా ధన్యవాదములు.

    ఏదో అప్పుడు మీమీద మండి ఈ-తెలుగు వారిని మాత్రమే అడిగానని వ్రాసాను :)

  9. శరత్ గారు – అక్కడా ఇక్కడా ఇ-తెలుగు మీద బురద చల్లటం(మీరు కాదు) గమనించి రాసినదే పై వ్యాఖ్య. ప్రత్యేకించి మిమ్మల్ని ఉద్దేశించి కాదు. “తాలిబాన్” పార్టు మాత్రం చదువుకుని మిగతాది వదిలెయ్యొచ్చు :)

  10. @ సి బి రావు గారూ,
    ఈ-తెలుగు నిర్మాణములో, మూల స్తంభాల్లో మీరూ ఒకరని ఈ టపా చూసాకే తెలిసింది. సంతోషం. ఇప్పటిదాకా చదువరి & కో వారు మాత్రమే అనుకున్నాను.

  11. పీఠాధిపతుల్లాగా వ్యవహరిస్తున్న కొందరు ఏర్పాటుచేసుకున్న వారిదేనేనేమో ఈ-తెలుగు అని అపార్ధం చేసుకొని ఈ-తెలుగు మీద కొన్ని వ్యాఖ్యలు చేసాను. నా వ్యాఖ్యలు ఎవరినయినా నొప్పిస్తే క్షమించండి. ఇకనుండీ ఈ-తెలుగును, ఆయా వారి భావాలను విడిగా చూసేందుకు ప్రయత్నిస్తాను.

    ఇకపోతే తెలుగుకు నావంతు కృషిగా నా శృంగారం సామ్రాజ్యం/సమూహం లో కూడా బాగా ప్రాధాన్యతను ఇస్తున్నాను. తెలుగు వాడాల్సిందిగా బాగా ప్రోత్సహిస్తున్నాను. అందులో ప్రస్తుతం దాదాపుగా 400 మంది సభ్యులు వున్నారు. మీ వ్యక్తిగత భావాలని దాటి ఈ నా చిన్నపాటి ప్రయత్నాన్ని గుర్తించగలరా మీరు (అంటే సైటు చూడమని కాదు)? తెలుగుకి ఎక్కడ ప్రాధాన్యం వున్నా హర్షిస్తారా మీరు?

  12. ఈ-తెలుగుకి శ్రీకాకుళంలో బ్రాంచ్ తెరవండి. ఇక్కడ చాలా మందికి యూనికోడ్ గురించి తెలియదు. నాకు కూడా దుప్పల రవి చెప్పిన తరువాతే తెలిసింది. అంతకు ముందు నేను అను స్క్రిప్ట్స్ సాఫ్ట్ వేర్ ద్వారా పేజ్ మేకర్, ఫొటోషాప్ లలో తెలుగు చేసేవాడిని. ఇప్పుడు నేను లైనక్స్ లో కూడా తెలుగులో చెయ్యగలుగుతున్నాను కానీ మా జిల్లాలో చాలా మంది కంప్యూటర్ యూజర్స్ కి యూనికోడ్ గురించి తెలియకపోవడం గమనించాను.

  13. శ్రీకాకుళంలోనే కాదు, రాష్ట్రంలో చాలా మందికి యూనికోడ్ గురించి తెలియదు. యూనికోడ్ ఆర్.టి.ఎస్. టైపింగ్ చాలా సులభం అని కూడా తెలియదు. అను స్క్రిప్ట్ కీబోర్డ్ మోడల్స్ లో లాగా యూనికోడ్ టైపింగ్ కూడా కష్టమనుకుంటారు.

    1. ముందు చిన్న వృత్తం గీయండి, ఆ తరువాత దాని వ్యాసం పెంచుకోవచ్చు.

      ఇంతకీ శ్రీకాకుళం తెలుగు ఎప్పుడు మొదలు పెడుతున్నారు?కేవలం సైబర్ కేఫ్ లలో ప్రచారం చేసినా చాలు చాలా ఉపయోగపడుతుంది. కూడలిని అన్ని సైబర్ కేఫ్ లలో ఓ వారం రోజులు హోం పేజీ చెయ్యండి.

      లేఖిని, కూడలి లింకులతో పాంప్లేట్లు పంచండి.

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.