తెలుగులో వర్డ్‌ప్రెస్!

వర్డ్‌ప్రెస్ అనేది బ్లాగడానికి ఉపయోగపడే ఒక జాల అనువర్తనం. WordPress.com వద్ద చాలా కాలం నుండి తెలుగులో అందుబాటులో ఉంది. కానీ ఆ అనువాదాలు అసంపూర్ణంగానూ, కొన్నిచోట్ల తప్పులతోనూ, ఇంకొన్నిచోట్ల అసహజ వాక్యనిర్మాణం తోనూ ఉన్నాయి (వర్డ్‌ప్రెస్లో బ్లాగు పెట్టుము గుర్తుందా? ☺). అలానే స్వంత సైట్లలో స్థాపించుకునే వర్డ్‌ప్రెస్ (WordPress.org) కొన్నాళ్ళక్రితం వరకూ అధికారికంగా తెలుగులో అందుబాటులో లేదు. నేను కాస్త చొరవ తీసుకొని వర్డ్‌ప్రెస్ తెలుగు స్థానికీకరణకు నిర్వహణ హక్కులను పొందాను. ఆ తర్వాత … తెలుగులో వర్డ్‌ప్రెస్! ‌చదవడం కొనసాగించండి

ఓ వర్డ్‍ప్రెస్ చిట్కా: టపా రాసే పెట్టె ఎత్తు

మీ వర్డ్‍ప్రెస్ బ్లాగులో టపా రాసేప్పుడు ప్రతీ సారీ టపా పెట్టె ఎత్తు పెంచుకోవాల్సి వస్తుందా? పెంచుకోవాల్సిరావచ్చు. ఎందుకంటే, డీఫాల్టుగా ఆ పెట్టె యొక్క ఎత్తు కేవలం 10 లైన్లు ఉంటుంది. (తెరపట్టు చూడండి) చిన్న చిన్న టపాలు రాసే నాలాంటి వాళ్ళకిది సరిపోతుంది. చాలా బ్లాగర్లకి టపా రాసే పెట్టె యొక్క ఎత్తుని పెంచుకోవాల్సివస్తుంది. కానీ ఈ డీఫాల్టు ఎత్తుని మనం పెంచుకోవచ్చు. అందువల్ల ప్రతీ టపాకి ఈ పెట్టె ఎత్తుని పెంచుకునే పని తప్పుతుంది. … ఓ వర్డ్‍ప్రెస్ చిట్కా: టపా రాసే పెట్టె ఎత్తు ‌చదవడం కొనసాగించండి