ఇన్‌స్క్రిప్ట్+ పూర్తిస్థాయి తెలుగు కీబోర్డు లేయవుటు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న లిపులన్నింటినీ కంప్యూటర్లలో ఉపయోగించుకునేందుకు వీలుగా యూనికోడ్ కన్సార్టియమ్ అన్ని అక్షరాలకూ స్థిరమైన సంకేతబిందువులను కేటాయిస్తుంది. వీటిల్లో ప్రస్తుతం వాడుకలో ఉన్న అక్షరాలే కాకుండా, కాలగతిలో కలిసిపోయిన అక్షరాలు కూడా ఉంటాయి. పురాతన గ్రంథాలను సాంఖ్యీకరించడానికి ప్రాచీన అక్షరాల/గుర్తుల అవసరం ఉంటుంది కదా. ఇవన్నీ యూనికోడ్ ప్రమాణంలో ఉన్నంత మాత్రన అంతిమ వాడుకరులకు అందుబాటులో ఉండకపోవచ్చు. ఎందుకంటే, వాటిని టైపు చెయ్యడానికి ఒక పద్ధతో పరికరమో కావాలి కదా!

భారతీయ భాషలకు సంబంధించి యూనికోడ్ 6.0 ప్రమాణంలో ఉన్న అన్ని అక్షరాలను టైపు చెయ్యగలిగే విధంగా, C-DAC వారు గతంలో రూపొందించిన ఇన్‌స్క్రిప్ట్ కీబోర్డు అమరికను మెరుగుపరిచి నిరుడు విస్తృత ఇన్‌స్క్రిప్ట్ కీబోర్డు అమరికను ప్రతిపాదించారు. (ఈ పేజీలో “Enhanced INSCRIPT standard (Proposed)” అన్న లంకె నుండి వారి ప్రతిపాదనను దించుకోవచ్చు.)

ఈ ప్రతిపాదన అధారంగా నేను ఇన్‌స్క్రిప్ట్+ అని తెలుగు కీబోర్డు అమరికను తయారుచేసాను. ఇలా ఉంటుందది:
ఇన్‌స్క్రిప్ట్+, విస్తృత తెలుగు కీబోర్డు అమరిక

చదవడం కొనసాగించండి

తెలుగు బ్లాగర్లకై అనుపమ టైపింగ్ ట్యూటర్ ధర 40% తగ్గింపు

అనుపమ వారు తమ టైపింగ్ ట్యూటరుని 40% తగ్గింపు ధరకే అందిస్తున్నామని ప్రకటించారు. ఈ అవకాశం తెలుగు బ్లాగర్లకి మాత్రమేనంట!

ఎలా: ఆపిల్ కీబోర్డు అమరికతో యూనికోడ్ టైపు చెయ్యడం

తెలుగు టైపు చెయ్యడానికి ఉన్న కీబోర్డు అమరికలలో మాడ్యులర్, ఇన్‌స్క్రిప్టుల తర్వాత ఆపిల్ అమరికదే అగ్రస్థానం (RTSని పట్టించుకోకపోతే).

ఇప్పుడు ఆపిల్ కీబోర్డు అమరికతో కూడా యూనికోడ్ తెలుగుని టైపు చెయ్యవచ్చు. పూర్తి వివరాలు చూడండి.

ఇన్‌స్క్రిప్ట్ చిట్కాలు

తెలుగు కీబోర్డు లేఔట్లపై సౌమ్య టపా మరియు తెలుగుబ్లాగు సమూహాంలో కొందరడిగిన సందేహాలు కలిపి ఈ టపా రాయడానికి నాకు ప్రేరణనిచ్చాయి.

మొదట, కీబోర్డు లేఔట్ అన్నది ఎవరికివారి వ్యక్తిగత ఎంపిక. నేను ఇన్‌స్క్రిప్ట్‌కి ఎందుకు మారానంటే నాకు RTS బాగా వచ్చేసింది కాబట్టి! ఇంకందులో మజాలేదు, కొత్తది నేర్చుకుందామని. మీరు ఇన్‌స్క్రిప్ట్‌కి మారాలంటే, మీ కారణాలు మీరు వెతుక్కోండి.

మీరు ఇన్‌స్క్రిప్ట్ నేర్చుకోవాలనుకుంటే, మీకోసం కొన్ని చిట్కాలు. మీఅంత మీరే శోధించి సాధించాలనుకునే తత్వంమీదైతే, మీకిది అవసరం.

ఇన్‌స్క్రిప్ట్‌ని ఇంగ్లీషు లేఔట్‌తో ముడి పెట్టడమనేది ఇన్‌స్క్రిప్ట్ నేర్చుకునేవారు చేసే మొదటి పొరపాటు మరియు వదులుకోవాల్సిన మొదటి అలవాటు. “ర” రాయాలంటే j అక్షరం టైపుచేయాలి అని గుర్తుంచుకోకూడదు. కుడిచేతి చూపుడువేలును వొత్తాలి అని గుర్తుపెట్టుకోవాలి. ఇది మొదటి నియమం. ఉన్న నియమం కూడా ఇదొక్కటే! పెద్దలమాట చద్దిమూట. మరొక్కసారి నా మాటల్లో:

Rule 1: Don’t try to remember keys; remember their positions.

మీరు ఇన్‌స్క్రిప్ట్‌లో టైపు చేస్తున్నప్పుడు మీ మదిలో తెలుగు అక్షరాల లేఔట్ ఉండాలి. ఇంగ్లీషులో టైపు చేస్తున్నప్పుడు ఇంగ్లీషు అక్షరాల లేఔట్ ఉండాలి. అప్పుడు మీరు టైపింగులో మంచి వేగం సాధించగలుగుతారు. ఇంగ్లీషు లేఔట్‌తో తెలుగు అక్షరాలను గుర్తుపెట్టుకోవడం మొదలుపెడితే మీ ఇంగ్లీషు మరియు తెలుగు టైపింగుల వేగం ప్రతికూలంగా ప్రభావితమౌతుంది. మీరు టైపుచేస్తున్నప్పుడు రెండు లేఔట్లు (మీ మదిలో) కలగలిసిపోయి ఒకదానిబదులు ఇంకొకటి టైపుచేసి ఆ తప్పులు సరిదిద్దుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది (మొదట్లో నాకు పట్టింది).

ఇన్‌స్క్రిప్ట్‌లో ఫలానా అక్షరం ఎలా టైపుచెయ్యాలి అని ఎవరైనా నన్ను అడిగితే, నేను మొదట ఆ కీ స్థానం గుర్తుతెచ్చుకుని, ఆ స్థానంలో ఇంగ్లీషుకి ఏ కీ ఉంటుందో చెప్తా. అవును, పై నియమం నేను అనుసరించిన తర్వాతే చెప్తున్నా.

ఒక్కసారి కీల స్థానాలమీద పట్టు సాధించాకా, వేగంగా టైపు చేయడమనేది ఇన్‌స్క్రిప్ట్‌ లోఔట్‌తో చాలా సులభమౌతుంది.

నాకైతే ఇన్‌స్క్రిప్ట్‌ లేఔట్‌తో తక్కువ నొక్కులతో టైపుచేయగల్గుతున్నాననిపిస్తుంది. ఇంకా తర్వాత టైపు చెయ్యాల్సిన కీ వేలి క్రిందే ఉన్నట్టు అనిపిస్తుంది. (సరే చాలా అతిగా చెప్పేసాననుకోండి.)

ఆనంద ఇన్‌స్క్రిప్ట్ లేఖనం.