మీకు నచ్చిన తెలుగు టైపింగ్ విధానానికి వోటు వేసారా? ఇప్పుడే వెయ్యండి మరి.
Tag: Telugu
మీ తెలుగు బ్లాగు/సైటు ఇక్కడ ఉందా?
మీ తెలుగు బ్లాగు లేదా వెబ్ సైటు ఈ క్రింది సైట్లలో ఉందా? Delicious Ma.gnolia StumbleUpon Ximmy మీ తెలుగు బ్లాగు లేదా సైటు కొత్తవారిని చేరుకోవడానికి ఇవి ఓ మార్గం.
ఎలా: ఆపిల్ కీబోర్డు అమరికతో యూనికోడ్ టైపు చెయ్యడం
తెలుగు టైపు చెయ్యడానికి ఉన్న కీబోర్డు అమరికలలో మాడ్యులర్, ఇన్స్క్రిప్టుల తర్వాత ఆపిల్ అమరికదే అగ్రస్థానం (RTSని పట్టించుకోకపోతే). ఇప్పుడు ఆపిల్ కీబోర్డు అమరికతో కూడా యూనికోడ్ తెలుగుని టైపు చెయ్యవచ్చు. పూర్తి వివరాలు చూడండి.
కొత్త తెలుగు ఫాంటు: ఇండోలిపి వారి e-Telugu
ఇండోలిపి (INDOLIPI) అనేది భారతీయవేత్తలకు (Indologists) మరియు భాషావేత్తలకు ఉద్దేశించిన బహుళ ప్రయోజనకారక పరికరాల సముదాయం. దీనిలో చాలా భారతీయ భాషల ఫాంటులతో బాటు ఇతర ఉపయుక్త మృదులాంత్ర పరికరాలు కూడా ఉన్నాయి. (పూర్తి వివరాలు వారి సైటులో చదవండి.) వారి వద్ద ఓ తెలుగు ఫాంటు కూడా ఉంది. దాని నమూనా ఇదిగో: ఈ తెలుగు ఫాంటు మరియు ఇతర భారతీయ భాషలు ఫాంటులని ఇక్కడ నుండి (పేజీలో అడుగున లింకులు ఉన్నాయి) దిగుమతి చేసుకోవచ్చు. … కొత్త తెలుగు ఫాంటు: ఇండోలిపి వారి e-Telugu చదవడం కొనసాగించండి
నా చేతిరాత
ఆగష్టు నెల తెలుగు బ్లాగర్ల సమావేశపు విశేషాలు లోని 2(2)వ అంశానికి స్పందనగా నా చేతిరాత.