వ్యాసంలో లేదా కథలో మొదటి అక్షరాన్ని పెద్దగా ప్రత్యేకంగా చూపించడం ముద్రణారంగంలో ఒక సాంప్రదాయం. జాలంలో కూడా ఇలా సింగారించడానికి జనాలు పలు పద్ధతులు వాడుతున్నారు, వాటిలో ప్రముఖంగా చెప్పుకోదగ్గది మొదటి అక్షరాన్ని ప్రత్యేక మార్కప్ ద్వారా గుర్తించడం. CSS ::first-letter సూడో-మూలకాన్ని అన్ని ఆధునిక జాల విహారిణులూ అమలుపరిచాకా, డ్రాప్ క్యాప్ అలంకరణకు అదే తేలిక మార్గం అయ్యింది. ఉదాహరణకు, ప్రతీ పేరాలో మొదటి అక్షరాన్ని పెద్దగా చూపించడానికి ఈ క్రింది CSS నియమాన్ని వాడుకోవచ్చు: … CSS3 & తెలుగు: డ్రాప్ క్యాప్ శైలి చదవడం కొనసాగించండి
Tag: Telugu
మొబైళ్ళలో తెలుగు → తెలుగులో మొబైళ్ళు
టూకీగా… ముందుగా తెలుగు మొబైళ్ళ కోసం నేను మొదలుపెట్టిన పిటిషనుకు స్పందించి దానిపై సంతకం చేసి, దాన్ని తమ మిత్రులతో పంచుకున్న వారందరికీ కృతజ్ఞతలు! మీ అందరివల్లా మొదటి వారంలోనే 200 సంతకాలు దాటాయి. ఇక దీన్ని మరింత మందికి చేర్చే ప్రయత్నం చేద్దాం. ఈ విన్నపంపై మీరింకా సంతకం చేసివుండకపోతే, ఇప్పుడే వెళ్ళి సంతకం చేయండి. దీన్ని మీ మిత్రులతోనూ, మీకు తెలిసిన మొబైల్ కంపెనీల సిబ్బంది తోనూ పంచుకోండి. చేతిఫోన్లను తెలుగులో ఉపయోగించుకోవడంలో ఇబ్బందులుంటే, … మొబైళ్ళలో తెలుగు → తెలుగులో మొబైళ్ళు చదవడం కొనసాగించండి
ఇన్‌స్క్రిప్ట్+ పూర్తిస్థాయి తెలుగు కీబోర్డు లేయవుటు
ప్రపంచవ్యాప్తంగా ఉన్న లిపులన్నింటినీ కంప్యూటర్లలో ఉపయోగించుకునేందుకు వీలుగా యూనికోడ్ కన్సార్టియమ్ అన్ని అక్షరాలకూ స్థిరమైన సంకేతబిందువులను కేటాయిస్తుంది. వీటిల్లో ప్రస్తుతం వాడుకలో ఉన్న అక్షరాలే కాకుండా, కాలగతిలో కలిసిపోయిన అక్షరాలు కూడా ఉంటాయి. పురాతన గ్రంథాలను సాంఖ్యీకరించడానికి ప్రాచీన అక్షరాల/గుర్తుల అవసరం ఉంటుంది కదా. ఇవన్నీ యూనికోడ్ ప్రమాణంలో ఉన్నంత మాత్రన అంతిమ వాడుకరులకు అందుబాటులో ఉండకపోవచ్చు. ఎందుకంటే, వాటిని టైపు చెయ్యడానికి ఒక పద్ధతో పరికరమో కావాలి కదా! భారతీయ భాషలకు సంబంధించి యూనికోడ్ 6.0 … ఇన్‌స్క్రిప్ట్+ పూర్తిస్థాయి తెలుగు కీబోర్డు లేయవుటు చదవడం కొనసాగించండి
తెలుగు అంతర్జాల సదస్సుపై నా నివేదిక
ఈ శనివారం హైదరాబాదు లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (MCRHRD) లో జరిగిన తెలుగు అంతర్జాల సదస్సు గురించి మీకు ఇప్పటికే తెలిసివుంటుంది. ఆ సదస్సుపై నా నివేదిక ఇది. ఇది అసంపూర్ణమే. ఆ ఆనందోత్సాహలూ ప్రేరణా ఈ టపాలో ప్రతిబింబించకపోవచ్చు. ఈ సదస్సుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమాచార సాంకేతిక శాఖ సౌజన్యంతో సిలికానాంధ్ర నిర్వహించింది. ఈ సదస్సులో రాష్ట్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యగారు ముఖ్య అతిథిగానూ, మాజీ … తెలుగు అంతర్జాల సదస్సుపై నా నివేదిక చదవడం కొనసాగించండి
గణతంత్ర దినోత్సవ కానుక: ఇన్‌స్క్రిప్ట్ లేఖిని
నా దృష్టిలో ఇన్‌స్క్రిప్ట్ అన్నది తెలుగులో టైపుచెయ్యడానికి అత్యుత్తమైన పద్ధతి. కాకపోతే, కొత్త వారికి దాన్ని నేర్చుకోవడమే కాస్త కష్టం (… అన్న భావన అంతే). ఇన్‌స్క్రిప్ట్ నేర్చుకునే వారికి ఉపయోగంగా ఉండాలన్న ప్రధాన ఉద్దేశం తోనూ, ఎప్పుడైనా ఇతరుల కంప్యూటర్లో త్వరగా టైపు చెయ్యాల్సి/చేసుకోవాల్సి వచ్చినప్పుడు (ఇన్‌స్క్రిప్ట్ స్థాపించే సమయం తీరికా లేనప్పుడు టైపు చేసుకోడానికి) వీలుగా ఉండాలన్న అనుబంధ ఉద్దేశంతోనూ దీన్ని తయారు చేసాను.
తెలుగు వికీపీడియా అకాడమీ (జాలంలో)
వికీపీడియా అకాడమీ గురించి ఇటీవలే అర్జున రావు ఓ టపా రాసారు. ఆయన మాటల్లోనే: వికీపీడియాని చాలా మంది చదవడానికి మాత్రమే వాడుతున్నారు. దానిలో ఎవరైనా సమాచారం చేర్చవచ్చని ఎంతమందికి తెలుసు. తెలిసినా ఎంతమంది చేస్తున్నారు.తెలుగు మరి ఇతర భారతీయ భాషలలో వ్యాసాలు తక్కువగా వుండటానికి చాలా అటంకాలు ఉన్నప్పటికి, వికీపీడియా గురించి, దానిలో సమాచారం ఎలా చేర్చవచ్చో తెలియక పోవడమే పెద్ద ఆటంకం. దానిని తొలగించటానికి ఉద్దేశించిందే వికీపీడియా అకాడమీ. ఈ విధమైన వికీపీడియా అకాడమీ … తెలుగు వికీపీడియా అకాడమీ (జాలంలో) చదవడం కొనసాగించండి
డాట్‌క్లియర్ (ఒక బ్లాగింగ్ ఉపకరణం) ఇప్పుడు తెలుగులో!
డాట్‌క్లియర్ అనేది ఒక బ్లాగింగ్ ఉపకరణం. ఇది బహిరంగాకరం (open source). మన స్వంత గూళ్ళలో దీన్ని స్థాపించుకోవచ్చు. దీనిలోని ప్రత్యేక సౌలభ్యాలు నాకు తెలిసినవి (ఓ రెండు గంటల ఉపయోగం తర్వాత) ఇవీ: ఒకే స్థాపనలో బహుళ బ్లాగులని సృష్టించుకోవచ్చు. టపాలను వికీ చంధస్సు (syntax) లో కూడా (WYSIWYG లేదా (X)HTML పద్ధతులతో పాటుగా) వ్రాసుకోవచ్చు. దీన్ని తయారీదార్లు ఫ్రెంచి వాళ్ళు. దీన్ని తెలుగులోనికి నేను అనువదిస్తున్నాను (ఫ్రెంచి నుండి కాదు). తెలుగులో పరీక్షా … డాట్‌క్లియర్ (ఒక బ్లాగింగ్ ఉపకరణం) ఇప్పుడు తెలుగులో! చదవడం కొనసాగించండి
ఓపెరా విహారిణి, ఇప్పుడు తెలుగులో కూడా!
ఈ రోజే (అక్టోబర్ 8న) ఓపెరా తన విహారిణి యొక్క 9.60 కూర్పుతో బాటుగా తెలుగు పాఠాంతరాన్ని కూడా విడుదల చేసింది. ఇది నిజంగా బ్రహ్మాండమైన వార్త! ఓపెరా జిందాబాద్!! ఓపెరా వారికి భారత దేశపు సైటు కూడా ఉంది, కానీ అది హిందీలో మాత్రమే లభ్యమవుతున్నట్టుంది. దిగుమతి లింకు: opera.com/download (అక్కడ Telugu భాషని ఎంచుకోండి) స్థాపన ప్రక్రియ అంతా కూడా ఆంగ్లంలోనే ఉంది. ఒక్కసారి స్థాపనమైన తర్వాత తెలుగందుకుంటుంది. అయితే చాలా వరకు తెలుగు … ఓపెరా విహారిణి, ఇప్పుడు తెలుగులో కూడా! చదవడం కొనసాగించండి
తెలుగు బ్లాగర్లకై అనుపమ టైపింగ్ ట్యూటర్ ధర 40% తగ్గింపు
అనుపమ వారు తమ టైపింగ్ ట్యూటరుని 40% తగ్గింపు ధరకే అందిస్తున్నామని ప్రకటించారు. ఈ అవకాశం తెలుగు బ్లాగర్లకి మాత్రమేనంట!
నేటి లింకు
తెలుగు సేవ చేయాలి, సెలవిప్పించండి. స్వచ్ఛంద పదవీవిరమణకు ఐ.పీ.ఎస్. అధికారి దరకాస్తు (వయా)