డిసెంబర్ రెండవ ఆదివారం తెలుగు బ్లాగుల దినోత్సవం. మీ ఊళ్ళో ఏం చేస్తున్నారీసారి? ఇంకో నెల ఉందనుకోండి. కానీ ఇప్పటినుండే, స్కెచ్చు గీయండి. డిసెంబర్ 17 నుండి 27 వరకూ, భాగ్యనగరంలో పుస్తక ప్రదర్శన!. ఈ ప్రదర్శనలో ఒక స్టాలు కోసం e-తెలుగు సన్నాహలు చేస్తుంది (పుస్తకాలు అమ్మడానికి కాదు, కంప్యూటర్లలోనూ జాలంలోనూ తెలుగు చూడొచ్చని రాయొచ్చనీ, తెలుగు బ్లాగులు ఉన్నాయనీ, తెలుగులో వికీపీడియా ఉందనీ సందర్శకులకి చెప్పడానికి). మీడియావికీ తెలుగు అనువాదాలు 100% పూర్తయ్యాయి. (కానీ … ఏం జరుగుతోంది… చదవడం కొనసాగించండి
Tag: localization
డాట్క్లియర్ (ఒక బ్లాగింగ్ ఉపకరణం) ఇప్పుడు తెలుగులో!
డాట్క్లియర్ అనేది ఒక బ్లాగింగ్ ఉపకరణం. ఇది బహిరంగాకరం (open source). మన స్వంత గూళ్ళలో దీన్ని స్థాపించుకోవచ్చు. దీనిలోని ప్రత్యేక సౌలభ్యాలు నాకు తెలిసినవి (ఓ రెండు గంటల ఉపయోగం తర్వాత) ఇవీ: ఒకే స్థాపనలో బహుళ బ్లాగులని సృష్టించుకోవచ్చు. టపాలను వికీ చంధస్సు (syntax) లో కూడా (WYSIWYG లేదా (X)HTML పద్ధతులతో పాటుగా) వ్రాసుకోవచ్చు. దీన్ని తయారీదార్లు ఫ్రెంచి వాళ్ళు. దీన్ని తెలుగులోనికి నేను అనువదిస్తున్నాను (ఫ్రెంచి నుండి కాదు). తెలుగులో పరీక్షా … డాట్క్లియర్ (ఒక బ్లాగింగ్ ఉపకరణం) ఇప్పుడు తెలుగులో! చదవడం కొనసాగించండి
వివిధ ఉపకరణాల తెలుగీకరణ, జాలంలో!
కొన్నాళ్ళ కిందట పొద్దులో నేను జాలంలో శ్రమదానం అనే శీర్షికతో ఓ సంపాదకీయం రాసాను. దానికి కొనసాగింపుగా మరిన్ని వివరాలతో ఒక్కో అంశాన్ని సృషిస్తూ మరికొన్ని టపాలు రాయాలనుకుంటున్నాను. స్థానికీకరణల గురించి నేను రాసిన మరో టపాకి ఇది పరిచయం. జాలంలో మనం తోడ్పడదగ్గ పనుల్లో వివిధ మృదూపకరణాలని తెలుగులోనికి స్థానికీకరించడం (లేదా తెలుగీకరణ) అనేది ఒకటి. ఆయా ఉపకరణాలు వాడే సాంకేతికతలని బట్టి వాటి స్థానికీకరణ ప్రక్రియల సరళత లేదా క్లిష్టత ఉంటుంది. స్థానికీకరణ ప్రక్రియలలోని … వివిధ ఉపకరణాల తెలుగీకరణ, జాలంలో! చదవడం కొనసాగించండి
ఐడెంటికా: ఓ మైక్రోబ్లాగింగ్ సేవా గూడు
ఐడెంటికా అనేది ఓ మైక్రోబ్లాగింగ్, సోషల్ నెట్వర్కింగ్ సైటు. దీనిలో 140 అక్షరాలకు మించని పాఠ్య సందేశాలను (టపాలుగా) రాసుకోవచ్చు. ఇదుగోండి నా ఐడెంటికా పేజీ. దీనిలోని విశేషాలు: మన మెసెంజర్ నుండి కూడా సందేశాలు రాయవచ్చు. మీ మిత్రుల తాజా సందేశాలని మీ సెల్ ఫోనులోనూ అందుకోవచ్చు. ఇతర మైక్రోబ్లాగింగు (ట్విట్టర్, జైకు లాంటి) గూళ్ళనుండి సందేశాలను ఈ సైటులో సంగ్రహించుకోవచ్చు. ఇది లాకోనికా అనే ఓపెన్ సోర్సు (బహిరంగాకర) మృదు పరికరంపై ఆధారపడుతుంది. కనుక … ఐడెంటికా: ఓ మైక్రోబ్లాగింగ్ సేవా గూడు చదవడం కొనసాగించండి
ఫ్యూయల్ తెలుగు: పరిచయం
మనం పలు ప్రాజెక్టులకి పలు చోట్ల అనువాదాలు చేస్తున్నాం. అలాంటప్పుడు ఒకే పదానికి ఒక ప్రాజెక్టులో అనువాదాలకీ మరో ప్రాజెక్టులోని అనువాదాలకి పొంతన లేకుండే అవకాశం ఉంది. అలానే, ఒకే ప్రాజెక్టులో వేర్వేరు అనువాదకులు చేసిన అనువాదాలు భిన్నంగా ఉండవచ్చు. ఉదాహరణకి, user అన్న పదానికి ఓ చోట వాడుకరి అని వాడి ఉండవచ్చు, అదే ప్రాజెక్టులో మరోచోట వియోగదారుడనో మరోటో వాడి ఉండవచ్చు. మృదుపరికరాల స్థానికీకరణలలో తరచూ వాడే పదాలలో ఇలాంటి అనియతత్వత (inconsistency) రాకుండా … ఫ్యూయల్ తెలుగు: పరిచయం చదవడం కొనసాగించండి
వర్డ్ప్రెస్.కామ్ ఇప్పుడు తెలుగులో
వర్డ్ప్రెస్.కామ్ ఇప్పుడు తెలుగులో కూడా లభ్యమవుతుంది. మీ బ్లాగు ఎంపికలలో భాషను తెలుగుగా ఎంచుకుని ఉంటే, మీ బ్లాగును తెలుగులో చూడవచ్చు. మీ బ్లాగు నిర్వహణ గట్రా అంతా ఇక తెలుగులోనే. అయితే, ఈ అనువాదాలలో కొన్ని దోషాలున్నాయి. మరికొన్ని అందరికీ అర్ధం కాకపోవచ్చు. మరికొన్ని ఇంకా అనువాదం చెయ్యాల్సినవి ఉన్నాయి. వర్డ్ప్రెస్ తెలుగు స్థానికీకరణను మెరుగుపరచడానికి మీ వంతు తోడ్పాటునందించండి. అనువాదం కానివాటిని వర్డ్ప్రెస్ అనువాద వెబ్ సైటులో అనువదించవచ్చు. (మీకు వర్డ్ప్రెస్.కామ్ ఖాతా ఉండాలి.) … వర్డ్ప్రెస్.కామ్ ఇప్పుడు తెలుగులో చదవడం కొనసాగించండి