స్వేచ్ఛ లినక్సు తో ప్రయోగం

తొలి తెలుగు కంప్యూటర్ నిర్వాహక వ్యవస్థ స్వేచ్ఛ లినక్సు ని ఈరోజు మొదటిసారి ఉపయోగించా. మీ కోసం ఆ చిత్రావళి.

లైవ్ సి.డి. ఉపయోగించి కంప్యూటర్ని ప్రారంభించగానే, తెలుగా, ఇంగ్లీషా కోరుకోమంటుంది.

Choose Language

తెలుగుని ఎంచుకున్నాకా కొంత అంతర్గత ప్రక్రియ తర్వాత, స్వేచ్ఛ లోడింగ్ తెర కనిపిస్తుంది.

 Loading

ఆ తర్వాత స్వేచ్ఛ డెస్క్‌టాప్ ప్రత్యక్షమవుతుంది.

 Desktop

ఫైర్‌ఫాక్స్ తెరిచి తెలుగెలా కనిపిస్తుందో చూద్దాం. (UI కూడా తెలుగులో)

Firefox showing Telugu

ప్యానల్ కి చేర్పులని జోడించే పేటిక

Add to Panel Dialog

టెక్స్ట్ ఎడిటర్

Text Editor

స్వేచ్ఛ లినక్సు తెలుగుని చదువుతుందంటకూడా. మిథ్యాయంత్రంలో ధ్వని రావడంలేదు. ఓసారి ప్రత్యక్షంగా ప్రయత్నించి చూడాలి. UI అనువాదంలో తెలుగు బ్లాగర్ల తోడ్పాటు అవసరం. కొన్నయితే, అర్థంచేసుకోలేకపోయా.

లైవ్ సి.డి. కాబట్టి ఎటువంటి జంకులేకుండా మీరూ మీ కంప్యూటర్లపై ప్రయత్నించవచ్చు.

స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్

ఏదైనా ఓక ప్రోగ్రాం యొక్క వినియోగదారులు ఈ క్రింద చెప్పిన అన్ని స్వాతంత్ర్యాలని కలిగిఉంటే ఆ ప్రోగ్రాంని స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్ అనవచ్చు.

 1. ఆ ప్రోగ్రాంని ఉపయోగించుకొనే స్వేచ్ఛ
 2. ఆ ప్రోగ్రాం ఎలా పని చేస్తుందో అధ్యయనం చేసి దాన్ని అవసరానికి అనుగుణంగా తీర్చిదిద్దుకొనే స్వేచ్ఛ.
 3. ఆ ప్రోగ్రాం ని పునఃపంపిణీ చేయగలిగే స్వేచ్ఛ (మీ పక్కింటతనికి మీరు సహాయం చెయ్యవచ్చు.)
 4. ఆ ప్రోగ్రాం ని మెరుగుపరిచే, మరియు మీ మెరుగుల్ని జనులందరికీ అందించగల్గే స్వేచ్ఛ (సమాజం అంతా లబ్ధి పొందుతుంది.)

(2 మరియు 4వ స్వేచ్ఛలకి ఆ ప్రోగ్రాం యొక్క మూల సంకేతం (source code) వినియోగదారునికి అందుబాటులో ఉండాలి.)

అంటే స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్ ప్రోగ్రాం యొక్క కాపీలని యథాతధంగా గానీ, లేదా మార్పులతో గానీ, ఉచితంగా గానీ, రొక్కమునకు గానీ, ఎవరికైనా, ఎప్పుడైనా మీరు అందిచవచ్చు. ఇవన్నీ చేయగల్గడానికి మీకు ఎవరి అనుమతి అవసరం లేదు, మీరెవరికీ ఏమీ చెల్లించనవసరం లేదు.

మీరు ఒక స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్ ని పైకానికి కొని ఉండవచ్చు, లేదా ఉచితంగానైనా పొంది ఉండవచ్చు. మీరు ఎలా పొందారు అన్నదాంతో సంబంధం లేకుండా, దాన్ని కాపీ చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు, కాపీలని అమ్ముకోవచ్చు కూడా.

సుప్రసిద్దమైన వెబ్ విహరిణి ఫైర్‌ఫాక్స్ మరియు ఓపెన్ఆఫీస్ లు స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్లకి ఉదాహరణలు.

గమనిక: గ్నూ వారి స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్ నిర్వచనం నుండి సంగ్రాహ్యం.

Lekhini launches

I am very pleased to announce the launch of Lekhini (లేఖిని), a simple online Telugu script generator. It transforms your input (in RTS) into Unicode. The script generated in Lekhini can be used in the following places:

 • e-mails
 • web pages & blogs
 • instant messaging
 • and wherever there is Unicode support

Lekhini is based on Padma (పద్మ), another text transformer that works for most of the South Indian languages and supports more input and output formats. While all the hardwork is of the Padma developers, I just tweaked it to make it simple and easy for users.

Lekhini‘s objective is to be a simple Telugu script generator. In the process of buiding it, I cleaned up some of the things in Padma that are not always required or that are a bit overwhelming to novice users.

The following are the advantages of my simplification:

 • No need to scroll down in search of a text box to type in (The input box is right on top. Just type in after the page load.)
 • You do not see options and settings that you never use (You will see just what you need.)
 • The 3-window operation (type in one, copy in another, and paste in yet another) has been reduced to 2-window operation. (type and copy in one, and paste in another).
 • An RTS Translitelation Chart beside your typing area—easy reference (to know what to type to get what).
 • No more Yahoo ads :-)

Go, play with it. If you find it useful, recommend it to your friends. Your feedback is welcome (veeven at gmail dot com).

Update 2006-03-19: Lekhini has improved.