పదహారేళ్ళ వయసు… పడిపడి లేచె మనసు…

లేఖినికి 16 ఏళ్ళు నిండాయి! పుట్టిన రోజు కానుకగా కొత్త సౌలభ్యాలతో లేఖిని ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంది! ఇప్పుడే ప్రయత్నించి చూడండి!! కొత్త విశేషాల మాలికే ఈ టపా: 💾 ఆటోసేవ్ దాదాపు లేఖిని మొదలయినప్పటినుండీ వాడుకరులు ఎక్కువగా అడిగిన సౌలభ్యం ఇదే. ఇక నుండి మీరు లేఖినిలో టైపు చేసేది ఆటోమెటిగ్గా మీ విహారిణిలోనే భద్రమవుతుంది. 🕙 చరిత్ర అనే బొత్తాన్ని నొక్కితే మీ పాత రాతలు కనిపిస్తాయి. వాటిలో ఒకదానిపై నొక్కితే అది … పదహారేళ్ళ వయసు… పడిపడి లేచె మనసు… ‌చదవడం కొనసాగించండి

లేఖినికి కొన్ని మెరుగులు

కరోనా కట్టడి కాలంలో లేఖినికి కొన్ని చిన్న మెరుగులు: ఇప్పుడు కంప్యూటర్లకు వెడల్పాటి తెరలు ఉంటున్నాయి. లేఖిని సహాయపు పట్టికని దాచేసి వాడుకునేవారికి, ఈ మూల నుండి ఆ మూల వరకూ పెట్టె ఉంటుంది. అంత పొడవుగా ఉన్నదాన్ని చదవడమూ ఇబ్బందే. మీ కంప్యూటర్ తెర మరీ వెడల్పాటిది అయితే గనక టెపు చేసే పెట్టె, తెలుగు పాఠ్యం వచ్చే పెట్టె రెండూ పక్కపక్కనే ఆటోమెటిగ్గా సర్దుకుంటాయి. తగినంత జాగా లేకపోతే, ఇంతకు మునుపు లానే ఒకదాని … లేఖినికి కొన్ని మెరుగులు ‌చదవడం కొనసాగించండి

బ్యానర్ మేనియా

లేఖినికి ఒకటి. (http://lekhini.org/banner728x90.png) కూడలికి ఒకటి. (http://veeven.com/koodali/banner728x90.png) లేఖినికి కూడలికి మీ వంతు ప్రచారంచేయడానికి మీ వెబ్‌సైట్లో ఈ బ్యానర్లని తగిలించండి. ఇతర సైజులు: లేఖిని: 120x600, 160x600, 250x250 కూడలి: 120x600, 160x600