నా పాడ్కాస్టు పేరు మాటల మూటలు. ఇది మన తెలుగు మాటల గురించి. మనం మర్చిపోతున్న తెలుగు మాటల్ని, అసలు మనం తెలుసుకోలేకపోయిన మాటలనూ, తిరిగి తెలుసుకునే ప్రయత్నంగా దీన్ని ఆరంభించాను. విన్న ప్రతీ ఒక్కరికీ, ఒక్కో భాగంలో ఒక్కో కొత్తమాట తెలిసినా అదే పదివేలు.

దీన్ని ఆపిల్ పాడ్కాస్ట్స్, గూగుల్ పాడ్కాస్ట్స్, స్పాటిఫై వంటి అన్ని రకాల పాడ్కాస్ట్ అనువర్తనాలలోనూ వినవచ్చు. లేదా నేరుగా జాలం లోనూ వినవచ్చు.
వినండి మరి! విని మీ ప్రతిస్పందనను తెలియజేయండి.
చదవడం కొనసాగించండి