హైదరాబాదులో ఫైర్‌ఫాక్స్ 3.5 సంబరాలకు ఆహ్వానం!

నా అభిమాన విహారిణి ఫైర్‌ఫాక్స్ యొక్క సరికొత్త కూర్పు 3.5 ఈ మధ్యే విడుదలయ్యింది. (మీకు ఈపాటికి తెలిసే ఉంటుంది.) ఫైర్‌ఫాక్స్ 3.5 లోని కొత్త సౌలభ్యాల గురించి చాలా వ్యాసాలు ఇప్పటికే జాలంలో తేలియాడుతున్నాయి చూడండి.

మొజిల్లా.కామ్ మొదటి పేజీ తెలుగులో!
మొజిల్లా.కామ్ మొదటి పేజీ తెలుగులో!

ప్రపంచవ్యాప్తంగా ఫైర్‌ఫాక్స్ 3.5 దింపుకోళ్ళు ఎలా జరుగుతున్నాయో చూడండి. అలానే ఫైర్‌ఫాక్స్ తాజా మార్కెట్ వాటా శాతాన్ని కూడా చూడండి.

హైదరాబాదులో సంబరాలు

గత ఏడాది లానే ఈ సారి కూడా ఫైర్‌ఫాక్స్ విడుదల సందర్భంగా హైదరాబాదులో ఫైర్‌ఫాక్స్ అభిమానులం కలుద్దాం రండి. ఆ వివరాలు:

తేదీ మరియు సమయం: ఆదివారం, జూలై 19, 2009 సాయంత్రం 3 గంటల నుండి 5 వరకు.

వేదిక: కృష్ణకాంత్ ఉద్యానవం, యూసఫ్ గూడ బస్తీ, హైదరాబాద్. (పటం)

ఏం చేస్తాం:

 • ఫైర్‌ఫాక్స్ 3.5 లోని కొత్త సౌలభ్యాల గురించి మాట్లాడుకుందాం
 • మీ మీ లాప్‌టాపులు (అంకోపరులు) తెస్తే, దానిలో మంటనక్క 3.5 ని స్థాపించి విశేషాలను అక్కడికక్కడే ప్రదర్శించవచ్చు.
 • మీ లాప్‌టాప్ మరియు మొబైల్ ఫోన్ల కోసం స్టిక్కర్లు, మీ కోసం ఫైర్‌ఫాక్స్ 3.5 బాడ్జీలు కూడా ఇస్తాం

మీరు ఫైర్‌ఫాక్స్ అభిమానులై, హైదరాబాదులో ఉంటే ఈ సంబరాలకి తప్పకుండా రండి.

ఆనంద జాలా జ్వాలనం!

ఫైర్‌ఫాక్స్ 3 ప్రపంచరికార్డులో మీరు పాల్గొనాలంటే…

(భారత కాలమానం ప్రకారం) ఈరోజు రాత్రి 10:30 నుండి రేపు రాత్రి 10:30 లోపు ఫైర్‌ఫాక్స్ 3ని దిగుమతి చేసుకోండి.

అప్పటి వరకు ఫైర్‌ఫాక్స్ 3 లోని విశేషాల గురించి తెలుసుకోండి.

మీరు ఇతర దేశాలలో ఉన్నట్లయితే, దిగుమతి చేసుకోవాల్సిన సమయం సుమారుగా 17:00 UTC (మీ నగరంలో ఆ సమయం). ఆ సమయం నుండి 24 గంటలలోపు దిగుమతి చేసుకోవచ్చు.

ఆనంద జాలా జ్వాలనం!

తాజా సమాచారం: మీ ప్రదేశం ప్రకారం ఏ సమయమో చూపే పటం (Digital Inspiration నుండి):

Firefox 3 Download Day Start

హైదరాబాదులో ఫైర్‌ఫాక్స్ 3 సంబరాలకు ఆహ్వానం!

మీ అభిమాన విహారిణి మంటనక్క యొక్క సరికొత్త వెర్షన్ (మంటనక్క ౩) ఈ నెల 17వ తేదీన విడుదలవ్వబోతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా మొజిల్లా పార్టీలు జరుగుతాయి.  హైదరాబాదులో ఓ పార్టీని నేను (స్నేహితుల సహాయంతో) నిర్వహిస్తున్నాను. హైదరాబాదులోని వారికి ఇదే మా ఆహ్వానం!

ముఖ్యమైన వివరాలు

తేదీ మరియు సమయం: ఆదివారం, జూన్ 22, 2008 సాయంత్రం 4 గంటలనుండి 6 వరకు

వేదిక: కృష్ణకాంత్ ఉద్యానవం, యూసఫ్ గూడ బస్తీ, హైదరాబాద్. (పటం)

ఏం చేస్తాం

 • మంటనక్క 3 మరియు ఇతర స్వేచ్ఛా మృదుపరికరాల సీడీలు ఇస్తాం.
 • మీ మీ అంకోపరులు (ఉంటే) తెస్తే, దానిలో మంటనక్క 3 ని స్థాపిస్తాం
 • మంటనక్క 3 విశేషాలని వివరిస్తాం.

మీ ఉపాయాలు మరియు సూచనలు ఇక్కడ పంచుకోండి. మీరు హైదరాబాదులో ఉంటే తప్పకరండి.

అన్నట్టు, విడుదల రోజునే అత్యధిక దిగుమతులు జరుపుకున్న ప్రపంచ రికార్డు ఉపకరణంగా మంటనక్కని నిలపడం కోసం మొజిల్లా మరియు దాని అభిమానులు సంకల్పించారు. మీరూ పాల్గొంటున్నారా? జూన్ 17న సిద్ధంగా ఉండండి.

తాజాకలం: సంబరాలు విజయవంతంగా జరిగాయి. పార్టీ నివేదికని చదివి విశేషాలు తెలుసుకోండి.

మీరు ఇంకా IE6 వాడుతున్నారా? ఎందుకని?

IE6 నుండి మీ విహారిణిని నవీకరించుకోకపోవడానికి మీ కారణాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు ఏ IE వెర్షన్ వాడుతున్నారో తెలుసుకోవడం ఇలా: Help > About Internet Explorer

ప్రత్యామ్నాయాలు: IE6 కి బదులుగా ఈ క్రింది మెరుగైన విహారిణులలో దేనినైనా వాడవచ్చు.

 1. Mozilla Firefox
 2. Google Chrome
 3. Opera
 4. IE7 (ఇప్పుడు విండోస్ XPకి కూడా లభ్యం)
 5. Safari

కొన్ని లింకులు:

తాజాకలం (జూలై 4, 2008):

తాజాకలం (ఫిబ్రవరి 21, 2009):