ఈ రోజే (అక్టోబర్ 8న) ఓపెరా తన విహారిణి యొక్క 9.60 కూర్పుతో బాటుగా తెలుగు పాఠాంతరాన్ని కూడా విడుదల చేసింది. ఇది నిజంగా బ్రహ్మాండమైన వార్త! ఓపెరా జిందాబాద్!! ఓపెరా వారికి భారత దేశపు సైటు కూడా ఉంది, కానీ అది హిందీలో మాత్రమే లభ్యమవుతున్నట్టుంది. దిగుమతి లింకు: opera.com/download (అక్కడ Telugu భాషని ఎంచుకోండి) స్థాపన ప్రక్రియ అంతా కూడా ఆంగ్లంలోనే ఉంది. ఒక్కసారి స్థాపనమైన తర్వాత తెలుగందుకుంటుంది. అయితే చాలా వరకు తెలుగు … ఓపెరా విహారిణి, ఇప్పుడు తెలుగులో కూడా! చదవడం కొనసాగించండి
Tag: తెలుగు
వివిధ ఉపకరణాల తెలుగీకరణ, జాలంలో!
కొన్నాళ్ళ కిందట పొద్దులో నేను జాలంలో శ్రమదానం అనే శీర్షికతో ఓ సంపాదకీయం రాసాను. దానికి కొనసాగింపుగా మరిన్ని వివరాలతో ఒక్కో అంశాన్ని సృషిస్తూ మరికొన్ని టపాలు రాయాలనుకుంటున్నాను. స్థానికీకరణల గురించి నేను రాసిన మరో టపాకి ఇది పరిచయం. జాలంలో మనం తోడ్పడదగ్గ పనుల్లో వివిధ మృదూపకరణాలని తెలుగులోనికి స్థానికీకరించడం (లేదా తెలుగీకరణ) అనేది ఒకటి. ఆయా ఉపకరణాలు వాడే సాంకేతికతలని బట్టి వాటి స్థానికీకరణ ప్రక్రియల సరళత లేదా క్లిష్టత ఉంటుంది. స్థానికీకరణ ప్రక్రియలలోని … వివిధ ఉపకరణాల తెలుగీకరణ, జాలంలో! చదవడం కొనసాగించండి
భారత నీటి నెలవు
భారత నీటి నెలవు (India Water Portal) అనేది నీటి నిర్వహణా పద్ధతులు తదితర అంశాలపై విజ్ఞానాన్ని తమ సభ్యుల మధ్య పంచుకునే, పెంపొందించే ఉద్దేశంతో నడపబడే ఓ అంతర్జాల నెలవు. నీటి నిర్వహణ, సంరక్షణ తదితర అంశాలపై సమాచారాన్ని స్థానిక భాషలలో అందించాలనుకుంటున్నారు కూడా. ఆ ప్రయత్నానికి ఔత్సాహికులు తగిన సహాయం అందించవచ్చు. రేపు అనగా శుక్రవారం, సెప్టెంబరు 12న సాయంత్రం 3 గంటల నుండి 5 గంటల వరకు వీరు హైదరాబాదులో ఓ సదస్సు … భారత నీటి నెలవు చదవడం కొనసాగించండి
ఫ్యూయల్ తెలుగు: పరిచయం
మనం పలు ప్రాజెక్టులకి పలు చోట్ల అనువాదాలు చేస్తున్నాం. అలాంటప్పుడు ఒకే పదానికి ఒక ప్రాజెక్టులో అనువాదాలకీ మరో ప్రాజెక్టులోని అనువాదాలకి పొంతన లేకుండే అవకాశం ఉంది. అలానే, ఒకే ప్రాజెక్టులో వేర్వేరు అనువాదకులు చేసిన అనువాదాలు భిన్నంగా ఉండవచ్చు. ఉదాహరణకి, user అన్న పదానికి ఓ చోట వాడుకరి అని వాడి ఉండవచ్చు, అదే ప్రాజెక్టులో మరోచోట వియోగదారుడనో మరోటో వాడి ఉండవచ్చు. మృదుపరికరాల స్థానికీకరణలలో తరచూ వాడే పదాలలో ఇలాంటి అనియతత్వత (inconsistency) రాకుండా … ఫ్యూయల్ తెలుగు: పరిచయం చదవడం కొనసాగించండి
నేటి లింకు: ఎర్రబస్సు.in
ఆన్లైన్లో బస్సు టిక్కెట్ల బుకింగ్ వెబ్ సైటు (తెలుగులో)! ఎర్రబస్సు.in జట్టుకి అభినందనలు!
తెలుగులో గూగుల్ ప్రకటనలు
గూగుల్ తెలుగులో కూడా ప్రకటనలు అంగీకరిస్తున్నట్టుంది! గమనించారా? ఉందిలే మంచికాలం ముందు ముందునా!
అనుపమ టైపింగ్ ట్యూటర్ పరిచయం
అనుపమ టైపింగ్ ట్యూటర్ అనేది మొదటి పూర్తిస్థాయి తెలుగు టైపింగ్ ట్యూటరుగా చెప్పుకోవచ్చు. దీన్ని వాడి మనం ఇన్స్క్రిప్ట్ కీబోర్డు లేయవుటుని నేర్చుకోవచ్చు. ఇందుకోసం ఇంగ్లీషు, మరియు ఇంగ్లీషు టైపింగు తెలియాల్సిన పనిలేదు. అసలు అనుపమ ట్యూటర్ ప్రత్యేకత ఏమిటంటే, అనుపమ అనే చిన్న అమ్మాయి తన మాటలతో సూచనలు ఇస్తూ ఉంటుంది. అనుపమ టైపింగ్ ట్యూటర్ నడుస్తున్నంతసేపూ మంద్రమైన తెలుగు సంగీతం వినిపిస్తుంది. అసలు అలసటే లేకుండా టైపింగు నేర్చుకోవచ్చు. క్రింద కొన్ని తెరపట్టులు మీకోసం. … అనుపమ టైపింగ్ ట్యూటర్ పరిచయం చదవడం కొనసాగించండి
తెలుగు బ్లాగర్లకై అనుపమ టైపింగ్ ట్యూటర్ ధర 40% తగ్గింపు
అనుపమ వారు తమ టైపింగ్ ట్యూటరుని 40% తగ్గింపు ధరకే అందిస్తున్నామని ప్రకటించారు. ఈ అవకాశం తెలుగు బ్లాగర్లకి మాత్రమేనంట!
నేటి లింకు
తెలుగు సేవ చేయాలి, సెలవిప్పించండి. స్వచ్ఛంద పదవీవిరమణకు ఐ.పీ.ఎస్. అధికారి దరకాస్తు (వయా)
మీకు నచ్చిన తెలుగు టైపింగ్ విధానం ఏది?
మీకు నచ్చిన తెలుగు టైపింగ్ విధానానికి వోటు వేసారా? ఇప్పుడే వెయ్యండి మరి.