మొబైళ్ళలో తెలుగు → తెలుగులో మొబైళ్ళు

టూకీగా… ముందుగా తెలుగు మొబైళ్ళ కోసం నేను మొదలుపెట్టిన పిటిషనుకు స్పందించి దానిపై సంతకం చేసి, దాన్ని తమ మిత్రులతో పంచుకున్న వారందరికీ కృతజ్ఞతలు! మీ అందరివల్లా మొదటి వారంలోనే 200 సంతకాలు దాటాయి. ఇక దీన్ని మరింత మందికి చేర్చే ప్రయత్నం చేద్దాం. ఈ విన్నపంపై మీరింకా సంతకం చేసివుండకపోతే, ఇప్పుడే వెళ్ళి సంతకం చేయండి. దీన్ని మీ మిత్రులతోనూ, మీకు తెలిసిన మొబైల్ కంపెనీల సిబ్బంది తోనూ పంచుకోండి. చేతిఫోన్లను తెలుగులో ఉపయోగించుకోవడంలో ఇబ్బందులుంటే, … మొబైళ్ళలో తెలుగు → తెలుగులో మొబైళ్ళు ‌చదవడం కొనసాగించండి

ఈ ఆదివారం తెలుగు బాటకి రండి!

రామదండు నడిచి రాక్షస సంహారం చేసింది. మహాత్ముడు నడిచి సత్యాగ్రహం చేసాడు, స్వాతంత్ర్యం తెచ్చాడు. నాటి నుండీ నేటివరకు ఒకమంచిపనికోసం నడకసాగించిన ఎవరూ ఓడిపోలేదు. తెలుగుభాష గొప్పతనాన్ని, భాష మీద మనకున్న అభిమానాన్ని ప్రకటించటానికి మనమంతా, కలిసి నడుద్దాం. ప్రపంచానికి తెలుగుభాష ఉనికిని చాటి చెబుదాం.
నాగ మురళీధర్

e-తెలుగు ప్రశ్నలు & జవాబులు

e-తెలుగు గురించి కొన్ని ప్రశ్నలు కొన్ని నా జవాబులు. హిందీ, ఇంగ్లిష్‌, అరబిక్‌ వంటి భాషల సాపత్యం వల్ల కొత్త పదాలు తెలుగులోకి వచ్చి చేరాయి. చేరుతున్నాయి. ఈ భాషలను మనం కలుపుకొని వాటి ద్వారా వచ్చిన బలాన్ని మనం చేజిక్కించుకుంటే వచ్చిన తప్పేమిటి? ప్రతి పదాన్ని తెలుగులోనే పలకాలనే భావన ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో ఈ మాత్రం సహేతుకం? ఇతర భాషల పదాలని భేషుగ్గా తెలుగులో కలిపేసుకోవచ్చు. తప్పేంలేదు. ఇక ప్రతీ పదాన్నీ తెలుగులోనే పలకాలనే … e-తెలుగు ప్రశ్నలు & జవాబులు ‌చదవడం కొనసాగించండి

e-తెలుగు ఎలా ఏర్పడింది?

e-తెలుగుని ఏర్పరచింది తెలుగు బ్లాగరులే. e-తెలుగు పుట్టు పూర్వోత్తరాల గురించి ఈ క్రింది లింకులు వివరంగా తెలియజేస్తాయి. మీకున్న సందేహాలని నివృత్తి చేసుకోడానికి ఇవి ఉపయోగపడవచ్చు. అన్ని ప్రశ్నలకూ నేరుగా సమాధానం దొరకపోవచ్చు. అప్పటి feelని మాత్రం ఇవి మీకు అందిస్తాయి. ఇంటర్నెట్లో తెలుగు - ఓ నిశబ్ద విప్లవం హైదరాబాద్ తెలుగు బ్లాగర్ల మొదటి సమావేశం (మార్చి 2006) కేవలం బ్లాగులే కాదు. నెట్లో తెలుగు వ్యాప్తి కి మరియు స్థానికీకరణకి ప్రయత్నాలు. యూనికోడ్ అధికారిక … e-తెలుగు ఎలా ఏర్పడింది? ‌చదవడం కొనసాగించండి