నగరాలు పలు భాషల నగారాలు కావాలి

2030వ సంవత్సరానికల్లా ప్రపంచ జనాభాలో 60% నగరాలలోనే నివసిస్తారనీ, 2050 సంవత్సరానికి ఇది 70 శాతానికి చేరువకావచ్చనీ అంచనా. అభివృద్ధి చెందిన దేశాలలో ఇప్పటికే 80 శాతం పైబడి నగరాలలో నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో భాషల మీద పడే ప్రభావం, పరిరక్షణ గురించిన అంశాలతో ఈ వ్యాసం.

అప్రమేయాలతో అప్రమత్తం!

ఈ వ్యాసం తొలుత తెలుగు వెలుగు పత్రిక ఏప్రిల్ 2020 సంచికలో “అప్రమేయాలతో జాగ్రత్త!” అనే శీర్షికతో ప్రచురితమైంది. అప్రమేయం అంటే? మన ప్రమేయం లేకుండానే కంప్యూటర్/మొబైలు అనువర్తనాలు గానీ, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు గానీ మన కోసం లేదా మన తరపున ఎంచుకునే ఎంపికలు, తీసుకునే నిర్ణయాలే అప్రమేయాలు. అంటే, వాటి తయారీదార్లు మనకోసం ముందుగా నిర్ధేశించిన అమరికలు అన్నమాట. ఉదాహరణకు, మీరు టీవీ పెట్టగానే ఏ ఛానెల్ వస్తుంది? మీరు టీవీ కట్టక మునుపు చూస్తున్న … అప్రమేయాలతో అప్రమత్తం! ‌చదవడం కొనసాగించండి

తెలుగులో a.m. p.m.?

ఆంగ్లంలో 12-గంటల ఫార్మాటులో సమయాన్ని చెప్పేప్పుడు మధ్యాహ్నానానికి ముందో తర్వాతో సూచించడానికి a.m. అనీ p.m. అనీ వాడతాం. తెలుగులో అయితే, మాట్లాడేటప్పుడు తడుముకోకుండా ఉదయం/పొద్దున్న/మార్నింగు 8 గంటలకు అనో, రాత్రి/నైటు 8 గంటలకు అనో తెల్లవారు 5 గంటలకు అనో, సాయంకాలం/ఈవెనింగు 5 గంటలకు అనో అంటాం. కానీ కంప్యూటర్లోనో లేదా వేరే డిస్‌ప్లేలలో సమయాన్ని తక్కువ అక్షరాలతో సూచించాల్సి వచ్చినప్పుడు లేదా సాంకేతికంగా లాంఛనప్రాయంగా వాడాల్సివచ్చినప్పుడు తెలుగులో (ఏయెమ్, పీయెమ్ కాకుండా) ఏ పదాలను … తెలుగులో a.m. p.m.? ‌చదవడం కొనసాగించండి

తెలుగులో వర్డ్‌ప్రెస్!

వర్డ్‌ప్రెస్ అనేది బ్లాగడానికి ఉపయోగపడే ఒక జాల అనువర్తనం. WordPress.com వద్ద చాలా కాలం నుండి తెలుగులో అందుబాటులో ఉంది. కానీ ఆ అనువాదాలు అసంపూర్ణంగానూ, కొన్నిచోట్ల తప్పులతోనూ, ఇంకొన్నిచోట్ల అసహజ వాక్యనిర్మాణం తోనూ ఉన్నాయి (వర్డ్‌ప్రెస్లో బ్లాగు పెట్టుము గుర్తుందా? ☺). అలానే స్వంత సైట్లలో స్థాపించుకునే వర్డ్‌ప్రెస్ (WordPress.org) కొన్నాళ్ళక్రితం వరకూ అధికారికంగా తెలుగులో అందుబాటులో లేదు. నేను కాస్త చొరవ తీసుకొని వర్డ్‌ప్రెస్ తెలుగు స్థానికీకరణకు నిర్వహణ హక్కులను పొందాను. ఆ తర్వాత … తెలుగులో వర్డ్‌ప్రెస్! ‌చదవడం కొనసాగించండి