2030వ సంవత్సరానికల్లా ప్రపంచ జనాభాలో 60% నగరాలలోనే నివసిస్తారనీ, 2050 సంవత్సరానికి ఇది 70 శాతానికి చేరువకావచ్చనీ అంచనా. అభివృద్ధి చెందిన దేశాలలో ఇప్పటికే 80 శాతం పైబడి నగరాలలో నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో భాషల మీద పడే ప్రభావం, పరిరక్షణ గురించిన అంశాలతో ఈ వ్యాసం.
వర్గం: వ్యాసాలు
అప్రమేయాలతో అప్రమత్తం!
ఈ వ్యాసం తొలుత తెలుగు వెలుగు పత్రిక ఏప్రిల్ 2020 సంచికలో “అప్రమేయాలతో జాగ్రత్త!” అనే శీర్షికతో ప్రచురితమైంది. అప్రమేయం అంటే? మన ప్రమేయం లేకుండానే కంప్యూటర్/మొబైలు అనువర్తనాలు గానీ, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు గానీ మన కోసం లేదా మన తరపున ఎంచుకునే ఎంపికలు, తీసుకునే నిర్ణయాలే అప్రమేయాలు. అంటే, వాటి తయారీదార్లు మనకోసం ముందుగా నిర్ధేశించిన అమరికలు అన్నమాట. ఉదాహరణకు, మీరు టీవీ పెట్టగానే ఏ ఛానెల్ వస్తుంది? మీరు టీవీ కట్టక మునుపు చూస్తున్న … అప్రమేయాలతో అప్రమత్తం! చదవడం కొనసాగించండి
తెలుగు వినియోగదారులకు (భాషాభిమానులకు) మేలుకొలుపు
మన రోజువారీ జీవనంలో అనేక వస్తువులని వినియోగిస్తూంటాం, అనేక సేవలు పొందుతుంటాం. టూత్ పేస్టు నుండి గదిలో ఫ్యాను వరకూ, పచారీ సరుకులు ఇంటికే తెప్పించుకోవడం నుండి బీమా, బ్యాంకు సేవల వరకు. అయితే, వీటిలో ఎన్ని తెలుగులో ఉంటున్నాయి? ఆ పరిస్థితిని మనం ఎలా మార్చవచ్చు?
యంత్ర పరిణామ క్రమం
ఏకకణ జీవులుగా ప్రారంభమైన జీవం నేటి మానవుని వరకూ ఎన్నో మార్పులు చెందింది. మనం వాడే యంత్రాలు కూడా పరిణామం చెందుతూనే ఉన్నాయి. ఆదిమ మానవుడు రాళ్ళను ఆయుధాల గానో పనిముట్ల గానో వాడటంతో మొదలయిన యంత్ర ప్రస్థానం నేటి స్వయం చోదక (సెల్ఫ్ డ్రైవింగ్) వాహనాలు, గ్రహాంతర వాహనాలు, రోబోట్ల వరకూ ఇంకా వేగం పుంజుకుంటూనే ఉంది. ఇది ఎటువైపు వెళ్ళబోతూంది. ఆ క్రమాన్ని తరచి చూడడమే ఈ వ్యాస ఉద్దేశం.