లేఖిని నుండి గూగుల్ శోధన

ఇక  నేరుగా లేఖిని నుండే గూగుల్ లో వెతకవచ్చు!

Google Search from Lekhini

మీరు గూగుల్ లో వెతకాలనుకున్నది టైపు చేసాకా G పై నొక్కండి (పైన బొమ్మలో చూడండి).  గూగుల్ ఫలితాలతో కొత్త ట్యాబు/విండో ప్రత్యక్షమవుతుంది.

లేఖిని మరియు కూడలి రద్దీ వివరాలు

లేఖిని మరియు కూడలి రద్దీ వివరాలు

మీ అందరి క్రియాశీల ప్రచారంవల్ల లేఖిని మరియు కూడలి రెండూ బానే పురోగమిస్తున్నాయి.

  1. జూలైలో (దాదాపు అంతా), ఆగష్టులో (సగానికి సగం) లేఖిని రద్దీ వీవెన్.ఆర్గ్ కే వెళ్ళింది.
  2. అక్టోబరు చివరలో కూడలికి రద్దీ సుధాకర్ యొక్క తెలుగోపకరణ పట్టీ వల్ల చాలా పెరిగింది.

nikhilE — a Telugu-to-English Translitelator

As tools to create Telugu on computer are increasing and as Telugu content is growing on the web, you often get messages from your friends in Telugu or come across a Telugu web page. You can understand Telugu. But… the problem is–

  • you cannot read Telugu
  • or, your computer is not configured to display Telugu

The latter problem can be overcome in just 5 minutes by configuring your computer for Telugu.

However, you cannot learn to read Telugu just then. It takes time. But, you want to know right then what is  the Telugu text in the message you have just received. Or, what the Telugu webpage you are viewing is about. But in most cases, you may not get the English version of the message or webpage.

There you are! nikihiLe is for you. It is a tool that converts (precisely, transliterates) Telugu text into English. It is not a translator. It is a transliterator. That is, it just spells the Telugu words in English. For example, the word “English” in Telugu is transliterated as “iMgleesh^”. Not worse than characters that do not make sense, right? Try it now.

To read such English-transliterated text fast, you need to get used to it. :-) This transliteration is based on RTS standard.

nikhilE is in response to the request from Kamesh Chittela. The name is coined by Kiran Chava. Thanks, guys.

If you like nikhilE and would wish to spread it, I have made nice button for you:nikhilE.

(If you use Firefox for your web browsing, you can use Padma extension to transliterate Telugu text. I feel that it is simpler to use Padma extension than everytime coming to nekhilE.)

aanaMda telugu saMbhaashaNaM!

(తెలుగు బ్లాగర్లూ, తెలుగులో చదవలేని మీ సందర్శకులని నిఖిలేకి పంపండి.)

వెబ్‌లో తెలుగు ఎదుగుతూంది

కంప్యూటర్లో తెలుగు రాయడానికి, చూడడానికి చాలా మంది ప్రయత్నిస్తునట్టున్నారు. గత 60 రోజులలో నా బ్లాగుకి (నా వెబ్‌సైట్లు కలపకుండా) ఈ అన్వేషణ పదాలు సందర్శకులని పంపించాయి. (తెలుగుకి సంభందించని పదాలని తీసివేసా.)

లేఖిని—పుట్టుక మరియు పెరుగుదల

గతం

కావ్య నందనం వెబ్‌సైటు చూసి ఆ ప్రేరణతో ఎప్పుడైనా హెక్సా డెసిమల్ కోడ్‌తో HTML లో వ్రాస్తూ ఉండే వాడిని. (చాలా పాతది 2002 లో ను చేసిన ఈ పేజీ చూడండి.) అప్పట్లో తెలుగులో వంశవృక్షం కూడా తయారు చేసా. తర్వాత వెన్న నాగార్జున గారి పద్మ ఆన్‌లైన్ వెర్షన్ చూసా. పర్వాలేదు అనుకున్నా. తర్వాత తెలుగులో అంతగా ఏమీ చెయ్యలేదు. అప్పుడప్పుడు తెలుగు వికీపీడియా కి వెళ్ళి చూస్తూ ఉండేవాడిని. వేయి తర్వాత వ్యాసాల సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉంది (చదువరి గారి ఆగమనం వల్ల అనుకుంటా). ఇక బ్లాగుల ప్రభంజనం మొదలు. మెల్లగా తెలుగు వికీపీడియాలో రాయడం మొదలెట్టా. ఆంగ్లంలో ఈ బ్లాగు మొదలెట్టా. ఇక తెలుగు బ్లాగర్ల మొదటి సమావేశం.

పుట్టుక

కిరణ్ చావా మరియు చదువరిల బ్లాగులు అప్పుడప్పుడు చూస్తూ ఉన్నా, తెలుగు బ్లాగర్ల మొదటి సమావేశం తర్వాతే నేనూ బ్లాగుని తెలుగులో రాయాలని, పద్మలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులని తొలగించి సరళంగా ఓ పేజీ చెయాలని ఆలోచన వచ్చింది. పద్మ GPLతో లభ్యం కాబట్టి న్యాయపరమైన సమస్యలేమీ లేవు. పద్మ కోడ్‌ని దిగుమతి చేసుకొని, అధ్యయనం చేసి (నాకు జావాస్క్రిప్ట్, ఆమాటకొస్తే ఏ ప్రొగ్రమింగ్ భాషా అంతగా తెలియదు) చిన్న చిన్న మార్పులుచేసి సరళం చెసా. దానికే లేఖిని అని పేరు పెట్టి నా వెబ్‌సైట్‌లో ఉంచి తెలుగుబ్లాగు సమూహంలో ప్రకటించా. తెలిసిన వారికి ఈ-మెయిల్ చెసా. బ్లాగుపోస్ట్ రాసా. చాలా మంది అభినందించారు, ప్రోత్సహించారు. వారి వారి బ్లాగుల్లో రాసారు. తమ మిత్రులకి పరిచయం చేసారు. చాలా మంది పద్మ నుండి లేఖినికి మారారు.

ఎదుగుదల

తర్వాత నెల రోజులలో మరిన్ని హంగులు చేర్చా. లేఖినిని మరింత మంది వాడడం మొదలుపెట్టారు. తెలుగుబ్లాగు సమూహంలోనూ, తెలుగు వికీపీడియాలోను ఎలా రాయాలి అని అడిగే ప్రశ్నలకు నాకంటే ముందే చదువరి, కిరణ్, వెంకట రమణ లేదా మరొకరో లేఖిని వాడమని సలహా ఇచ్చేవారు. సులభంగా తెలుగులో టైపు చెయ్యడానికి లేఖిని మారుపేరయ్యింది. తర్వాత చాలా రోజులు ఏమీ మార్పులు చెయ్యలేదు (మళ్ళీ ఆ కోడ్ గందరగోళంలోకి వెళ్ళలేక). చరసాల మొదలగు వాడకందార్ల సలహాలు, సూచనల మేరకు గత నెలలో మరిన్ని చిన్ని చిన్ని మెరుగులు చేర్చా. లేఖిని వాడకపు పెరుగుదలని ఈ చిత్రంలో చూడండి. (జూలై, ఆగష్టు నెలల్లో ట్రాఫిక్కు veeven.org, veeven.com ఇంకా lekhini.org ల మధ్య చీలిపోయింది. కనుక ఖచ్చితమైన అంకెలు అందుబాటులో లేవు.) లేఖిని వల్ల వెబ్‌లో ఎంత తెలుగు సమాచారం పెరిగింది అనేదానికి లేఖిని వాడేవారి స్పందనలే తప్ప వేరే ఆధారాలు ఏమీ లేవు.

Lekhini Growth

చావా కిరణ్ సలహా మేరకు, ఈ మధ్యనే లెఖినికి సొంతగూడు (lekhini.org) కూడా కట్టించా :-)

భవిష్యత్తు

లేఖిని ధీర్ఘకాలిక సమస్యకి తాత్కాలిక పరిష్కారం మాత్రమే. తెలుగులో రాయడానికి లేఖిని కంటే సులభమైన, స్థిరమైన సాధనాలు రావాలి.

బ్యానర్ మేనియా

లేఖినికి ఒకటి. (http://lekhini.org/banner728x90.png)

Type in Telugu

కూడలికి ఒకటి. (http://veeven.com/koodali/banner728x90.png)

Hot Hot Telugu Blogs

లేఖినికి కూడలికి మీ వంతు ప్రచారంచేయడానికి మీ వెబ్‌సైట్లో ఈ బ్యానర్లని తగిలించండి.

ఇతర సైజులు: