డిసెంబర్ 2009

నా కొన్ని ఆసక్తులకి సంబంధించిన జరుగుతున్న వివరాల నివేదిక.

e-తెలుగు

  • e-తెలుగు యొక్క ప్రచారం మరియు ఆవగాహన కార్యకలాపంలో భాగంగా సాధ్యమైనంత ఎక్కువ ప్రజలకి కంప్యూటర్లలో తెలుగుని చూడవచ్చూ రాయవచ్చూ, తెలుగులో బ్లాగులున్నాయి , వికీపీడియా ఉంది అని తెలియజేయడానికి హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో ఒక స్టాలుని ఎర్పరచింది. ఈ సందర్భంగా కశ్యప్, చక్రవర్తి, సతీష్, మురళీధర్, కౌటిల్య, రవిచంద్ర, సుజాత, వరూధిని, మరియు ఇంకా ఇతర ఔత్సాహికుల కృషి శ్లాఘనీయం. నేను అక్కడకి మూడు రోజులు మాత్రమే వెళ్ళగలిగాను :( కొత్త బ్లాగర్లను, ఇప్పటివరకూ నేను కలుసుకోని పాత బ్లాగర్లను, సాహిత్య/సినీరంగ ప్రముఖులనూ కలుసుకోవడం ఆనందదాయకం.

స్థానికీకరణ (తెలుగీకరణ)

స్వేచ్ఛా మృదూపకరణాలు

నూతన సంవత్సర శుభాకాంక్షలు!

ప్రకటనలు

ఏం జరుగుతోంది…

డిసెంబర్ రెండవ ఆదివారం తెలుగు బ్లాగుల దినోత్సవం. మీ ఊళ్ళో ఏం చేస్తున్నారీసారి? ఇంకో నెల ఉందనుకోండి. కానీ ఇప్పటినుండే, స్కెచ్చు గీయండి.

డిసెంబర్ 17 నుండి 27 వరకూ, భాగ్యనగరంలో పుస్తక ప్రదర్శన!. ఈ ప్రదర్శనలో ఒక స్టాలు కోసం e-తెలుగు సన్నాహలు చేస్తుంది (పుస్తకాలు అమ్మడానికి కాదు, కంప్యూటర్లలోనూ జాలంలోనూ తెలుగు చూడొచ్చని రాయొచ్చనీ, తెలుగు బ్లాగులు ఉన్నాయనీ, తెలుగులో వికీపీడియా ఉందనీ సందర్శకులకి చెప్పడానికి).

మీడియావికీ తెలుగు అనువాదాలు 100% పూర్తయ్యాయి. (కానీ అది కదిలే లక్ష్యం. ఉన్న అనువాదాలన్నీ అత్యుత్తమం కాకపోవచ్చు. మీడియావికీకి మెరుగులద్దే కొద్దీ అనుదించాల్సిన కొత్త పదాలు రావొచ్చు.). ఈ అనువాదాలని ఉపయోగంలో చూడాలంటే, తెవికీని సందర్శించండి (వ్యాసాలు కాకుండా తెవికీలో కనబడేదంతా ఈ అనువాదాల ఫలితమే). అర్థంకాని పదబంధాలు లేదా అక్షరదోషాలు గట్రా కనబడితే తెలియజేయండి. లేదా మీకు ట్రాన్స్‌లేట్‌వికీలో అనువాద హక్కులుంటే, మీరే సరిదిద్దవచ్చు. ట్రాన్స్‌లేట్‌వికీ అనేది వివిధ ఉపకరణాల స్థానికీకరణకై ఉద్దేశించిన వికీ-ఆధారిత సైటు.

ఓపెన్‌స్ట్రీట్‌మాప్ కూడా తన స్థానికీకరణలకోసం ట్రాన్స్‌లేట్‌వికీని వాడుతూంది. స్వేచ్ఛా మైక్రోబ్లాగింగ్ ఉపకరణం స్టేటస్‌నెట్ తన స్థానికీకరణల కోసం ట్రాన్స్‌లేట్‌వికీని వాడటం మొదలుపెట్టింది. స్టేటస్‌నెట్‌ని ఉపకరణాన్ని ప్రత్యక్షంగా ఐడెంటికా సైటులో చూడవచ్చు. వీటిని మరియు ఇతర బహిరంగాకర (open source) ఉపకరణాలనీ తెలుగీకరిద్దామనుకుంటే, ట్రాన్స్‌లేట్‌వికీలో చేరండి. భవిష్యత్తులో మరిన్ని ఉపకరణాలు ట్రాన్స్‌లేట్‌వికీని తమ స్థానికీకరణ కేంద్రంగా ఏంచుకోబోతున్నాయి.

ఓ మూడు నెలల క్రితం డ్రూపల్ కూడా తన స్థానికీకరణని జాలంలోనే చేయగలిగే విధంగా localize.drupal.org అనే తన స్వంత వేదికని ఏర్పాటు చేసింది. దీనికి ముందు డ్రూపల్ స్థానికీకరణలు వేర్వేరు చోట్ల (జాలం లోనూ బయటా) వేర్వేరు సమూహాల నాయకత్వంలో జరిగేవి. ఈ స్థానికీకరణ పనంతా బహిరంగంగా ఒక్క చోటే జరిగితే, అదే పనిని వేరువేరు జట్లు చేయడాన్ని అరికట్టవచ్చు మరియు స్థానికీకరణలన్నీ ఒకే చోటినుండి అందుబాటులో ఉంటాయి. (ఉదాహరణకి, e-తెలుగు సైటు కోసం కొన్ని అనువాదాలు e-తెలుగు సైటులోనే చేసాం కానీ డ్రూపల్ వాడే ఇతరులకి అవి అందుబాటులో లేవు.) డ్రూపల్ ఈ ప్రకటన చేయగానే, నేను తెలుగు స్థానికీకరణ కూడా అక్కడే చేస్తామని అభ్యర్థించాను. ఆ తర్వాత, e-తెలుగు సైటులో చేసిన అనువాదాలను అక్కడికి దిగుమతి చేసి, నేనూ మరికొందరు అక్కడ కొన్ని అనువాదాలు చేసాం. ప్రస్తుతం 18% పూర్తి. ఇప్పుడు ఎవరైనా తమ తమ డ్రూపల్ సైట్ల కోసం తెలుగు అనువాదాలని అక్కడ నుండి దింపుకోవచ్చు.

ఈ నెల 9న నా అభిమాన విహారిణి ఫైర్‌ఫాక్స్ 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

ఇంక్‌స్కేపుని తెలుగీకరించడం మొదలుపెట్టాను. దురదృష్టవశాత్తూ, దాన్ని జాలంలో స్థానికీకరించడం ఇంకా కుదరదు. మీకు ఆసక్తి ఉంటే, నాకు చెప్పండి.

ఆనంద తెలుగీకరణం!

ప్రతీ రోజూ కొంచెం కొంచెం చేరువగా…

… తెలుగు నిర్వాహక వ్యవస్థ వైపు.

మీ కంప్యూటర్ మీతో తెలుగులో సంభాషిస్తే ఎలా ఉంటుంది? ఆ స్వప్నం నిజమయ్యే రోజు మరెంతో దూరంలో లేదు. స్వేచ్ఛా మృదూపకరణాల ప్రాజెక్టులు దాదాపుగా అన్నీ తమ ఉపకరణాల స్థానికీకరణకి ఔత్సాహికులకి అవకాశమిస్తున్నాయి. చాలా మంది కృషి వల్ల ఇప్పటికే గ్నూ/లినక్స్ పాక్షికంగా తెలుగులో లభిస్తుంది. మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌కి కూడా తెలుగు ప్యాక్ ఉంది.

నా కంప్యూటర్లో నేను ఆటని గెలిస్తే ఇలా అభినందిస్తుంది:

మీరు గెలిచారు!

నా డెస్క్‌టాప్ తెరపట్టు ఇదిగో. (పెద్దగా చూడడానికి బొమ్మపై నొక్కండి.)

నా కంప్యూటర్ తెలుగులో

ప్రతీ నవీకరణలోనూ డెబియన్ మరింతగా తెలుగుమయమవుతూ వస్తుంది. ఇంకా అర్థంకాని అనువాదాలు అక్కడక్కడా తాసరపడుతూనే ఉన్నాయి, కానీ పరిస్థితి క్రమంగా మెరుగవుతూవుంది.

తెలుగీకరణ ప్రయత్నాలలో మీరూ పాలుపంచుకోవచ్చు.

వివిధ ఔత్సాహికుల లెక్కలేనన్ని ప్రయత్నాలకు ధన్యవాదాలు మరియు అభినందనలు.

ఇప్పుడు జీమెయిల్ తెలుగులో వ్రాసుకోవచ్చు!

గూగుల్ తన భారతీయ భాషల లిప్యంతరీకరణ సేవని జీమెయిలుకి కూడా విస్తరించింది. కనుక ఇప్పుడు నేరుగా జీమెయిల్లో మన భాషల్లో వ్రాసుకోవచ్చు.

జీమెయిల్లో తెలుగు టైపింగ్

పైన చూపించినట్టు అన్న ప్రతీకం (icon) మీకు రాకపోతే, మీ జీమెయిల్లో Settings (అమరికలు) లోనికి వెళ్ళి, ఇలా అమర్చుకోండి:
జీమెయిల్లో తెలుగు టైపింగుని చేతనం చేసుకోవడం

మరిన్ని వివరాలకై గూగుల్ బ్లాగులో చూడండి.

బహుళ భాషల్లో కోక-కోలా

నిరుటి ఒలెంపిక్సు క్రీడలకి కోక-కోలా తన ఉత్పత్తుల సీసాలని, క్యానులని పలు భాషల లేబుళ్ళతో విడుదల చేసిందంట. (నాకు ఈ రోజే తెలిసింది.)

అరబిక్ భాషలో కోక-కోలా
అరబిక్ లేబుల్తో ఉన్న కోక-కోలా (Photo by Giustino)

చదవడం కొనసాగించండి

స్వేచ్ఛ లినక్స్ 07

గమనిక: దాదాపు ఓ సంవత్సరం క్రితం స్వేచ్ఛ తెలుగు నిర్వాహక వ్యవస్థ గురించి పరిచయం రాద్దామనుకుని మొదలుపెట్టాను. కానీ రాయలేదు. :-( ఇప్పుడు ఇలా ప్రచురించేస్తున్నాను.

బ్లాగోగులు

గమనిక: చాలా రాద్దామనుకునే దీన్ని మొదలు పెట్టాను. కానీ దీనిపై సమయం వెచ్చించలేకపోతున్నాను. మొదలు పెట్టిన ఈ టపాని ఇలాగే ప్రచురించేస్తున్నాను. కానీ నేనిచ్చిన లింకులు మంచి సమాచారాన్ని అందిస్తాయి.

XKCD - Duty Calls

XKCD by Randall

  • శోధన సుధాకర్ తెలుగీకరించిన బ్లాగర్ల ప్రవర్తనా నియమావళిని చూడండి.
  • బ్లాగుల్లో స్పందనలపై రానారె క్షణికమ్
  • Core Rules of Netiquette
  • New Game, Old Rules
  • కొత్తపాళీ బాగా చెప్పారు:

    బ్లాగడం మనందరికీ ఒక గొప్ప శక్తినిస్తోంది. ఒక వేదికనీ ఆ వేదిక మీద మాట్లాడేందుకు గొంతునీ ఇస్తోంది. ఆ శక్తి సామాన్యమైనది కాదు. గొంతులు నొక్కి వెయ్యబడే ఉక్కు పిడికిళ్ళ రాజ్యాల్లో సమయం గడిపి వచ్చిన వారిని అడగండి ఇది ఎంత అపురూపమైన శక్తో! దాన్ని సద్వినియోగం చేసుకుందాం. చర్చ ముఖ్యం .. ఆలోచనలు పంచుకోవడం ముఖ్యం. విభిన్నమైన ఆలోచనలు బయటికి రావడం, నిర్భయంగా స్వేఛ్ఛగా వ్యక్తీకరించ బడటం ముఖ్యం. ఆలోచనల్తో విభేదించడం తప్పు కాదు. అవసరమైతే విమర్శించడం కూడా మంచిదే. కానీ మన మాటలు ఒకరిని కించ పరచరాదు. జుగుప్సా కరమైన భాషా, వ్యక్తీగతమైన దాడులూ, అశ్లీలపు రాతలూ ఎవరికీ ఉపయోగం కావు. పూని ఏదైన ఒక్క మేల్ కూర్చి జనులకు చూపవోయ్ అన్న మహాకవి బోధని మనసులో పెట్టుకుందాం. ఏదన్నా పనికొచ్చే పని చేద్దాం.

ఆనంద బ్లాగాయనం!

డ్రీమ్‌హోస్ట్ ఉచిత హోస్టింగ్

డ్రీమ్‌హోస్ట్ ఇప్పుడు ఉచిత ఉపకరణ హోస్టింగుని అందిస్తుంది. దీనిలో మీరు వర్డ్‌ప్రెస్, దృపాల్, మీడియావికీ, జెన్ ఫొటో, పీహెచ్‌పీ బీబీ, గూగుల్ ఆప్స్ వంటి ఉపకరణాలని ఎంచుకొని వాడుకోవచ్చు.

ముందుగా 10వేల మందికి ప్రైవేటు బీటాగా ఆహ్వానిస్తున్నారు. నేనిది రాస్తున్నప్పటికి ఇంకా 9,040 ఆహ్వానాలు మిగిలిఉన్నాయి. త్వరపడండి.

తా.క.: మీరు డ్రీమ్‌హోస్ట్‌లో హోస్టింగ్ తీసుకోవాలనుకుంటే, KOODALI అన్న ప్రమోకోడ్ వాడితే గరిష్టంగా $97 వరకు (మీరు ఎన్ని సంవత్సరాలకి చెల్లిస్తున్నారు అన్నదాన్ని బట్టి) తగ్గింపు పొందవచ్చు.

e-తెలుగు ఎలా ఏర్పడింది?

e-తెలుగుని ఏర్పరచింది తెలుగు బ్లాగరులే. e-తెలుగు పుట్టు పూర్వోత్తరాల గురించి ఈ క్రింది లింకులు వివరంగా తెలియజేస్తాయి. మీకున్న సందేహాలని నివృత్తి చేసుకోడానికి ఇవి ఉపయోగపడవచ్చు. అన్ని ప్రశ్నలకూ నేరుగా సమాధానం దొరకపోవచ్చు. అప్పటి feelని మాత్రం ఇవి మీకు అందిస్తాయి.

e-తెలుగు గురించి మరింత:

ఆనంద బ్లాగాయనం!

డాట్‌క్లియర్ (ఒక బ్లాగింగ్ ఉపకరణం) ఇప్పుడు తెలుగులో!

డాట్‌క్లియర్ అనేది ఒక బ్లాగింగ్ ఉపకరణం. ఇది బహిరంగాకరం (open source). మన స్వంత గూళ్ళలో దీన్ని స్థాపించుకోవచ్చు. దీనిలోని ప్రత్యేక సౌలభ్యాలు నాకు తెలిసినవి (ఓ రెండు గంటల ఉపయోగం తర్వాత) ఇవీ:

  • ఒకే స్థాపనలో బహుళ బ్లాగులని సృష్టించుకోవచ్చు.
  • టపాలను వికీ చంధస్సు (syntax) లో కూడా (WYSIWYG లేదా (X)HTML పద్ధతులతో పాటుగా) వ్రాసుకోవచ్చు.

దీన్ని తయారీదార్లు ఫ్రెంచి వాళ్ళు. దీన్ని తెలుగులోనికి నేను అనువదిస్తున్నాను (ఫ్రెంచి నుండి కాదు).  తెలుగులో పరీక్షా బ్లాగుని చూడండి (దీని ప్రస్తుత తెలుగు అనువాద స్థితిని అక్కడ చూడవచ్చు).

మీ కోసం కొన్ని తెరపట్టులు.

డాట్‌క్లియర్ లోని ఒక అలంకారం
డాట్‌క్లియర్ లోని ఒక అలంకారం
డాట్‌క్లియర్ లోని మరో అలంకారం
డాట్‌క్లియర్ లోని మరో అలంకారం
డాట్‌క్లియర్ యొక్క నిర్వహణ డాషుబోర్డు
డాట్‌క్లియర్ యొక్క నిర్వహణ డాషుబోర్డు

ఆనంద స్థానికీకరణం!