నా పాడ్‌కాస్టు పేరు మాటల మూటలు. ఇది మన తెలుగు మాటల గురించి. మనం మర్చిపోతున్న తెలుగు మాటల్ని, అసలు మనం తెలుసుకోలేకపోయిన మాటలనూ, తిరిగి తెలుసుకునే ప్రయత్నంగా దీన్ని ఆరంభించాను. విన్న ప్రతీ ఒక్కరికీ, ఒక్కో భాగంలో ఒక్కో కొత్తమాట తెలిసినా అదే పదివేలు. మాటల మూటలు పాడ్‌కాస్టు వెబ్‌సైటు తెరపట్టు దీన్ని ఆపిల్ పాడ్‌కాస్ట్స్, గూగుల్ పాడ్‌కాస్ట్స్, స్పాటిఫై వంటి అన్ని రకాల పాడ్‌కాస్ట్ అనువర్తనాలలోనూ వినవచ్చు. లేదా నేరుగా జాలం లోనూ వినవచ్చు. … నేను పాడ్‌కాస్ట్ మొదలుపెట్టానోచ్! చదవడం కొనసాగించండి
వర్గం: లింకులు / సమాచారం
చూడాల్సినవి, చదవాల్సినవి, తెలుసుకోవాల్సినవి, గట్రా
“రాజుగారి క్షీరాభిషేకానికి నావంతు నీళ్ళు పోస్తే ఏమవుతుంది అనుకొని అందరూ నీళ్ళే పోస్తే పాలు మిగలనట్లు, ఎన్నో రంగాలలో ఎన్నో విద్యలలో తెలుగువారికున్న విజ్ఞాన సాంకేతిక సంపద తెలుగు రూపంలో వ్యక్తీకరింపబడనంత వరకు భాషకు నీటి సహాయమే కాని, పాల సహాయం అందనట్లు అనిపిస్తుంది.” — శ్రీనివాస్ నాగులపల్లి
భారతదేశ పటమూ, దేశ రక్షణ, నియంత్రణ
భారతదేశం ఎలా ఉంటుందో మీకు ఎలా తెలిసింది? ఏదో ఒక పటాన్ని చూస్తేనే కదా. మనం చిన్నప్పటిని నుండీ పాఠ్యపుస్తకాల్లోనూ ఇతరత్రానూ చూసి మన మనసుల్లో భారతదేశానికి ఒక ముద్ర ఏర్పడిపోయింది. అయితే, గూగుల్ మ్యాప్ వంటి సైట్లలో చూపించే భారతదేశ పటం తేడాగా, తల పక్కన కోసేసినట్టు ఉంటుంది. పాక్ ఆక్రమిత కశ్మీరుని మన దేశంలో భాగంగా చూపకపోవడం వల్ల. ఈ విషయమై భారత ప్రభుత్వం సదరు సైట్లకు పిర్యాదులూ, ఆదేశాలూ చేసి ఉంది. కానీ … భారతదేశ పటమూ, దేశ రక్షణ, నియంత్రణ చదవడం కొనసాగించండి
మేరీ నిఘంటువు — మనకి మన చేతులు ఎలా వచ్చాయి?
ఓ ముసలావిడ — తన భాషని బాగా మాట్లాడగలిగే చివరి వ్యక్తి — తన భాషకి ఒక నిఘంటువుని తయారుచేసింది. తమ తెగ వారు ఆ భాష నేర్చుకోవాలని ప్రయత్నం చేస్తూంది. వివరాలకు ఈ వీడియో కథనం చూడండి: https://vimeo.com/105673207 ఆ వీడియో లోని ఒక పిట్టకథ, తెలుగులో నా స్వేచ్ఛానువాదం: మనకి మన చేతులు ఎలా వచ్చాయి చాన్నాళ్ళక్రితం, అప్పటికింకా మనుషులు లేరు, జంతువులే ఉండేవి. వాటి నాయకురాలు గద్ద మనుషుల్ని తయారుచేయాలి అంది. జంతువులన్నీ … మేరీ నిఘంటువు — మనకి మన చేతులు ఎలా వచ్చాయి? చదవడం కొనసాగించండి
లంకెబిందెలు – 1
“ఇప్పటివరకూ మనం చూసిన కృత్రిమ మేధోపకరణాలు మనుషుల ఆలోచనలకి భిన్నం. చదరంగం ఆడటం, కార్లని నడపడం, ఫొటోలో ఉన్న వివరాలను చెప్పడం వంటి మనుషులు మాత్రమే చేయగలరనుకున్న పనులని ఈ ఉపకరణాలు చేసినా—అవి మనుషుల్లా చేయవు. ఫేస్‌బుక్ దగ్గర ఉన్న మేధకి ఎవరి ఫొటో ఇచ్చినా జాలంలో ఉన్న 300 కోట్ల మందిలో అది ఎవరిదో గుర్తుపడుతుంది. మన మెదళ్ళు ఆ స్థాయిని అందుకోలేవు, అందువల్ల అలాంటి సామర్థ్యం అ-మానవం. అంకెలతో గణాంకాలలో ఆలోచించడంలో మనకంత మంచి … లంకెబిందెలు – 1 చదవడం కొనసాగించండి
యూనికోడ్‌లో లోపాలు?
ఆంధ్రభూమి పత్రికలో నుడి అనే శీర్షికలో వచ్చిన సాంకేతిక భాషగా తెలుగు వ్యాసానికి స్పందిస్తూ కేతిరెడ్డి లక్ష్మీధరరెడ్డి అనే పాఠకుడు తన అభిప్రాయాలను సందేహాలను పంపించారు. వీటిపై స్పందిస్తే బాగుంటుందని కొత్తపాళీ గారు దీన్ని నా దృష్టికి తీసుకువచ్చారు. అదీ ఈ టపా నేపథ్యం. లక్ష్మీధరరెడ్డి గారి వ్యాఖ్యలూ వాటికి నా స్పందన, సమాధానాలు వాటి క్రింద. (ఆ వ్యాసాన్నీ దానిపై స్పందననూ పూర్తిగా ఆ పై రెండు లంకెల్లోనూ చదవవచ్చు.) ఇంకా మీటల పలక (కీబోర్డ్) … యూనికోడ్‌లో లోపాలు? చదవడం కొనసాగించండి
మొబైళ్ళలో తెలుగు → తెలుగులో మొబైళ్ళు
టూకీగా… ముందుగా తెలుగు మొబైళ్ళ కోసం నేను మొదలుపెట్టిన పిటిషనుకు స్పందించి దానిపై సంతకం చేసి, దాన్ని తమ మిత్రులతో పంచుకున్న వారందరికీ కృతజ్ఞతలు! మీ అందరివల్లా మొదటి వారంలోనే 200 సంతకాలు దాటాయి. ఇక దీన్ని మరింత మందికి చేర్చే ప్రయత్నం చేద్దాం. ఈ విన్నపంపై మీరింకా సంతకం చేసివుండకపోతే, ఇప్పుడే వెళ్ళి సంతకం చేయండి. దీన్ని మీ మిత్రులతోనూ, మీకు తెలిసిన మొబైల్ కంపెనీల సిబ్బంది తోనూ పంచుకోండి. చేతిఫోన్లను తెలుగులో ఉపయోగించుకోవడంలో ఇబ్బందులుంటే, … మొబైళ్ళలో తెలుగు → తెలుగులో మొబైళ్ళు చదవడం కొనసాగించండి
ఇన్‌స్క్రిప్ట్+ పూర్తిస్థాయి తెలుగు కీబోర్డు లేయవుటు
ప్రపంచవ్యాప్తంగా ఉన్న లిపులన్నింటినీ కంప్యూటర్లలో ఉపయోగించుకునేందుకు వీలుగా యూనికోడ్ కన్సార్టియమ్ అన్ని అక్షరాలకూ స్థిరమైన సంకేతబిందువులను కేటాయిస్తుంది. వీటిల్లో ప్రస్తుతం వాడుకలో ఉన్న అక్షరాలే కాకుండా, కాలగతిలో కలిసిపోయిన అక్షరాలు కూడా ఉంటాయి. పురాతన గ్రంథాలను సాంఖ్యీకరించడానికి ప్రాచీన అక్షరాల/గుర్తుల అవసరం ఉంటుంది కదా. ఇవన్నీ యూనికోడ్ ప్రమాణంలో ఉన్నంత మాత్రన అంతిమ వాడుకరులకు అందుబాటులో ఉండకపోవచ్చు. ఎందుకంటే, వాటిని టైపు చెయ్యడానికి ఒక పద్ధతో పరికరమో కావాలి కదా! భారతీయ భాషలకు సంబంధించి యూనికోడ్ 6.0 … ఇన్‌స్క్రిప్ట్+ పూర్తిస్థాయి తెలుగు కీబోర్డు లేయవుటు చదవడం కొనసాగించండి
అమెరికాలో తెలుగు సైన్‌బోర్డుతో రెస్టారెంట్
కాలిఫోర్నియా రాష్ట్రంలో సన్నీవేల్ నగరంలో ఇది కనబడింది. గూగుల్ పటంలో ఖచ్చితమైన స్థానం. పటంలో తాజ్ ఇండియా కుసైన్ ఉన్నచోటనే ఈ పెసరట్టు ఉంది. గూగుల్ పటాల్లో ఇంకా లేదంటే ఈ మధ్యనే పెట్టినట్టున్నారు. దీనిపై సమీక్షలు, గట్రా.
మొదటి అంతర్జాతీయ తెలుగు అంతర్జాల సమావేశం — ప్రారంభ సదస్సు నివేదిక
పోయిన నెలాఖరులో సిలికాన్ వ్యాలీలో జరిగిన మొట్టమొదటి అంతర్జాతీయ తెలుగు అంతర్జాల సమావేశానికి నేను హాజరయ్యాను. ఆ సమావేశపు ప్రారంభ సదస్సు యొక్క నివేదిక ఇది. నివేదికకు వెళ్ళేముందు రెండు ప్రశ్నలకు సమాధానాలు: అమెరికాలో ఎందుకు? సిలికాన్ వ్యాలీ సమాచార సాంకేతిక రంగానికి ప్రధాన కేంద్రం. సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేస్తున్న తెలుగువారు అధిక సంఖ్యలో ఉన్నదీ ఇక్కడే. తెలుగు కోసం లేదా తెలుగు వారి కోసం వీరు చేసింది తక్కువే. వీరి దృష్టిని ఆకర్షించడం అన్నది ఈ … మొదటి అంతర్జాతీయ తెలుగు అంతర్జాల సమావేశం — ప్రారంభ సదస్సు నివేదిక చదవడం కొనసాగించండి