నేను పాడ్‌కాస్ట్ మొదలుపెట్టానోచ్!

నా పాడ్‌కాస్టు పేరు మాటల మూటలు. ఇది మన తెలుగు మాటల గురించి. మనం మర్చిపోతున్న తెలుగు మాటల్ని, అసలు మనం తెలుసుకోలేకపోయిన మాటలనూ, తిరిగి తెలుసుకునే ప్రయత్నంగా దీన్ని ఆరంభించాను. విన్న ప్రతీ ఒక్కరికీ, ఒక్కో భాగంలో ఒక్కో కొత్తమాట తెలిసినా అదే పదివేలు. మాటల మూటలు పాడ్‌కాస్టు వెబ్‌సైటు తెరపట్టు దీన్ని ఆపిల్ పాడ్‌కాస్ట్స్, గూగుల్ పాడ్‌కాస్ట్స్, స్పాటిఫై వంటి అన్ని రకాల పాడ్‌కాస్ట్ అనువర్తనాలలోనూ వినవచ్చు. లేదా నేరుగా జాలం లోనూ వినవచ్చు. … నేను పాడ్‌కాస్ట్ మొదలుపెట్టానోచ్! ‌చదవడం కొనసాగించండి

తెలుగు వినియోగదారులకు (భాషాభిమానులకు) మేలుకొలుపు

మన రోజువారీ జీవనంలో అనేక వస్తువులని వినియోగిస్తూంటాం, అనేక సేవలు పొందుతుంటాం. టూత్ పేస్టు నుండి గదిలో ఫ్యాను వరకూ, పచారీ సరుకులు ఇంటికే తెప్పించుకోవడం నుండి బీమా, బ్యాంకు సేవల వరకు. అయితే, వీటిలో ఎన్ని తెలుగులో ఉంటున్నాయి? ఆ పరిస్థితిని మనం ఎలా మార్చవచ్చు?

లంకెబిందెలు – 2

“ఇంగ్లీషు మాటల వాడుకకు ఏడు నియమాలు, రచనకి ఉపయోగపడే పదకొండు సూత్రాలు, రచన రూపం నిర్దేశించే కొన్ని వివరాలు, రాసేటప్పుడు చాలామంది చేసే కొన్ని దుష్ప్రయోగాలు – ఇవి, [ ది ఎలిమెంట్స్ ఆఫ్ స్టైల్ ] పుస్తకంలో కూర్చబడ్డాయి. […] ఇప్పటి వరకూ మనకి [తెలుగు] వాడుకభాష వ్యాకరణంపై పుస్తకం లేదు. వాక్యంలో ఎప్పుడు, ఎక్కడ ఏ విరామచిహ్నాలు పెట్టాలో సూచించే పుస్తకం లేదు. అంతే కాదు, వాడుకభాషలో రాసినప్పుడు వాక్యనిర్మాణం ఎట్లా ఉండాలో నేర్పే … లంకెబిందెలు – 2 ‌చదవడం కొనసాగించండి

తమిళులు తెలుగు లిపి నేర్చుకోడానికి పనిముట్లు

తమిళులు (ఇంకా ఇతరత్రా కారణాల వల్ల తమిళం మొదటి భాషగా నేర్చుకున్నవారూ) తెలుగు లిపిని నేర్చుకోడానికి ప్రయత్నిస్తే వారికి ఎదురయ్యే ఇబ్బందుల్లో మొదటిది, అందరమూ ఊహించేది, మూల అక్షరాల రూపాల్లో భేదం. రెండవ ఇబ్బంది తెలుగు లిపికి ఉన్న ప్రత్యేక లక్షణాలు తమిళ లిపికి లేకపోవడం (ఇది అనూహ్యం). వెల్లడింపు: నాకు తమిళం రాదు. ఐదారు పదాలు తెలుసు, నాలుగైదు అక్షరాలు గుర్తుపట్టగలను. తెలుగు నేర్పడం గురించీ దానిలోని సమస్యల గురించీ అవగాహన తక్కువే. ఈ టపా … తమిళులు తెలుగు లిపి నేర్చుకోడానికి పనిముట్లు ‌చదవడం కొనసాగించండి

తెలుగు భాషకి ఆధునిక హోదా: జాలమే వేదిక!

కొన్నాళ్ళ క్రితం ప్రజ బ్లాగులో తెలుగు భాషకు ప్రాచీన హోదా వల్ల ఒరిగేది ఏమైనా ఉందా? అన్న ప్రశ్న వచ్చింది. (విచారకరంగా ఆ టపా ఇప్పుడు అందుబాటులో లేదు.) దానిపై రహ్మనుద్దీన్ తన ఆలోచనలను మరో టపాలో పంచుకున్నాడు. దీని ద్వారా కొంతవరకూ మూల టపా సారాంశాన్ని గ్రహించవచ్చు. ప్రజ టపాకి నేను స్పందిస్తూ ప్రాచీన హోదా, తత్ఫలిత విశిష్ట కేంద్రమూ సామాన్యులకి నేరుగా ఉపయోగపడకపోవచ్చు కానీ వాటివల్ల చరిత్ర సాహిత్య రంగాలకు ఏదైనా ప్రయోజనం ఉండొచ్చు … తెలుగు భాషకి ఆధునిక హోదా: జాలమే వేదిక! ‌చదవడం కొనసాగించండి

తెలుగులో a.m. p.m.?

ఆంగ్లంలో 12-గంటల ఫార్మాటులో సమయాన్ని చెప్పేప్పుడు మధ్యాహ్నానానికి ముందో తర్వాతో సూచించడానికి a.m. అనీ p.m. అనీ వాడతాం. తెలుగులో అయితే, మాట్లాడేటప్పుడు తడుముకోకుండా ఉదయం/పొద్దున్న/మార్నింగు 8 గంటలకు అనో, రాత్రి/నైటు 8 గంటలకు అనో తెల్లవారు 5 గంటలకు అనో, సాయంకాలం/ఈవెనింగు 5 గంటలకు అనో అంటాం. కానీ కంప్యూటర్లోనో లేదా వేరే డిస్‌ప్లేలలో సమయాన్ని తక్కువ అక్షరాలతో సూచించాల్సి వచ్చినప్పుడు లేదా సాంకేతికంగా లాంఛనప్రాయంగా వాడాల్సివచ్చినప్పుడు తెలుగులో (ఏయెమ్, పీయెమ్ కాకుండా) ఏ పదాలను … తెలుగులో a.m. p.m.? ‌చదవడం కొనసాగించండి

యూనికోడ్‌లో లోపాలు?

ఆంధ్రభూమి పత్రికలో నుడి అనే శీర్షికలో వచ్చిన సాంకేతిక భాషగా తెలుగు వ్యాసానికి స్పందిస్తూ కేతిరెడ్డి లక్ష్మీధరరెడ్డి అనే పాఠకుడు తన అభిప్రాయాలను సందేహాలను పంపించారు. వీటిపై స్పందిస్తే బాగుంటుందని కొత్తపాళీ గారు దీన్ని నా దృష్టికి తీసుకువచ్చారు. అదీ ఈ టపా నేపథ్యం. లక్ష్మీధరరెడ్డి గారి వ్యాఖ్యలూ వాటికి నా స్పందన, సమాధానాలు వాటి క్రింద. (ఆ వ్యాసాన్నీ దానిపై స్పందననూ పూర్తిగా ఆ పై రెండు లంకెల్లోనూ చదవవచ్చు.) ఇంకా మీటల పలక (కీబోర్డ్) … యూనికోడ్‌లో లోపాలు? ‌చదవడం కొనసాగించండి

మీడియావికీ మరియు ఇతర ఉపకరణాల స్థానికీకరణ

మీరు తెలుగు వికీపిడీయాకి వెళ్తే, వ్యాసాలు మాత్రమే కాక తతిమా సైటు అంతా తెలుగులోనే కనిపిస్తుంది. అలా సైటు మొత్తాన్నీ తెలుగులోనికి తీసుకువచ్చే ప్రక్రియని స్థానికీకరణ అంటారు. ఈ విషయంపై అవగాహనకు మీడియావికీ స్థానికీకరణ గురించిన ఈ స్వబోధక ప్రదర్శనని చూడండి: దానిలో చెప్పినట్టుగా మీడియావికీ (అంటే వికీపిడియా వెనకవున్న ఉపకరణం) యొక్క స్థానికీకరణ translatewiki.net వద్ద జరుగుతుంది. అక్కడ అదొక్కటే కాకుండా, స్టేటస్.నెట్, ఓపెన్‌స్ట్రీట్‌మ్యాప్, వికియా, వికీరీడర్, షపడూ వంటి మరెన్నో ఉపకరణాల స్థానికీకరణ కూడా … మీడియావికీ మరియు ఇతర ఉపకరణాల స్థానికీకరణ ‌చదవడం కొనసాగించండి

తెలుగు అంతర్జాల సదస్సుపై నా నివేదిక

ఈ శనివారం హైదరాబాదు లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (MCRHRD) లో జరిగిన తెలుగు అంతర్జాల సదస్సు గురించి మీకు ఇప్పటికే తెలిసివుంటుంది. ఆ సదస్సుపై నా నివేదిక ఇది. ఇది అసంపూర్ణమే. ఆ ఆనందోత్సాహలూ ప్రేరణా ఈ టపాలో ప్రతిబింబించకపోవచ్చు. ఈ సదస్సుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమాచార సాంకేతిక శాఖ సౌజన్యంతో సిలికానాంధ్ర నిర్వహించింది. ఈ సదస్సులో రాష్ట్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యగారు ముఖ్య అతిథిగానూ, మాజీ … తెలుగు అంతర్జాల సదస్సుపై నా నివేదిక ‌చదవడం కొనసాగించండి